APGENCO: ఏపీ జెన్‌కోలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ జెన్కో) పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.   వివరాలు.. మొత్తం ఖాళీలు: 26 * మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్) పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 31.08.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.  దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీని ఏపీజెన్‌కో చిరునామాకు పంపించాలి.  ఎంపిక విధానం: ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  జీతం: నెలకు రూ.25,000. పని ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), వీవీ రెడ్డి నగర్ (వైఎస్సార్‌ జిల్లా), నెలటూరు(ఎస్సీఎస్‌ఆర్‌ జిల్లా), ఎంసీఎల్‌ కోల్‌మైన్స్‌(ఒడిశా), ఎస్‌సీసీఎల్‌ కోల్‌మైన్స్‌(తెలంగాణ) తదితరాలు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  The Chief General Manager (Adm.,IS&ERP), 3rd Floor, Vidyut Soudha,APGENCO, Vijayawada – 520 004. ముఖ్యమైన తేదీలు…  ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.09.2023. ➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్ఫణకు చివరితేదీ: 30.09.2023. Notification Online Application Website ALSO READ: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలిముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలాహైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరంహైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Sep 14, 2023 - 22:00
 0  1
APGENCO: ఏపీ జెన్‌కోలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ జెన్కో) పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

వివరాలు..

మొత్తం ఖాళీలు: 26

* మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్) పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.08.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీని ఏపీజెన్‌కో చిరునామాకు పంపించాలి. 

ఎంపిక విధానం: ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం: నెలకు రూ.25,000.

పని ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), వీవీ రెడ్డి నగర్ (వైఎస్సార్‌ జిల్లా), నెలటూరు(ఎస్సీఎస్‌ఆర్‌ జిల్లా), ఎంసీఎల్‌ కోల్‌మైన్స్‌(ఒడిశా), ఎస్‌సీసీఎల్‌ కోల్‌మైన్స్‌(తెలంగాణ) తదితరాలు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 

The Chief General Manager (Adm.,IS&ERP), 
3rd Floor, Vidyut Soudha,
APGENCO, Vijayawada – 520 004.

ముఖ్యమైన తేదీలు… 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.09.2023.

➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్ఫణకు చివరితేదీ: 30.09.2023.

Notification

Online Application

Website

ALSO READ:

రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow