Devon Conway Ruled Out: ఐపీఎల్‌ నుంచి కాన్వే అవుట్‌

Devon Conway Ruled Out: ఐపీఎల్‌(IPL 2024)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐపీఎల్‌కు న్యూజిలాండ్ ఓపెనర్‌ డెవాన్ కాన్వే(Devon Conway) దూరమయ్యాడు. గాయం కారణంతో కాన్వే ఈ ఐపీఎల్‌కు దూరమైనట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెల్లడించింది. కాన్వే స్థానంలో రిచర్డ్ గ్లీసన్‌( Richard Gleeson)ను చెన్నై జట్టులోకి తీసుకుంది.    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ మ్యాచులో కాన్వే ఎడమ బొటన వేలు విరగగా.. కాన్వే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాన్వే కోలుకోడానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో అతని స్థానంలో  రిచర్డ్ గ్లీసన్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కాన్వే అందుబాటులో ఉండడని చెన్నైకి తెలిసినా కోలుకుంటాడని ఇన్నిరోజులు ఎదురుచూశారు. ఇప్పుడు కాన్వేకు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో చెన్నై.. వేరే ఆటగాడిని జట్టులోకి తీసుకు్ంది. 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన కాన్వే ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.  ఆ మ్యాచ్‌లో కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కాన్వే 2022 నుంచి CSK తరపున ఆడుతున్నాడు.  మెగా వేలంలో కాన్వేను చెన్నై రూ.కోటికి కొనుగోలు చేసింది. చెన్నై తరపున 23 మ్యాచులు ఆడిన కాన్వే 48.63 సగటుతో 924 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. గత సీజన్లో 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు.   రిచర్డ్ గ్లీసన్‌ను తొలి ఐపీఎల్‌ ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ గ్లీసన్‌క ఇదే తొలి ఐపీఎల్‌. బేస్‌ ప్రైస్‌ రూ. 50 లక్షలకు అతడిని చెన్నై జట్టులోకి తీసుకుంది. ఇంగ్లాండ్ తరపున గ్లీసన్‌ ఆరు టీ20లు ఆడాడు. 8.90 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. మొత్తం టీ 20 కెరీర్‌లో 90 మ్యాచులు ఆడిన గ్లీసన్‌ 101 వికెట్లు సాధించాడు.    రుతురాజ్‌ రికార్డు  చెన్నై సూపర్ కింగ్స్(CSK) సారధి రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad )... అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలు రాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరవడం ద్వారా రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. షెఫర్డ్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌ల్లో  ఈ ఘనత సాధించిన రుతురాజ్‌... సచిన్ టెండూల్కర్‌, కేఎల్ రాహుల్‌ల రికార్డును బద్దలుకొట్టాడు. మొత్తంగా ఐపీఎల్‌లో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్ 48 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగుల మార్క్‌ను అందుకొని అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత షాన్ మార్ష్ 52 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నాడు,. 57 ఇన్నింగ్సుల్లో  రుతురాజ్ 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ 60 ఇన్నింగ్స్‌లు, సచిన్ టెండూల్కర్  63 ఇన్నింగ్సుల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Apr 18, 2024 - 20:00
 0  2
Devon Conway Ruled Out:  ఐపీఎల్‌ నుంచి కాన్వే అవుట్‌
Devon Conway Ruled Out: ఐపీఎల్‌(IPL 2024)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐపీఎల్‌కు న్యూజిలాండ్ ఓపెనర్‌ డెవాన్ కాన్వే(Devon Conway) దూరమయ్యాడు. గాయం కారణంతో కాన్వే ఈ ఐపీఎల్‌కు దూరమైనట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెల్లడించింది. కాన్వే స్థానంలో రిచర్డ్ గ్లీసన్‌( Richard Gleeson)ను చెన్నై జట్టులోకి తీసుకుంది. 
 
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ మ్యాచులో కాన్వే ఎడమ బొటన వేలు విరగగా.. కాన్వే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాన్వే కోలుకోడానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో అతని స్థానంలో  రిచర్డ్ గ్లీసన్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కాన్వే అందుబాటులో ఉండడని చెన్నైకి తెలిసినా కోలుకుంటాడని ఇన్నిరోజులు ఎదురుచూశారు. ఇప్పుడు కాన్వేకు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో చెన్నై.. వేరే ఆటగాడిని జట్టులోకి తీసుకు్ంది. 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన కాన్వే ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.  ఆ మ్యాచ్‌లో కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కాన్వే 2022 నుంచి CSK తరపున ఆడుతున్నాడు.  మెగా వేలంలో కాన్వేను చెన్నై రూ.కోటికి కొనుగోలు చేసింది. చెన్నై తరపున 23 మ్యాచులు ఆడిన కాన్వే 48.63 సగటుతో 924 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. గత సీజన్లో 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు.
 
రిచర్డ్ గ్లీసన్‌ను తొలి ఐపీఎల్‌
ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ గ్లీసన్‌క ఇదే తొలి ఐపీఎల్‌. బేస్‌ ప్రైస్‌ రూ. 50 లక్షలకు అతడిని చెన్నై జట్టులోకి తీసుకుంది. ఇంగ్లాండ్ తరపున గ్లీసన్‌ ఆరు టీ20లు ఆడాడు. 8.90 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. మొత్తం టీ 20 కెరీర్‌లో 90 మ్యాచులు ఆడిన గ్లీసన్‌ 101 వికెట్లు సాధించాడు. 
 
రుతురాజ్‌ రికార్డు
 చెన్నై సూపర్ కింగ్స్(CSK) సారధి రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad )... అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలు రాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరవడం ద్వారా రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. షెఫర్డ్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌ల్లో  ఈ ఘనత సాధించిన రుతురాజ్‌... సచిన్ టెండూల్కర్‌, కేఎల్ రాహుల్‌ల రికార్డును బద్దలుకొట్టాడు. మొత్తంగా ఐపీఎల్‌లో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్ 48 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగుల మార్క్‌ను అందుకొని అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత షాన్ మార్ష్ 52 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నాడు,. 57 ఇన్నింగ్సుల్లో  రుతురాజ్ 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ 60 ఇన్నింగ్స్‌లు, సచిన్ టెండూల్కర్  63 ఇన్నింగ్సుల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow