లీటర్‌ పెట్రోల్‌పై రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 చొప్పున పెంపు- భగ్గుమంటున్న ప్రజలు

ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ ఇప్పట్లో బయటపడేలా లేదు. ఆ దేశంలో పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ధరల భారం మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌కు 330కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు...తొలిసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుండడం వల్లే చమురు ధరలు పెంచాల్సి వస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  పెట్రోల్‌పై లీటర్‌కు రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 చొప్పున పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్‌, హైస్పీడ్‌ డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.330కు చేరాయి. ఆగస్టు 15 తర్వాత పెట్రోల్‌పై రూ.32, డీజిల్‌ రూ.38 చొప్పున  ప్రభుత్వం పెంచింది. బెయిలవుట్‌ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు పెట్రోల్‌ 60, హైస్పీడ్‌ డీజిల్‌పై రూ.50 చొప్పున ప్రభుత్వం అభివృద్ధి సుంకం విధిస్తోంది. ప్రస్తుతం డాలరుతో పాకిస్థానీ రూపాయి విలువ రూ.296.41గా ఉంది. ఆగస్టు నెలలో 27.4 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. పెరిగిన ధరలు అక్కడి ప్రజా, ప్రైవేటు రవాణా వాహనదారులకు భారంగా మారింది. ధరల పెరుగుదలను పాకిస్థాన్‌లోని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. జమాత్‌-ఇ-ఇస్లామీ పార్టీ ఆందోళన చేయాలని నిర్ణయించింది.   పీఓకేలోని స్థానిక యంత్రాంగాలు పాక్‌ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా తయారయ్యాయి. గోధుమ పిండి కొరత నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం.. ప్రజలను పస్తులు ఉంచుతోంది. గోధుమల దిగుమతిపైనా అధిక పన్నులు విధిస్తున్నారు. గిల్గిట్‌, బాల్టిస్థాన్‌, పర్యటకానికి ప్రసిద్ధి. అలాంటి ప్రదేశాల్లో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.పీఓకేలోని స్థానిక యంత్రాంగాలు పాక్‌ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా తయారయ్యాయి. గోధుమ పిండి కొరత నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం.. ప్రజలను పస్తులు ఉంచుతోంది. గోధుమల దిగుమతిపైనా అధిక పన్నులు విధిస్తున్నారు. గిల్గిట్‌, బాల్టిస్థాన్‌, పర్యటకానికి ప్రసిద్ధి. అలాంటి ప్రదేశాల్లో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

Sep 17, 2023 - 06:00
 0  1
లీటర్‌ పెట్రోల్‌పై  రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 చొప్పున పెంపు- భగ్గుమంటున్న ప్రజలు

ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ ఇప్పట్లో బయటపడేలా లేదు. ఆ దేశంలో పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ధరల భారం మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌కు 330కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు...తొలిసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుండడం వల్లే చమురు ధరలు పెంచాల్సి వస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

పెట్రోల్‌పై లీటర్‌కు రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 చొప్పున పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్‌, హైస్పీడ్‌ డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.330కు చేరాయి. ఆగస్టు 15 తర్వాత పెట్రోల్‌పై రూ.32, డీజిల్‌ రూ.38 చొప్పున  ప్రభుత్వం పెంచింది. బెయిలవుట్‌ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు పెట్రోల్‌ 60, హైస్పీడ్‌ డీజిల్‌పై రూ.50 చొప్పున ప్రభుత్వం అభివృద్ధి సుంకం విధిస్తోంది. ప్రస్తుతం డాలరుతో పాకిస్థానీ రూపాయి విలువ రూ.296.41గా ఉంది. ఆగస్టు నెలలో 27.4 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. పెరిగిన ధరలు అక్కడి ప్రజా, ప్రైవేటు రవాణా వాహనదారులకు భారంగా మారింది. ధరల పెరుగుదలను పాకిస్థాన్‌లోని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. జమాత్‌-ఇ-ఇస్లామీ పార్టీ ఆందోళన చేయాలని నిర్ణయించింది.  

పీఓకేలోని స్థానిక యంత్రాంగాలు పాక్‌ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా తయారయ్యాయి. గోధుమ పిండి కొరత నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం.. ప్రజలను పస్తులు ఉంచుతోంది. గోధుమల దిగుమతిపైనా అధిక పన్నులు విధిస్తున్నారు. గిల్గిట్‌, బాల్టిస్థాన్‌, పర్యటకానికి ప్రసిద్ధి. అలాంటి ప్రదేశాల్లో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.పీఓకేలోని స్థానిక యంత్రాంగాలు పాక్‌ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా తయారయ్యాయి. గోధుమ పిండి కొరత నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం.. ప్రజలను పస్తులు ఉంచుతోంది. గోధుమల దిగుమతిపైనా అధిక పన్నులు విధిస్తున్నారు. గిల్గిట్‌, బాల్టిస్థాన్‌, పర్యటకానికి ప్రసిద్ధి. అలాంటి ప్రదేశాల్లో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow