Delhi vs Gujarat Match Highlights: పోరాట యోధుడు పంత్- ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్‌ తిప్పేశాడు- మ్యాచ్‌ హీరో మాత్రం అక్షర్ పటేల్ 

IPL 2024: రిషభ్ పంత్..పోరాట యోధుడు. చావు అంచుల దాకా వెళ్లి పట్టువదలని మొండి ధైర్యంతో వెనక్కి తిరిగివచ్చి క్రికెట్ ఆడుతున్న ఫైటర్. గుజరాత్ టైటాన్స్ మీద మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తోడుగా పంత్ చేసిన పోరాటం అద్భుతం అసలు. 43 బాల్స్ ఆడి 5ఫోర్లు,8 సిక్సర్లతో 88పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో మోహిత్ శర్మను ఓ రేంజ్‌లో ఆడుకుని ఢిల్లీకి 224 పరుగుల భారీ స్కోరు అందించాడు.  ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. కానీ పంత్ ఆడుతున్న షాట్స్ గురించే అసలు టెన్షన్. ఆడే షాట్స్ మీద కంట్రోల్ ఉండడం లేదు. వీలైనంత వరకూ తన స్ట్రాంగ్ జోన్ అయిన లెగ్ సైడ్ పుల్ షాట్స్ ఆడటానికే ట్రై చేస్తున్నాడు. అది కూడా బాడీ మీద కంట్రోల్ లేకుండా పక్కకు పడిపోతూ షాట్లు కొడుతున్నాడు. ఇది పంత్‌కు స్వతహాగా వచ్చిన నేచరల్ స్ట్రోక్ ప్లే కావచ్చు. కానీ దీనివల్ల చాలా బాల్స్‌ను టైమింగ్‌తో స్ట్రైక్ చేయలేకపోతున్నాడు. మాములుగా బౌండరీలు కొట్టాల్సినవి కూడా టైమింగ్ మిస్ కావటం వల్ల చాలా కష్టపడి కొట్టాల్సి వస్తోంది. దీని వల్ల రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి పంత్ అవసరమైన సందర్భాల్లో ఔటైపోయే ప్రమాదం ఉంటుంది రెండు పంత్ ఇంజ్యుర్ అయ్యే ఛాన్స్‌ ఉంది.  యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాతనే పంత్ ఆట ఎక్కువగా ఇలా కనిపిస్తోంది. రానున్నది వరల్డ్ కప్ కావటం..రిషభ్ పంత్ అన్ డౌటెడ్ లీ ఫస్ట్ ప్రియారిటీ వికెట్ కీపర్ కావటంతో పంత్ కొంచెం జాగ్రత్తగా కంట్రోల్డ్‌గా బ్యాలెన్స్‌తో షాట్లు ఆడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మాజీలు వ్యక్తం చేస్తున్నారు. గెలుపునకు ఓటమికి ఎప్పుడూ ఒకటే తేడా ఒన్ బ్లడీ ఇంచ్ అంటారు కదా. సేమ్ నిన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా అంతే. మ్యాచ్ ముగిశాక చూస్తే తేడా ఆ ఒక్క ఓవరే. అదే గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్. కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన 88 పరుగుల్లో 31పరుగులు ఆఖరి ఓవర్ మోహిత్ శర్మ నుంచే రాబట్టాడు. మోహిత్ విసిరిన ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు ఓ ఫోరు బాదాడు. మరో వైడ్, మరో డబుల్‌తో కలిపి మొత్తం ఆ ఒక్క ఓవర్ నుంచే 31పరుగులు వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ స్కోరు 224పరుగులకు చేరుకుంది.  మొత్తం ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు కొట్టిన పంత్ అందులో 7 మోహిత్ శర్మ బౌలింగ్‌లోనే కొట్టాడు. పంత్ ధాటికి మోహిత్ ఏకంగా 4 ఓవర్లలో ఒక్క వికెట్టూ తీయకుండా 73పరుగులు సమర్పించుకున్నాడు. ఇది ఐపీఎల్‌లోనే చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన. గుజరాత్ ఛేజింగ్ చూశాక ప్రత్యేకించి డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ చివర్లో చేసిన హిట్టింగ్ చూశాక. పంత్ ఆ ఒక్క ఓవర్ అలా హిట్టింగ్ చేయకపోయింటే మాత్రం మ్యాచ్ కచ్చితంగా గుజరాతే గెలిచేదని అందరికీ అనిపించింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవటంతో పాటు పంత్ ఈ సీజన్‌లో 3అర్థశతకంతో సాధించటం ద్వారా మొత్తం 342పరుగుల చేసి ఆరెంజ్ క్యాప్ పోటీదారుల జాబితాలో కొహ్లీ, రుతురాజ్ తర్వాత మూడోస్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండ్ షో తో అక్షర్ అదుర్స్.!మాములుగా ఆల్ రౌండర్లు మ్యాచ్ ఫలితాలను శాసిస్తూ ఉంటారు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో తలో చేయి వేస్తూ రిజల్ట్స్‌ను తారుమారు చేసేస్తుంటారు. గుజరాత్ మీద మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ది అలాంటి ప్రదర్శనే. ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను వన్ డౌన్ లో దింపి గుజరాత్‌కి షాక్ ఇచ్చింది. దూకుడు చూపించిన ఓపెనర్ జాక్ ఫ్రేసర్ మెక్ గ్రక్ అవ్వగానే క్రీజులోకి వచ్చాడు అక్షర్ పటేల్. కోల్‌కతాకు నరైన్ తరహాలో అక్షర్ పటేల్‌తో ఢిల్లీ ఈ ప్రయోగిం చేయిస్తే అది సక్సెస్ అయ్యింది.  గుజరాత్ బౌలర్లను అక్షర్ పటేల్ తొలుత ఆచి తూచి ఆడినా తర్వాత రఫ్పాడించాడు. 43 బాల్స్ ఆడి 5ఫోర్లు, 4 సిక్సర్లతో 66పరుగులు చేశాడు. 153 స్ట్రైక్ రేట్‌తో మరో ఎండ్‌లో రిషభ్ పంత్‌కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. ఫలితంగా ఢిల్లీ 224పరుగులు చేసింది. తర్వాత గుజరాత్‌ను అటు ఫీల్డింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లో దెబ్బ తీశాడు అక్షర్ పటేల్. గుజరాత్‌లో టాప్ 3 బ్యాటర్లను తనే క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. 39పరుగులు చేసిన సాహా, కెప్టెన్ శుభ్ మన గిల్, 39బాల్స్‌లోనే 65 పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాటర్‌ సాయిసుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌లు అద్భుతంగా పట్టి వాళ్ల ఔట్‌లో భాగస్వామ్యమయ్యాడు.  బౌలర్‌గానూ రాణించి అజ్మతుల్లా ఒమర్జాయ్ ను ఔట్ చేశాడు. ఇలా మూడు విభాగాల్లోనూ రాణించటం ద్వారా సహచరులు ముద్దుగా బాపూ అని పిలుచుకునే అక్షర్ పటేల్ బాప్‌రే అనిపించాడు. ఢిల్లీకి కీలమైన విజయాన్ని అందించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేర్చటంలో కీలకపాత్ర పోషించాడు.

Apr 25, 2024 - 12:00
 0  1
Delhi vs Gujarat Match Highlights:  పోరాట యోధుడు పంత్- ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్‌ తిప్పేశాడు- మ్యాచ్‌ హీరో మాత్రం అక్షర్ పటేల్ 

IPL 2024: రిషభ్ పంత్..పోరాట యోధుడు. చావు అంచుల దాకా వెళ్లి పట్టువదలని మొండి ధైర్యంతో వెనక్కి తిరిగివచ్చి క్రికెట్ ఆడుతున్న ఫైటర్. గుజరాత్ టైటాన్స్ మీద మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తోడుగా పంత్ చేసిన పోరాటం అద్భుతం అసలు. 43 బాల్స్ ఆడి 5ఫోర్లు,8 సిక్సర్లతో 88పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో మోహిత్ శర్మను ఓ రేంజ్‌లో ఆడుకుని ఢిల్లీకి 224 పరుగుల భారీ స్కోరు అందించాడు. 

ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. కానీ పంత్ ఆడుతున్న షాట్స్ గురించే అసలు టెన్షన్. ఆడే షాట్స్ మీద కంట్రోల్ ఉండడం లేదు. వీలైనంత వరకూ తన స్ట్రాంగ్ జోన్ అయిన లెగ్ సైడ్ పుల్ షాట్స్ ఆడటానికే ట్రై చేస్తున్నాడు. అది కూడా బాడీ మీద కంట్రోల్ లేకుండా పక్కకు పడిపోతూ షాట్లు కొడుతున్నాడు. ఇది పంత్‌కు స్వతహాగా వచ్చిన నేచరల్ స్ట్రోక్ ప్లే కావచ్చు. కానీ దీనివల్ల చాలా బాల్స్‌ను టైమింగ్‌తో స్ట్రైక్ చేయలేకపోతున్నాడు. మాములుగా బౌండరీలు కొట్టాల్సినవి కూడా టైమింగ్ మిస్ కావటం వల్ల చాలా కష్టపడి కొట్టాల్సి వస్తోంది. దీని వల్ల రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి పంత్ అవసరమైన సందర్భాల్లో ఔటైపోయే ప్రమాదం ఉంటుంది రెండు పంత్ ఇంజ్యుర్ అయ్యే ఛాన్స్‌ ఉంది. 

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాతనే పంత్ ఆట ఎక్కువగా ఇలా కనిపిస్తోంది. రానున్నది వరల్డ్ కప్ కావటం..రిషభ్ పంత్ అన్ డౌటెడ్ లీ ఫస్ట్ ప్రియారిటీ వికెట్ కీపర్ కావటంతో పంత్ కొంచెం జాగ్రత్తగా కంట్రోల్డ్‌గా బ్యాలెన్స్‌తో షాట్లు ఆడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మాజీలు వ్యక్తం చేస్తున్నారు.

గెలుపునకు ఓటమికి ఎప్పుడూ ఒకటే తేడా ఒన్ బ్లడీ ఇంచ్ అంటారు కదా. సేమ్ నిన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా అంతే. మ్యాచ్ ముగిశాక చూస్తే తేడా ఆ ఒక్క ఓవరే. అదే గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్. కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన 88 పరుగుల్లో 31పరుగులు ఆఖరి ఓవర్ మోహిత్ శర్మ నుంచే రాబట్టాడు. మోహిత్ విసిరిన ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు ఓ ఫోరు బాదాడు. మరో వైడ్, మరో డబుల్‌తో కలిపి మొత్తం ఆ ఒక్క ఓవర్ నుంచే 31పరుగులు వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ స్కోరు 224పరుగులకు చేరుకుంది. 

మొత్తం ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు కొట్టిన పంత్ అందులో 7 మోహిత్ శర్మ బౌలింగ్‌లోనే కొట్టాడు. పంత్ ధాటికి మోహిత్ ఏకంగా 4 ఓవర్లలో ఒక్క వికెట్టూ తీయకుండా 73పరుగులు సమర్పించుకున్నాడు. ఇది ఐపీఎల్‌లోనే చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన. గుజరాత్ ఛేజింగ్ చూశాక ప్రత్యేకించి డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ చివర్లో చేసిన హిట్టింగ్ చూశాక. పంత్ ఆ ఒక్క ఓవర్ అలా హిట్టింగ్ చేయకపోయింటే మాత్రం మ్యాచ్ కచ్చితంగా గుజరాతే గెలిచేదని అందరికీ అనిపించింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవటంతో పాటు పంత్ ఈ సీజన్‌లో 3అర్థశతకంతో సాధించటం ద్వారా మొత్తం 342పరుగుల చేసి ఆరెంజ్ క్యాప్ పోటీదారుల జాబితాలో కొహ్లీ, రుతురాజ్ తర్వాత మూడోస్థానానికి చేరుకున్నాడు.

ఆల్ రౌండ్ షో తో అక్షర్ అదుర్స్.!
మాములుగా ఆల్ రౌండర్లు మ్యాచ్ ఫలితాలను శాసిస్తూ ఉంటారు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో తలో చేయి వేస్తూ రిజల్ట్స్‌ను తారుమారు చేసేస్తుంటారు. గుజరాత్ మీద మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ది అలాంటి ప్రదర్శనే. ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను వన్ డౌన్ లో దింపి గుజరాత్‌కి షాక్ ఇచ్చింది. దూకుడు చూపించిన ఓపెనర్ జాక్ ఫ్రేసర్ మెక్ గ్రక్ అవ్వగానే క్రీజులోకి వచ్చాడు అక్షర్ పటేల్. కోల్‌కతాకు నరైన్ తరహాలో అక్షర్ పటేల్‌తో ఢిల్లీ ఈ ప్రయోగిం చేయిస్తే అది సక్సెస్ అయ్యింది. 

గుజరాత్ బౌలర్లను అక్షర్ పటేల్ తొలుత ఆచి తూచి ఆడినా తర్వాత రఫ్పాడించాడు. 43 బాల్స్ ఆడి 5ఫోర్లు, 4 సిక్సర్లతో 66పరుగులు చేశాడు. 153 స్ట్రైక్ రేట్‌తో మరో ఎండ్‌లో రిషభ్ పంత్‌కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. ఫలితంగా ఢిల్లీ 224పరుగులు చేసింది. తర్వాత గుజరాత్‌ను అటు ఫీల్డింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లో దెబ్బ తీశాడు అక్షర్ పటేల్. గుజరాత్‌లో టాప్ 3 బ్యాటర్లను తనే క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. 39పరుగులు చేసిన సాహా, కెప్టెన్ శుభ్ మన గిల్, 39బాల్స్‌లోనే 65 పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాటర్‌ సాయిసుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌లు అద్భుతంగా పట్టి వాళ్ల ఔట్‌లో భాగస్వామ్యమయ్యాడు. 

బౌలర్‌గానూ రాణించి అజ్మతుల్లా ఒమర్జాయ్ ను ఔట్ చేశాడు. ఇలా మూడు విభాగాల్లోనూ రాణించటం ద్వారా సహచరులు ముద్దుగా బాపూ అని పిలుచుకునే అక్షర్ పటేల్ బాప్‌రే అనిపించాడు. ఢిల్లీకి కీలమైన విజయాన్ని అందించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేర్చటంలో కీలకపాత్ర పోషించాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow