ఆసియాను గెలిచాం - నెక్స్ట్ ఏంటి? - మెగా టోర్నీకి ముందు టీమిండియాకు మినీ సవాల్
2018లో ఆసియా కప్ గెలిచిన తర్వాత ఐదేండ్లుగా మేజర్ ట్రోఫీ గెలవలేక చతికిలపడుతున్న భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంకతో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి 8వ ఆసియా కప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ ముందు భారత్‌కు ఈ విజయం ఉత్సాహాన్ని ఇచ్చేదే. అయితే ఆసియా కప్ - వన్డే వరల్డ్ కప్‌కు మధ్య భారత్‌కు ఓ మినీ పరీక్ష ఎదురుకానుంది. ఆ పరీక్షలో భారత్ కంగారూలను ఎదురోవాల్సి ఉంది. వన్డే వరల్డ్ కప్ కంటే ముందే భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ కప్ సన్నాహకాల్లోనే భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఈనెల 22 నుంచి మొదలుకానుంది. ఐదు రోజుల వ్యవధిలో భారత్ - ఆస్ట్రేలియాలు మూడు వన్డేలు ఆడనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం. భారత్ - ఆసీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ : - తొలి వన్డే : సెప్టెంబర్ 22 (శుక్రవారం) - మొహాలీ- రెండో వన్డే : సెప్టెంబర్ 24 (ఆదివారం) - ఇండోర్- మూడో వన్డే : సెప్టెంబర్ 27 (బుధవారం) - రాజ్‌కోట్ - ఈ మ్యాచ్‌లు అన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతాయి. వన్డే సిరీస్ తర్వాత భారత్ - ఆసీస్‌లు అక్టోబర్ 08న తమ వన్డే వరల్డ్ కప్ వేటను మొదలుపెడతాయి. చెన్నై వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా ఆసీస్ మరికొన్ని రోజులు భారత్‌లోనే ఉంటుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. 20‌24 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నాహకంగా ఈ సిరీస్‌ను నిర్వహించనున్నారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లైవ్.. - ఈ వన్డే సిరీస్ ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్‌లో అయితే స్పోర్ట్స్ 18లో.. యాప్స్, వెబ్‌సైట్స్‌లో అయితే జియో సినిమా యాప్‌లో చూడొచ్చు. ప్రస్తుతానికైతే జియో సినిమా యాప్ ఉచితంగానే అందుబాటులో ఉంది. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల హక్కులను ఇటీవలే వయాకామ్ 18 దక్కించుకున్న నేపథ్యంలో ఆ సంస్థకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. జట్లు : వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించిది. సౌతాఫ్రికా పర్యటనకు మిస్ అయిన పలువురు కీలక ఆటగాళ్లు భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. పాట్ కమిన్స్ సారథిగా ఉన్న ఈ జట్టులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి జట్టుతో చేరనున్నారు. ఈ సిరీస్‌ కోసం భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. A big boost for Australia as several key players return for the ODI series against India ????More ???? https://t.co/hr9xqqc8Wy pic.twitter.com/wu1VvZ0J9I — ICC (@ICC) September 17, 2023 ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, స్టీవ్ స్మిత్ , అలెక్స్ కేరీ, మార్నస్ లబూషేన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, జోష్ హెజిల్‌వుడ్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి Join Us on Telegram: https://t.me/abpdesamofficial

2018లో ఆసియా కప్ గెలిచిన తర్వాత ఐదేండ్లుగా మేజర్ ట్రోఫీ గెలవలేక చతికిలపడుతున్న భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంకతో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్లో ఘన విజయం సాధించి 8వ ఆసియా కప్ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ ముందు భారత్కు ఈ విజయం ఉత్సాహాన్ని ఇచ్చేదే. అయితే ఆసియా కప్ - వన్డే వరల్డ్ కప్కు మధ్య భారత్కు ఓ మినీ పరీక్ష ఎదురుకానుంది. ఆ పరీక్షలో భారత్ కంగారూలను ఎదురోవాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్ కంటే ముందే భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. వరల్డ్ కప్ సన్నాహకాల్లోనే భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఈనెల 22 నుంచి మొదలుకానుంది. ఐదు రోజుల వ్యవధిలో భారత్ - ఆస్ట్రేలియాలు మూడు వన్డేలు ఆడనున్నాయి. ఈ సిరీస్కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం.
భారత్ - ఆసీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ :
- తొలి వన్డే : సెప్టెంబర్ 22 (శుక్రవారం) - మొహాలీ
- రెండో వన్డే : సెప్టెంబర్ 24 (ఆదివారం) - ఇండోర్
- మూడో వన్డే : సెప్టెంబర్ 27 (బుధవారం) - రాజ్కోట్
- ఈ మ్యాచ్లు అన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతాయి.
వన్డే సిరీస్ తర్వాత భారత్ - ఆసీస్లు అక్టోబర్ 08న తమ వన్డే వరల్డ్ కప్ వేటను మొదలుపెడతాయి. చెన్నై వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా ఆసీస్ మరికొన్ని రోజులు భారత్లోనే ఉంటుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. 2024 టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని సన్నాహకంగా ఈ సిరీస్ను నిర్వహించనున్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లైవ్..
- ఈ వన్డే సిరీస్ ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్లో అయితే స్పోర్ట్స్ 18లో.. యాప్స్, వెబ్సైట్స్లో అయితే జియో సినిమా యాప్లో చూడొచ్చు. ప్రస్తుతానికైతే జియో సినిమా యాప్ ఉచితంగానే అందుబాటులో ఉంది. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్ల హక్కులను ఇటీవలే వయాకామ్ 18 దక్కించుకున్న నేపథ్యంలో ఆ సంస్థకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం.
జట్లు : వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించిది. సౌతాఫ్రికా పర్యటనకు మిస్ అయిన పలువురు కీలక ఆటగాళ్లు భారత్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నారు. పాట్ కమిన్స్ సారథిగా ఉన్న ఈ జట్టులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తిరిగి జట్టుతో చేరనున్నారు. ఈ సిరీస్ కోసం భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు.
A big boost for Australia as several key players return for the ODI series against India ????
More ???? https://t.co/hr9xqqc8Wy pic.twitter.com/wu1VvZ0J9I — ICC (@ICC) September 17, 2023
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, స్టీవ్ స్మిత్ , అలెక్స్ కేరీ, మార్నస్ లబూషేన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ వార్నర్, జోష్ హెజిల్వుడ్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
What's Your Reaction?






