‘చారి 111’ ట్రైలర్, ‘ఈగల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఓటీటీలోకి ‘ట్రూ లవర్’ - స్ట్రీమింగ్ అందులోనే!ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ‘ట్రూ లవర్’ ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. ఎన్నో తెలుగు సినిమాల మధ్య పోటీగా ఈ తమిళ డబ్బింగ్ చిత్రం విడుదలయినా కూడా యూత్ చాలామంది దీనిని చూడడానికి థియేటర్లకు వెళుతున్నారు. అందుకే యూత్ అటెన్షన్‌ను సంపాదించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ సినిమానే అయినా.. ‘ట్రూ లవర్’ ఓటీటీ రైట్స్ కోసం హాట్‌స్టార్ భారీగానే ఖర్చు పెట్టిందట. మణికందన్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘గుడ్ నైట్’ కూడా ఈ ఓటీటీలోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు ‘ట్రూ లవర్’ హక్కులను కూడా ఈ ఓటీటీనే దక్కించుకోవడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) 'ఊరు పేరు భైరవకోన' సెన్సార్ సర్టిఫికెట్ ఆపండి - సీబీఎఫ్‌సీకి నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదుసందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. అయితే మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ ఆపాలంటూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సెన్సార్ అధికారుల మీద ఫిర్యాదు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాయడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) ‘చారి 111’ ట్రైలర్: సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేసిన ఏజెంట్ - కితకితలు పెడుతోన్న వెన్నెల కిశోర్టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌మిళ బ్యూటీ సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేక‌ర్స్  ప్ర‌మోష‌న్స్ ముమ్మరం చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్‌ టీజర్‌ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) వెనక్కి తగ్గని ‘ఈగల్’ - మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?మాస్ మహారాజా రవితేజ.. చాలాకాలం తర్వాత ‘ఈగల్’తో కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఫిబ్రవరీ 9న విడుదలయిన ఈ చిత్రం మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్ నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. పలు ప్రాంతాల్లో ‘ఈగల్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం పరవాలదేనిపిస్తోంది. ఫస్ట్ డే లాగానే రెండోరోజు, మూడోరోజు కలెక్షన్స్ కూడా సాగుతుండడంతో మెల్లగా మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటే బాగుంటుందని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) ‘ది కేరళ స్టోరీ’ to ‘నా సామిరంగ’ - ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!సంక్రాంతి బరిలో నిలిచిన ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘కెప్టెన్ మిల్లర్’ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టగా, ఈ వారం అక్కినేని నాగార్జున మూవీ ‘నా సామిరంగ’ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గత ఏడాది మేలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది.సుమారు 9 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. మొత్తంగా ఈ వారం 20కి పైగా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం  ఓటీటీల్లో ఏయే సినిమాలు రాబోతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Feb 12, 2024 - 18:00
 0  0
‘చారి 111’ ట్రైలర్, ‘ఈగల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఓటీటీలోకి ‘ట్రూ లవర్’ - స్ట్రీమింగ్ అందులోనే!
ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ‘ట్రూ లవర్’ ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. ఎన్నో తెలుగు సినిమాల మధ్య పోటీగా ఈ తమిళ డబ్బింగ్ చిత్రం విడుదలయినా కూడా యూత్ చాలామంది దీనిని చూడడానికి థియేటర్లకు వెళుతున్నారు. అందుకే యూత్ అటెన్షన్‌ను సంపాదించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ సినిమానే అయినా.. ‘ట్రూ లవర్’ ఓటీటీ రైట్స్ కోసం హాట్‌స్టార్ భారీగానే ఖర్చు పెట్టిందట. మణికందన్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘గుడ్ నైట్’ కూడా ఈ ఓటీటీలోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు ‘ట్రూ లవర్’ హక్కులను కూడా ఈ ఓటీటీనే దక్కించుకోవడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'ఊరు పేరు భైరవకోన' సెన్సార్ సర్టిఫికెట్ ఆపండి - సీబీఎఫ్‌సీకి నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. అయితే మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ ఆపాలంటూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సెన్సార్ అధికారుల మీద ఫిర్యాదు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాయడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘చారి 111’ ట్రైలర్: సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేసిన ఏజెంట్ - కితకితలు పెడుతోన్న వెన్నెల కిశోర్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌మిళ బ్యూటీ సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మేక‌ర్స్  ప్ర‌మోష‌న్స్ ముమ్మరం చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్‌ టీజర్‌ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వెనక్కి తగ్గని ‘ఈగల్’ - మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
మాస్ మహారాజా రవితేజ.. చాలాకాలం తర్వాత ‘ఈగల్’తో కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఫిబ్రవరీ 9న విడుదలయిన ఈ చిత్రం మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్ నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. పలు ప్రాంతాల్లో ‘ఈగల్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం పరవాలదేనిపిస్తోంది. ఫస్ట్ డే లాగానే రెండోరోజు, మూడోరోజు కలెక్షన్స్ కూడా సాగుతుండడంతో మెల్లగా మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటే బాగుంటుందని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ది కేరళ స్టోరీ’ to ‘నా సామిరంగ’ - ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!
సంక్రాంతి బరిలో నిలిచిన ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘కెప్టెన్ మిల్లర్’ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టగా, ఈ వారం అక్కినేని నాగార్జున మూవీ ‘నా సామిరంగ’ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గత ఏడాది మేలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది.సుమారు 9 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. మొత్తంగా ఈ వారం 20కి పైగా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం  ఓటీటీల్లో ఏయే సినిమాలు రాబోతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow