IT News: రూ.2 కోట్లు జీతం చెల్లించేందుకు కంపెనీలు రెడీ.. కానీ దొరకని టెక్కీలు..!!

9 months ago 391
ARTICLE AD

AI Jobs: ఈ రోజుల్లో ప్యాషన్‌తో కంటే పేమెంట్, ప్యాకేజీల వెనకు పడి చాలా మంది తాము పనిచేస్తున్న రంగాల్లో వేగంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఉద్యోగులకు ఊహించని ప్యాకేజీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి

ఈ క్రమంలో తమకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న టెక్కీలకు రూ.2 కోట్ల వరకు జీతం చెల్లించటానికి సంస్థలు సిద్ధంగా మార్కెట్లో ఉన్నాయి. ఇంత భారీ మెుత్తంలో జీతం ఆఫర్ చేస్తున్న జనం కొరత వారిని వేధిస్తోంది. నేటి టెక్ ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన సాంకేతికతల్లో ChatGPT ఒకటిగా ఉంది. 2022లో అధికారికంగా ప్రకటించబడిన ఈ టెక్నాలజీ ప్రజలకు అందుబాటులోకి రానుండటంతో వీటికి అవసరమైన టెక్కీల లభ్యత తక్కువగా ఉంది.

దీనివల్ల అవసరమైన నైపుణ్యాలు కలిగిన టెక్కీలకు ChatGPT, LLM, GENERATIVE AI రంగాల్లోని కంపెనీలు భారీ మెుత్తంలో జీతాలను ఆఫర్ చేసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో గూగుల్, ఓపెన్ ఏఐలలో పనిచేసిన చాలా మంది టెక్ నిపుణులు గత మూడు నెలల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎక్కువ జీతాలకు పోటీ కంపెనీల్లో చేరుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు తమ సొంత ఏఐ టెక్నాలజీ ఆధారిత కంపెనీలను ప్రారంభిస్తున్నారు. ఏఐ రంగంలో ప్రముఖ స్టార్టప్ కంపెనీ DataBricks.. ఇటీవల MosaicMLని సుమారు 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

MosaicML ప్రారంభించిన రెండేళ్ల తర్వాత 1.3 బిలియన్ డాలర్ల విలువతో భారీ లాభాలను పొందింది. ఫలితంగా చాలా మంది టెక్ నిపుణులు ఈ టెక్నాలజీలోకి ప్రవేశించి తమ సొంత కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత డిమాండ్ ఉన్న రంగంలో స్కిల్డ్ ఎంప్లాయిస్ వస్తే కచ్చితంగా రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల జీతానికి ఉద్యోగం లభిస్తుంది. అమెరికాలో వీటిపై పనిచేస్తున్న ఉద్యోగులకు లక్షల డాలర్లను కంపెనీలు జీతంగా అందించేందుకు ముందుకొస్తున్నాయి.

Read Entire Article