Bigg Boss Season 7 Day 15 Updates: దామినితో ‘డ్రామా’ గొడవ - పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన ప్రిన్స్ యావర్

బిగ్ బాస్ సీజన్ 7లో మరో నామినేషన్స్ గొడవ మొదలయ్యింది. నామినేషన్స్ అనగానే ఎప్పుడో జరిగిన కారణాలను ముందు వేసుకొని గొడవలు పెట్టుకోవడం సహజం. అది చూసే చాలావరకు బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం నామినేషన్స్ ముగిశాయి. ఇప్పటివరకు జరిగిన ప్రతీ నామినేషన్‌లో కంటెస్టెంట్స్ అంతా ముఖ్యంగా ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించేది. ఈసారి కూడా అదే అనిపించింది. ముఖ్యంగా దామినిని టార్గెట్ చేయాలని, తనను నామినేట్ చేయాలని కొందరు కంటెస్టెంట్స్ చర్చించుకొని మరీ ఒక నిర్ణయానికి వచ్చారు. దానివల్ల దామినికి, యావర్‌కు ‘డ్రామా’ గొడవ కూడా జరిగింది. యావర్ అసమర్థుడు అన్న దామిని..బిగ్ బాస్‌కు ముందు ప్రిన్స్ యావర్ అంటే ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. కానీ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన తర్వాత తనేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. కానీ యావర్.. చాలావరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని, తనకు ఏ భాష కూడా అర్థం కాక ఇబ్బందిపడుతున్నాడని ఇతర కంటెస్టెంట్స్ భావించేవారు. అదే విషయాన్ని తనకు నేరుగా చెప్పే ప్రయత్నం చేసినా.. తను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఈసారి నామినేషన్స్‌లో కూడా అదే జరిగింది. యావర్‌కు ఇతరులు చెప్పేది వినే మనస్థత్వం లేదనే కారణంతో దామిని.. తనను నామినేట్ చేసింది. మధ్యలో ‘డ్రామా’ అనే పదాన్ని ఉపయోగించింది. దీంతో యావర్‌కు మళ్లీ కోపమొచ్చింది. చంద్రముఖి తరహాలో వేరియెంట్స్ చూపించాడు. నేను డ్రామా చేస్తున్నానా..?రెండో పవర్ అస్త్రా కోసం జరిగిన పోటీలో యుద్ధాలే జరిగాయి. అందులో ఎక్కువగా యావర్ గొంతే వినిపించింది. అసలు పవర్ అస్త్రా కోసం ఇంకెవరు అర్హులు కాదు అన్నట్టుగా, అతడికి మాత్రమే అది దక్కాలి అన్నట్టుగా యావర్ ప్రవర్తన చాలామందికి తెలియదు. ఒకానొక సమయంలో అతడు విచక్షణ కోల్పోయాడు కూడా. నేడు జరిగిన నామినేషన్స్‌లో కూడా మళ్లీ అదే జరిగింది. అప్పటి గొడవను గుర్తుచేస్తూ.. ‘నువ్వు డ్రామా చేశావు’ అని యావర్‌ను ఉద్దేశించి చెప్పింది యావర్. ఆ మాటకు యావర్ మళ్లీ రచ్చ చేయడం మొదలుపెట్టాడు. ‘నేను డ్రామా చేస్తున్నానంట’ అంటూ పిచ్చిగా అరుస్తూ తిరిగాడు. పలువురు కంటెస్టెంట్స్ తనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు కానీ మరోసారి యావర్ తన విచక్షణను కోల్పోయినట్టుగా అనిపించింది.  శుభశ్రీ, యావర్ కలిసి..దామిని విషయంలో యావర్, శుభశ్రీ ముందు నుండే కోపంగా ఉన్నారు. ఒకరితో ఒకరికి వస్తున్న చిన్న చిన్న మనస్పర్థలను పెద్ద గొడవ వరకు తీసుకొస్తున్నారు. అందుకే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అవ్వకముందే దామినిని నామినేట్ చేయాలని శుభశ్రీ, యావర్ డిసైడ్ అయిపోయారు. ఇక శుభశ్రీ కూడా ఇంటి పనుల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే కారణంతో చాలామంది తనను నామినేట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యి రెండు వారాలు అవుతున్నా.. శుభశ్రీ ఒకసారి కూడా నామినేషన్స్‌లో లేదు. అలా లేకపోవడానికి కారణం తను సేఫ్ గేమ్ ఆడడమే అని పలువురు కంటెస్టెంట్స్ తనను నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. మొదటిసారి నామినేషన్స్‌లో ఉండడంతో తట్టుకోలేకపోయిన శుభశ్రీ.. కంటెస్టెంట్స్ చెప్పేది వినకుండా మొండిగా వాగ్వాదానికి దిగింది. Also Read: నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అలా చేశాడు: జగపతి బాబు వ్యాఖ్యలు Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Sep 19, 2023 - 00:00
 0  0
Bigg Boss Season 7 Day 15 Updates: దామినితో ‘డ్రామా’ గొడవ - పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన ప్రిన్స్ యావర్

బిగ్ బాస్ సీజన్ 7లో మరో నామినేషన్స్ గొడవ మొదలయ్యింది. నామినేషన్స్ అనగానే ఎప్పుడో జరిగిన కారణాలను ముందు వేసుకొని గొడవలు పెట్టుకోవడం సహజం. అది చూసే చాలావరకు బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం నామినేషన్స్ ముగిశాయి. ఇప్పటివరకు జరిగిన ప్రతీ నామినేషన్‌లో కంటెస్టెంట్స్ అంతా ముఖ్యంగా ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించేది. ఈసారి కూడా అదే అనిపించింది. ముఖ్యంగా దామినిని టార్గెట్ చేయాలని, తనను నామినేట్ చేయాలని కొందరు కంటెస్టెంట్స్ చర్చించుకొని మరీ ఒక నిర్ణయానికి వచ్చారు. దానివల్ల దామినికి, యావర్‌కు ‘డ్రామా’ గొడవ కూడా జరిగింది.

యావర్ అసమర్థుడు అన్న దామిని..
బిగ్ బాస్‌కు ముందు ప్రిన్స్ యావర్ అంటే ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. కానీ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన తర్వాత తనేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. కానీ యావర్.. చాలావరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని, తనకు ఏ భాష కూడా అర్థం కాక ఇబ్బందిపడుతున్నాడని ఇతర కంటెస్టెంట్స్ భావించేవారు. అదే విషయాన్ని తనకు నేరుగా చెప్పే ప్రయత్నం చేసినా.. తను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఈసారి నామినేషన్స్‌లో కూడా అదే జరిగింది. యావర్‌కు ఇతరులు చెప్పేది వినే మనస్థత్వం లేదనే కారణంతో దామిని.. తనను నామినేట్ చేసింది. మధ్యలో ‘డ్రామా’ అనే పదాన్ని ఉపయోగించింది. దీంతో యావర్‌కు మళ్లీ కోపమొచ్చింది. చంద్రముఖి తరహాలో వేరియెంట్స్ చూపించాడు.

నేను డ్రామా చేస్తున్నానా..?
రెండో పవర్ అస్త్రా కోసం జరిగిన పోటీలో యుద్ధాలే జరిగాయి. అందులో ఎక్కువగా యావర్ గొంతే వినిపించింది. అసలు పవర్ అస్త్రా కోసం ఇంకెవరు అర్హులు కాదు అన్నట్టుగా, అతడికి మాత్రమే అది దక్కాలి అన్నట్టుగా యావర్ ప్రవర్తన చాలామందికి తెలియదు. ఒకానొక సమయంలో అతడు విచక్షణ కోల్పోయాడు కూడా. నేడు జరిగిన నామినేషన్స్‌లో కూడా మళ్లీ అదే జరిగింది. అప్పటి గొడవను గుర్తుచేస్తూ.. ‘నువ్వు డ్రామా చేశావు’ అని యావర్‌ను ఉద్దేశించి చెప్పింది యావర్. ఆ మాటకు యావర్ మళ్లీ రచ్చ చేయడం మొదలుపెట్టాడు. ‘నేను డ్రామా చేస్తున్నానంట’ అంటూ పిచ్చిగా అరుస్తూ తిరిగాడు. పలువురు కంటెస్టెంట్స్ తనకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు కానీ మరోసారి యావర్ తన విచక్షణను కోల్పోయినట్టుగా అనిపించింది. 

శుభశ్రీ, యావర్ కలిసి..
దామిని విషయంలో యావర్, శుభశ్రీ ముందు నుండే కోపంగా ఉన్నారు. ఒకరితో ఒకరికి వస్తున్న చిన్న చిన్న మనస్పర్థలను పెద్ద గొడవ వరకు తీసుకొస్తున్నారు. అందుకే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అవ్వకముందే దామినిని నామినేట్ చేయాలని శుభశ్రీ, యావర్ డిసైడ్ అయిపోయారు. ఇక శుభశ్రీ కూడా ఇంటి పనుల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే కారణంతో చాలామంది తనను నామినేట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యి రెండు వారాలు అవుతున్నా.. శుభశ్రీ ఒకసారి కూడా నామినేషన్స్‌లో లేదు. అలా లేకపోవడానికి కారణం తను సేఫ్ గేమ్ ఆడడమే అని పలువురు కంటెస్టెంట్స్ తనను నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. మొదటిసారి నామినేషన్స్‌లో ఉండడంతో తట్టుకోలేకపోయిన శుభశ్రీ.. కంటెస్టెంట్స్ చెప్పేది వినకుండా మొండిగా వాగ్వాదానికి దిగింది.

Also Read: నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అలా చేశాడు: జగపతి బాబు వ్యాఖ్యలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow