Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?

ది విచ్: పార్ట్ 1- ది సబ్‌వర్షన్ (The Witch: Part 1) 2018లో విడుదలైన సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ హార్రర్ సినిమా. ఒక సాధారణ కుటుంబంలోని అమ్మాయి సూపర్ హ్యూమన్ పవర్స్‌తో అసాధారణంగా ఎలా మారింది అనేది కథ. అనుక్షణం సస్పెన్స్‌తో కట్టిపడేసే ఈ ఫిల్మ్ రెండు పార్టులుగా విడుదలై సంచలనం సృష్టించింది. మూడో భాగం కూడా ఉండబోతోంది. కథ విషయానికొస్తే.. ఒక ల్యాబొరేటరీలో చాలామంది ఘోరంగా చంపబడి కనబడతారు. ఆ ల్యాబ్ నుంచి పరిగెడుతూ ఒక చిన్నపిల్ల బయటకొస్తుంది. ఆ ల్యాబ్‌ను నడుపుతున్నవారు డాక్టర్ బేక్, మిస్టర్ చోయ్. వీళ్లు ఆ చిన్నపిల్ల చనిపోయిందని అనుకుంటారు. ఆ అమ్మాయి పొలంలో కిందపడిపోతుంది. ఆ పొలం యజమానులు ఆమెను కాపాడి దత్తత తీసుకుంటారు. ఆ అమ్మాయి జా-యూన్. పది సంవత్సరాల తర్వాత ఎలాంటి గతం గుర్తులేకుండా సాధారణమైన జీవితం గడుపుతుంటుంది. వారి కుటుంబం డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడుతుంటుంది. ఆమె తల్లికి డిమెన్షియా వ్యాధి ఉంటుంది. జా-యూన్ కూడా మైగ్రేన్స్ తో బాధ పడుతుంటుంది. ఒక సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి డబ్బు సంపాదించాలనుకొని, పోటీకి వెళ్లి పాట పాడి, తనకున్న టెలీకైనటిక్ స్కిల్‌ను ఉపయోగించి జడ్జెస్‌ను ఇంప్రెస్ చేస్తుంది.  ఈ జా-యూన్ ఆ రోజు ల్యాబ్ నుంచి తప్పించుకున్న అమ్మాయేనని డాక్టర్ బేక్, డాక్టర్ చోయ్ గుర్తుపడుతారు. ఆమెను తిరిగి పట్టుకోవటానికి మనుషుల్ని పంపిస్తారు. రెండో రౌండ్ ఆడిషన్ కోసం వెళ్తున్నపుడు ఆమెని నోబుల్ మ్యాన్ అనే ఒక వ్యక్తి కలుస్తాడు. ఆమె గురించి అన్ని విషయాలు తనకు తెలుసని చెప్తాడు. తర్వాత ఆయుధాలతో వచ్చిన డాక్టర్ బేక్ మనుషులను జా-యూన్ సూపర్ హ్యూమన్ పవర్స్‌తో ఎదిరిస్తుంది. తనకు ఇంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాని ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. తనతో పాటు వచ్చేయక పోతే తన పేరెంట్స్‌ను చంపుతానని నోబుల్ మ్యాన్ అనటంతో జా-యూన్ నోబుల్ మ్యాన్ తో తిరిగి ఆ ల్యాబ్‌కు వెళ్తుంది. జా-యూన్‌ను జెనెటికల్ గా సూపర్ హ్యూమన్ పవర్స్‌తో తయారు చేసింది తనేనని, తనకున్న మైగ్రేన్స్ ట్రీట్ చేయకపోతే ప్రమాదమని డాక్టర్ బేక్ చెప్తుంది. జా-యూన్‌కు బ్లూ సీరం ఇచ్చి ఈ వ్యాధి నెల వరకు కంట్రోల్ ఉంటుందని చెప్పి, తనను డ్రగ్స్ కోసం వారి దగ్గర తిప్పుకుంటారు. అసలు విషయమేమిటంటే.. జా-యూన్ తన వ్యాధి గురించి ఎప్పుడో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్లి, వివరాలు తెలుసుకుంటుంది. ఆ డాక్టర్.. బ్లడ్ రిలేటివ్స్ బోన్ మ్యారోను తనకు ట్రాన్స్ ప్లాంట్ చేయకపోతే కొద్ది నెలల్లోనే చనిపోతావని చెప్తాడు. ఆమె వ్యాధికి క్యూర్ కనిపెట్టడానికి ఆ ఆడిషన్లో కావాలనే తన స్కిల్స్ ప్రదర్శించి డాక్టర్ బేక్ వాళ్లు తనను చూసేలా చేస్తుంది. అంటే తన పేరెంట్స్ సొంత పేరెంట్స్ కారని, ఎవరు సమస్య క్రియేట్ చేశారో వాళ్ల దగ్గరికే వెళ్లాలని తనకు ముందే తెలుసు. ఆమెను ట్రాప్ చేశాననుకుంటున్న డాక్టర్స్ బేక్‌ను జా-యూన్ యే తన ప్లాన్ తో ట్రాప్ చేస్తుంది.  ఆమె తన పవర్స్ తో వాళ్లందర్నీ చంపేసి బయటకొస్తుంది. మూడు నెలల తర్వాత జా-యూన్ డాక్టర్ బేక్ వాళ్ల ట్విన్ సిస్టర్ ఇంట్లో కనపడుతుంది. ఆమె జా-యూన్ కు ఇంకొన్ని సీరం పాట్స్ ఇస్తుంది. అక్కడ ముఖం మీద గీతలతో ముసుగేసుకొని ఒకామె వస్తుంది. తనను ముట్టుకుంటే చంపేస్తానంటుంది జా-యూన్.. అక్కడితో సినిమా అయిపోతుంది. జా-యూన్‌కు ఉన్న ఆ విచ్ పవర్స్ ఏంటి? ఆమె గతం తాలూకూ జ్ఞాపకాలు ఎందుకు అంతలా కనపడుతున్నాయి.. అనే విషయాలు మొదటి పార్ట్ లో తేలకుండా మిస్టీరియస్ గానే ఉండిపోతాయి. 

Apr 19, 2024 - 20:00
 0  1
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?

ది విచ్: పార్ట్ 1- ది సబ్‌వర్షన్ (The Witch: Part 1) 2018లో విడుదలైన సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ హార్రర్ సినిమా. ఒక సాధారణ కుటుంబంలోని అమ్మాయి సూపర్ హ్యూమన్ పవర్స్‌తో అసాధారణంగా ఎలా మారింది అనేది కథ. అనుక్షణం సస్పెన్స్‌తో కట్టిపడేసే ఈ ఫిల్మ్ రెండు పార్టులుగా విడుదలై సంచలనం సృష్టించింది. మూడో భాగం కూడా ఉండబోతోంది.

కథ విషయానికొస్తే.. ఒక ల్యాబొరేటరీలో చాలామంది ఘోరంగా చంపబడి కనబడతారు. ఆ ల్యాబ్ నుంచి పరిగెడుతూ ఒక చిన్నపిల్ల బయటకొస్తుంది. ఆ ల్యాబ్‌ను నడుపుతున్నవారు డాక్టర్ బేక్, మిస్టర్ చోయ్. వీళ్లు ఆ చిన్నపిల్ల చనిపోయిందని అనుకుంటారు. ఆ అమ్మాయి పొలంలో కిందపడిపోతుంది. ఆ పొలం యజమానులు ఆమెను కాపాడి దత్తత తీసుకుంటారు.

ఆ అమ్మాయి జా-యూన్. పది సంవత్సరాల తర్వాత ఎలాంటి గతం గుర్తులేకుండా సాధారణమైన జీవితం గడుపుతుంటుంది. వారి కుటుంబం డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడుతుంటుంది. ఆమె తల్లికి డిమెన్షియా వ్యాధి ఉంటుంది. జా-యూన్ కూడా మైగ్రేన్స్ తో బాధ పడుతుంటుంది. ఒక సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి డబ్బు సంపాదించాలనుకొని, పోటీకి వెళ్లి పాట పాడి, తనకున్న టెలీకైనటిక్ స్కిల్‌ను ఉపయోగించి జడ్జెస్‌ను ఇంప్రెస్ చేస్తుంది. 

ఈ జా-యూన్ ఆ రోజు ల్యాబ్ నుంచి తప్పించుకున్న అమ్మాయేనని డాక్టర్ బేక్, డాక్టర్ చోయ్ గుర్తుపడుతారు. ఆమెను తిరిగి పట్టుకోవటానికి మనుషుల్ని పంపిస్తారు. రెండో రౌండ్ ఆడిషన్ కోసం వెళ్తున్నపుడు ఆమెని నోబుల్ మ్యాన్ అనే ఒక వ్యక్తి కలుస్తాడు. ఆమె గురించి అన్ని విషయాలు తనకు తెలుసని చెప్తాడు. తర్వాత ఆయుధాలతో వచ్చిన డాక్టర్ బేక్ మనుషులను జా-యూన్ సూపర్ హ్యూమన్ పవర్స్‌తో ఎదిరిస్తుంది. తనకు ఇంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాని ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. తనతో పాటు వచ్చేయక పోతే తన పేరెంట్స్‌ను చంపుతానని నోబుల్ మ్యాన్ అనటంతో జా-యూన్ నోబుల్ మ్యాన్ తో తిరిగి ఆ ల్యాబ్‌కు వెళ్తుంది.

జా-యూన్‌ను జెనెటికల్ గా సూపర్ హ్యూమన్ పవర్స్‌తో తయారు చేసింది తనేనని, తనకున్న మైగ్రేన్స్ ట్రీట్ చేయకపోతే ప్రమాదమని డాక్టర్ బేక్ చెప్తుంది. జా-యూన్‌కు బ్లూ సీరం ఇచ్చి ఈ వ్యాధి నెల వరకు కంట్రోల్ ఉంటుందని చెప్పి, తనను డ్రగ్స్ కోసం వారి దగ్గర తిప్పుకుంటారు. అసలు విషయమేమిటంటే.. జా-యూన్ తన వ్యాధి గురించి ఎప్పుడో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్లి, వివరాలు తెలుసుకుంటుంది. ఆ డాక్టర్.. బ్లడ్ రిలేటివ్స్ బోన్ మ్యారోను తనకు ట్రాన్స్ ప్లాంట్ చేయకపోతే కొద్ది నెలల్లోనే చనిపోతావని చెప్తాడు. ఆమె వ్యాధికి క్యూర్ కనిపెట్టడానికి ఆ ఆడిషన్లో కావాలనే తన స్కిల్స్ ప్రదర్శించి డాక్టర్ బేక్ వాళ్లు తనను చూసేలా చేస్తుంది. అంటే తన పేరెంట్స్ సొంత పేరెంట్స్ కారని, ఎవరు సమస్య క్రియేట్ చేశారో వాళ్ల దగ్గరికే వెళ్లాలని తనకు ముందే తెలుసు. ఆమెను ట్రాప్ చేశాననుకుంటున్న డాక్టర్స్ బేక్‌ను జా-యూన్ యే తన ప్లాన్ తో ట్రాప్ చేస్తుంది. 

ఆమె తన పవర్స్ తో వాళ్లందర్నీ చంపేసి బయటకొస్తుంది. మూడు నెలల తర్వాత జా-యూన్ డాక్టర్ బేక్ వాళ్ల ట్విన్ సిస్టర్ ఇంట్లో కనపడుతుంది. ఆమె జా-యూన్ కు ఇంకొన్ని సీరం పాట్స్ ఇస్తుంది. అక్కడ ముఖం మీద గీతలతో ముసుగేసుకొని ఒకామె వస్తుంది. తనను ముట్టుకుంటే చంపేస్తానంటుంది జా-యూన్.. అక్కడితో సినిమా అయిపోతుంది. జా-యూన్‌కు ఉన్న ఆ విచ్ పవర్స్ ఏంటి? ఆమె గతం తాలూకూ జ్ఞాపకాలు ఎందుకు అంతలా కనపడుతున్నాయి.. అనే విషయాలు మొదటి పార్ట్ లో తేలకుండా మిస్టీరియస్ గానే ఉండిపోతాయి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow