Brahmamudi Serial Today April 20th: కట్టలు తెంచుకున్న అపర్ణ ఆగ్రహం, రాజ్ కు వారం రోజులే గడువు

Brahmamudi Today episode: ఇంట్లో రాజ్ వాళ్ళ బిడ్డ ఎవరో అని ఆరాతీస్తారు. వాడు కనీసం నోరు ఇప్పకపోవటం వాడి మూర్ఖత్వం, వాడు కన్న తల్లిని కూడా వదిలేసుకోటానికి సిద్దమవవుతున్నాడు అందుకే ఒక వారం రోజుల్లో నిజం చెప్పాలి. లేకపోతే ఇంటినుండి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెడుతుంది అపర్ణ . చేసేదేం లేక అందరూ అక్కడినుంచి వెళ్ళిపోతారు. రాజ్ ని గెంటేసే పరిస్థితి వచ్చినందుకు రుద్రాణి తన బెడ్ రూమ్ లో హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కొడుకు రాహుల్ వచ్చి స్పీకర్ ని ఆఫ్ చేస్తాడు. రుద్రాణి: ఎందుకురా ఆఫ్ చేసావ్  రాహుల్: ఏమైంది అమ్మ నీకు. పూజ అంటేనే చిరాకు పడేదానివి ఇప్పుడు ఏకంగా పాటలు పాడేస్తున్నావ్.  రుద్రాణి: ఆనందం కలిగింది. మనం అనుకున్నది సాధించబోతున్నాం అన్న నమ్మకం కలిగింది.  రాహుల్: దానికి దేవుడికి సంబంధం ఏంటి మామ్.. రుద్రాణి: శివుడు బోలా శంకరుడు. రాక్షసులకు కూడా వరాలిస్తాడంటే ఏమో అనుకున్నా. కానీ ఇప్పుడు నేను కోరుకున్న కోరికని నెరవేర్చాడంటే. నిజమే అనిపిస్తుంది.  రాహుల్: అసలు నువ్వు ఏమి కోరుకున్నావు మామ్... రుద్రాణి: నువ్వు రాజ్ స్థానంలోకి వెళ్ళాలి అని.  రాహుల్: కానీ నేను మేనేజర్ గా వెళ్లాలి కదా.  రుద్రాణి: త్వరలోనే వెళ్తావు  రాహుల్: అది ఎలా జరుగుతుంది మామ్  రుద్రాణి: రాజు బిడ్డతో వచ్చాడు అంటే ఈ కావ్య గొడవ చేస్తుంది విడిపోతుంది అనుకున్న కానీ మా వదిన ట్విస్ట్ తో ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాడు కదా  రాహుల్: అలా అని కలలు కంటున్నావా.  రుద్రాణి: వదిన వారం రోజులు గడువు ఇచ్చింది. నిజం చెప్పకపోతే ఇంటిలోంచి పంపించేస్తుంది.  రాహుల్: అంతవరకు రాజ్ ఎందుకు తెచ్చుకుంటాడు. రుద్రాణి: నాకు వాడి గురించి బాగా తెలుసు రా. చిన్నప్పటినుండి చూస్తున్నాను కదా. ఒక్కసారి అనుకున్నాడు అంటే ఎవరు చెప్పినా వినడు. ఇప్పుడు ఆ బిడ్డ విషయంలో కూడా అంతే నోరు తెరిచి నిజం చెప్పడు. వదిన ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు.  రాజ్ వెళ్లిపోతే ఈ కావ్య మాత్రం ఇంట్లో ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటుంది.  నేటి మేటి సావిత్రి కదా.. భర్త అడుగుజాడల్లోనే భార్య కూడా అంటూ వెళ్లిపోతుంది.  రాహుల్: మరి కళ్యాణ్ ఉంటాడు కదా.  రుద్రాణి: మూల స్తంభమే పడిపోయాక పిల్ల స్తంభం ఏమి చేస్తుంది. మనం పెట్టే ప్రెజర్ లకి తట్టుకోలేక కూలిపోతుంది. అప్పుడు ఈ రాజ్యం నా సొంతం అవుతుంది. రాహుల్: కరెక్ట్. ఈ లోపు స్వప్నని కూడా వదిలించుకోవాలి మామ్.  రుద్రాణి: దాని దగ్గర సంతకం చేసిన ఆస్తి పేపర్లు ఏం చేశావురా. రాహుల్: రాత్రి జాగ్రత్తగా దాచి పెట్టాను.  రుద్రాణి: గడ్డిలో దాచిపెట్టు గుడ్లు పెడుతుంది.  రాహుల్: అది కాదు మామ్. ఆ వడ్డీ వ్యాపారి ఊర్లో లేడు సాయంత్రం వస్తానన్నాడు వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను.  రాగానే ఆ పేపర్లు వచ్చి స్వప్న పేరు మీద కోటి రూపాయలు అప్పు తీసుకుంటాను.  రుద్రాణి: తీసుకుంటే సరిపోదు రా. ఆ తర్వాత అప్పు స్వప్న తీసుకున్నది అని అందరినీ నమ్మించాలి కూడా.  దసరా దీపావళి ఒకేసారి చేసుకున్నట్టుగా ఉంది రా నాకు. ఒకవైపు రాజ్ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. మరోవైపు స్వప్న అప్పు చేసి, తప్పు చేసింది అని చూపించి ఇంట్లో నుండి గెంటేస్తాము. కళ్యాణ్ ని  తొక్కి మన కాళ్ల దగ్గరికి రప్పించుకుంటాం. అప్పుడు ఈ రుద్రాణి అంటే ఏంటో ఇంట్లో అందరికీ చూపిస్తా. రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ ని అందరూ దెబ్బలాడతారు.. ఆమె కావ్య ఇచ్చిన అలుసు వల్లే ఇలా జరిగింది అని అపర్ణ కావ్య పై మండిపడుతుంది. కానీ కావ్య మాత్రం రాజ్ కంపెనీ వదులుకోగలడు గానీ మిమ్మల్ని వదులుకోలేడు అని చెబుతుంది.  బాబు కనపడకపోవడంతో వెతుకుతూ ఉంటాడు రాజ్.  రాజ్ వాళ్ళ నాన్న బాబుని కారులో బయటకి పట్టుకెళ్తాడు. రాజ్ కూడా వెనుక వెళతాడు. ఇది చూసిన కావ్య కూడా బయలుదేరుతుంది. రాజ్ తండ్రిని అడ్డుకొని బాబును ఎక్కడికి తీసుకెళుతున్నారని అడుగుతాడు. నీకు దూరంగా ఇంటికి దూరంగా మన వంశానికి దూరంగా. నీకు న్యాయం చేయడానికి. నేను స్వార్థపరుడినిరా. నువ్ తప్పు చేసినా ఒప్పు చేసినా నాతోపాటు ఇంట్లోనే ఉండాలి. నిన్ను దూరం చేసుకోలేను. నాకు నువ్వే ముఖ్యం అంటాడు సుభాష్. నువ్ బయటకు వెళ్లే పరిస్థితే వస్తే.. నేనే ఆ నిజం బయట పెడతాను అని సుభాష్ అంటాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు.  నా కొడుకును పదమంది దోషిలా చూస్తుంటే.. ఆ నిజం ఎంత భయంకరమైనది అయినా సరే నేను నిజం బయటపెట్టక తప్పదు అని సుభాష్ అంటాడు. ఇంతకంటే నాకు ఇంకేం ఆస్తి కావాలి డాడ్. కానీ, మీకోసం కూడా నిజం బయటపెట్టను డాడ్ అని రాజ్ అంటాడు.  కొడుకుని పట్టుకెళ్ళిపోతాడు.  తరువాయి భాగంలో ..  మీరు, మీ అబ్బాయి మాటలాడినది నేను విన్నాను. రాజ్ కొడుకు గురుంచి తెలిసిన నిజం తనకు  చెప్పమని కావ్య  ఒట్టు వేయించుకుంటుంది  

Apr 20, 2024 - 11:00
 0  0
Brahmamudi Serial Today April 20th: కట్టలు తెంచుకున్న అపర్ణ ఆగ్రహం, రాజ్ కు వారం రోజులే గడువు

Brahmamudi Today episode: ఇంట్లో రాజ్ వాళ్ళ బిడ్డ ఎవరో అని ఆరాతీస్తారు. వాడు కనీసం నోరు ఇప్పకపోవటం వాడి మూర్ఖత్వం, వాడు కన్న తల్లిని కూడా వదిలేసుకోటానికి సిద్దమవవుతున్నాడు అందుకే ఒక వారం రోజుల్లో నిజం చెప్పాలి. లేకపోతే ఇంటినుండి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెడుతుంది అపర్ణ . చేసేదేం లేక అందరూ అక్కడినుంచి వెళ్ళిపోతారు.

రాజ్ ని గెంటేసే పరిస్థితి వచ్చినందుకు రుద్రాణి తన బెడ్ రూమ్ లో హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కొడుకు రాహుల్ వచ్చి స్పీకర్ ని ఆఫ్ చేస్తాడు.

రుద్రాణి: ఎందుకురా ఆఫ్ చేసావ్ 

రాహుల్: ఏమైంది అమ్మ నీకు. పూజ అంటేనే చిరాకు పడేదానివి ఇప్పుడు ఏకంగా పాటలు పాడేస్తున్నావ్. 

రుద్రాణి: ఆనందం కలిగింది. మనం అనుకున్నది సాధించబోతున్నాం అన్న నమ్మకం కలిగింది. 

రాహుల్: దానికి దేవుడికి సంబంధం ఏంటి మామ్..

రుద్రాణి: శివుడు బోలా శంకరుడు. రాక్షసులకు కూడా వరాలిస్తాడంటే ఏమో అనుకున్నా. కానీ ఇప్పుడు నేను కోరుకున్న కోరికని నెరవేర్చాడంటే. నిజమే అనిపిస్తుంది. 

రాహుల్: అసలు నువ్వు ఏమి కోరుకున్నావు మామ్...

రుద్రాణి: నువ్వు రాజ్ స్థానంలోకి వెళ్ళాలి అని. 

రాహుల్: కానీ నేను మేనేజర్ గా వెళ్లాలి కదా. 

రుద్రాణి: త్వరలోనే వెళ్తావు 

రాహుల్: అది ఎలా జరుగుతుంది మామ్ 

రుద్రాణి: రాజు బిడ్డతో వచ్చాడు అంటే ఈ కావ్య గొడవ చేస్తుంది విడిపోతుంది అనుకున్న కానీ మా వదిన ట్విస్ట్ తో ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాడు కదా 

రాహుల్: అలా అని కలలు కంటున్నావా. 

రుద్రాణి: వదిన వారం రోజులు గడువు ఇచ్చింది. నిజం చెప్పకపోతే ఇంటిలోంచి పంపించేస్తుంది. 

రాహుల్: అంతవరకు రాజ్ ఎందుకు తెచ్చుకుంటాడు.

రుద్రాణి: నాకు వాడి గురించి బాగా తెలుసు రా. చిన్నప్పటినుండి చూస్తున్నాను కదా. ఒక్కసారి అనుకున్నాడు అంటే ఎవరు చెప్పినా వినడు. ఇప్పుడు ఆ బిడ్డ విషయంలో కూడా అంతే నోరు తెరిచి నిజం చెప్పడు. వదిన ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు.  రాజ్ వెళ్లిపోతే ఈ కావ్య మాత్రం ఇంట్లో ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటుంది.  నేటి మేటి సావిత్రి కదా.. భర్త అడుగుజాడల్లోనే భార్య కూడా అంటూ వెళ్లిపోతుంది. 

రాహుల్: మరి కళ్యాణ్ ఉంటాడు కదా. 

రుద్రాణి: మూల స్తంభమే పడిపోయాక పిల్ల స్తంభం ఏమి చేస్తుంది. మనం పెట్టే ప్రెజర్ లకి తట్టుకోలేక కూలిపోతుంది. అప్పుడు ఈ రాజ్యం నా సొంతం అవుతుంది.

రాహుల్: కరెక్ట్. ఈ లోపు స్వప్నని కూడా వదిలించుకోవాలి మామ్. 

రుద్రాణి: దాని దగ్గర సంతకం చేసిన ఆస్తి పేపర్లు ఏం చేశావురా.

రాహుల్: రాత్రి జాగ్రత్తగా దాచి పెట్టాను. 

రుద్రాణి: గడ్డిలో దాచిపెట్టు గుడ్లు పెడుతుంది. 

రాహుల్: అది కాదు మామ్. ఆ వడ్డీ వ్యాపారి ఊర్లో లేడు సాయంత్రం వస్తానన్నాడు వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను.  రాగానే ఆ పేపర్లు వచ్చి స్వప్న పేరు మీద కోటి రూపాయలు అప్పు తీసుకుంటాను. 

రుద్రాణి: తీసుకుంటే సరిపోదు రా. ఆ తర్వాత అప్పు స్వప్న తీసుకున్నది అని అందరినీ నమ్మించాలి కూడా.  దసరా దీపావళి ఒకేసారి చేసుకున్నట్టుగా ఉంది రా నాకు. ఒకవైపు రాజ్ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. మరోవైపు స్వప్న అప్పు చేసి, తప్పు చేసింది అని చూపించి ఇంట్లో నుండి గెంటేస్తాము. కళ్యాణ్ ని  తొక్కి మన కాళ్ల దగ్గరికి రప్పించుకుంటాం. అప్పుడు ఈ రుద్రాణి అంటే ఏంటో ఇంట్లో అందరికీ చూపిస్తా.

రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ ని అందరూ దెబ్బలాడతారు.. ఆమె కావ్య ఇచ్చిన అలుసు వల్లే ఇలా జరిగింది అని అపర్ణ కావ్య పై మండిపడుతుంది. కానీ కావ్య మాత్రం రాజ్ కంపెనీ వదులుకోగలడు గానీ మిమ్మల్ని వదులుకోలేడు అని చెబుతుంది.

 బాబు కనపడకపోవడంతో వెతుకుతూ ఉంటాడు రాజ్.  రాజ్ వాళ్ళ నాన్న బాబుని కారులో బయటకి పట్టుకెళ్తాడు. రాజ్ కూడా వెనుక వెళతాడు. ఇది చూసిన కావ్య కూడా బయలుదేరుతుంది. రాజ్ తండ్రిని అడ్డుకొని బాబును ఎక్కడికి తీసుకెళుతున్నారని అడుగుతాడు. నీకు దూరంగా ఇంటికి దూరంగా మన వంశానికి దూరంగా. నీకు న్యాయం చేయడానికి. నేను స్వార్థపరుడినిరా. నువ్ తప్పు చేసినా ఒప్పు చేసినా నాతోపాటు ఇంట్లోనే ఉండాలి. నిన్ను దూరం చేసుకోలేను. నాకు నువ్వే ముఖ్యం అంటాడు సుభాష్.

నువ్ బయటకు వెళ్లే పరిస్థితే వస్తే.. నేనే ఆ నిజం బయట పెడతాను అని సుభాష్ అంటాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు.  నా కొడుకును పదమంది దోషిలా చూస్తుంటే.. ఆ నిజం ఎంత భయంకరమైనది అయినా సరే నేను నిజం బయటపెట్టక తప్పదు అని సుభాష్ అంటాడు. ఇంతకంటే నాకు ఇంకేం ఆస్తి కావాలి డాడ్. కానీ, మీకోసం కూడా నిజం బయటపెట్టను డాడ్ అని రాజ్ అంటాడు.  కొడుకుని పట్టుకెళ్ళిపోతాడు. 

తరువాయి భాగంలో .. 

మీరు, మీ అబ్బాయి మాటలాడినది నేను విన్నాను. రాజ్ కొడుకు గురుంచి తెలిసిన నిజం తనకు  చెప్పమని కావ్య  ఒట్టు వేయించుకుంటుంది  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow