Dhanush: తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన ధనుష్, సింపుల్‌గా ఒక జీన్స్, షర్ట్‌లో!

చాలామంది సినీ సెలబ్రిటీలు తమకోసం పనిచేసే మ్యానేజర్స్, అసిస్టెంట్స్‌ను చాలా బాగా చూసుకుంటారు. కొందరైతే వారిని కుటుంబంగా చూసుకుంటూ వారితో కలిసిమెలిసి ఉంటారు. వారి కుటుంబంలో జరిగే ప్రతీ ఈవెంట్‌ను దగ్గర ఉండి చూసుకోవడంతో పాటు హాజరవుతారు కూడా. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందనా.. తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లడంతో పాటు కొత్తజంటను ఆశీర్వదించింది కూడా. ఆరెంజ్ కలర్ శారీలో రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో అంతటా వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక తరహాలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తన అసిస్టెంట్ పెళ్లికి హాజరయ్యాడు. సింపుల్‌గా ఒక షర్ట్, జీన్స్‌లో ధనుష్.. ఈ పెళ్లికి హాజరవ్వగా అక్కడ తను దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింపుల్‌గా.. నిరాడంబరంగాబీజ్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్, బ్లూ క్యాప్‌లో తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి హాజరయ్యాడు ధనుష్. తనతో పాటు తన సహ నటుడు కెన్ కరుణాస్ కూడా పెళ్లికి వెళ్లాడు. వీరిద్దరూ కలిసి కొత్తజంటను విష్ చేశారు, వారితో నవ్వుతూ ఫోటోలు దిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్ పెళ్లికి వెళ్లడం, వారిని విష్ చేయడం మంచి విషయమంటూ ధనుష్ ఫ్యాన్స్ అంతా తనను ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇలా సింపుల్‌గా ఉంటాడు కాబట్టే ధనుష్‌కు అంత ఎక్కువ ఫ్యాన్‌బేస్ ఉందని మరికొందరు అనుకుంటున్నారు. ఆనంద్ పెళ్లికి ధనుష్ వస్తాడు అని ముందు నుండే తెలుసు అని తన సన్నిహితులు చెప్తున్నారు. పెళ్లి తర్వాత రాధిక, శరత్‌కుమార్‌లను కలవడానికి ధనుష్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆనంద్ పెళ్లి ఫోటోల్లో ఉన్న డ్రెస్‌తోనే రాధిక, శరత్‌కుమార్‌లతో కూడా ఫోటోలకు పోజులిచ్చాడు ధనుష్.  #DHANUSH : For His Fans⭐Even With The Busy Schedule Day & Night Non-Stop Shoot in #D50 Even He Attended His Fans Marriage❤️LUCKY FAN✨ pic.twitter.com/3nYTm9rPgz — Saloon Kada Shanmugam (@saloon_kada) September 17, 2023 ‘కెప్టెన్ మిల్లర్’గా..శరవేగంగా సినిమాలు తెరకెక్కించే హీరోలలో ధనుష్ కూడా ఒకరు. ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తూ.. ధనుష్ ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. ప్రస్తుతం తన చేతిలో ‘కెప్టెన్ మిల్లర్’ అనే చిత్రం ఉంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఇదొక యాక్షన్ చిత్రమని అర్థమవుతోంది. ఇప్పటికే ఎన్నో యాక్షన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘రాకీ’, ‘సానీ కాయిదమ్’ లాంటి కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించిన అరుణ్.. ‘కెప్టెన్ మిల్లర్’ను కూడా పూర్తిగా కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ హిట్ కోసం..ఇక కేవలం తమిళంలోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా నటించి, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. హిందీలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబినేషన్‌లో హిందీలో రెండు సినిమాలో వచ్చాయి. ఈసారి వీరిద్దరూ కలిసి బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్.. తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి రావడం ఆనంద్‌తో పాటు తన ఫ్యాన్స్‌ను కూడా సంతోషపెట్టింది. Also Read: మెగా ఇంట వినాయక చవితి సంబరాలు, ఈసారి ప్రత్యేకత ఇదేనట! ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Sep 18, 2023 - 21:00
 0  0
Dhanush: తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన ధనుష్, సింపుల్‌గా ఒక జీన్స్, షర్ట్‌లో!

చాలామంది సినీ సెలబ్రిటీలు తమకోసం పనిచేసే మ్యానేజర్స్, అసిస్టెంట్స్‌ను చాలా బాగా చూసుకుంటారు. కొందరైతే వారిని కుటుంబంగా చూసుకుంటూ వారితో కలిసిమెలిసి ఉంటారు. వారి కుటుంబంలో జరిగే ప్రతీ ఈవెంట్‌ను దగ్గర ఉండి చూసుకోవడంతో పాటు హాజరవుతారు కూడా. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందనా.. తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లడంతో పాటు కొత్తజంటను ఆశీర్వదించింది కూడా. ఆరెంజ్ కలర్ శారీలో రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో అంతటా వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక తరహాలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తన అసిస్టెంట్ పెళ్లికి హాజరయ్యాడు. సింపుల్‌గా ఒక షర్ట్, జీన్స్‌లో ధనుష్.. ఈ పెళ్లికి హాజరవ్వగా అక్కడ తను దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సింపుల్‌గా.. నిరాడంబరంగా
బీజ్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్, బ్లూ క్యాప్‌లో తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి హాజరయ్యాడు ధనుష్. తనతో పాటు తన సహ నటుడు కెన్ కరుణాస్ కూడా పెళ్లికి వెళ్లాడు. వీరిద్దరూ కలిసి కొత్తజంటను విష్ చేశారు, వారితో నవ్వుతూ ఫోటోలు దిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్ పెళ్లికి వెళ్లడం, వారిని విష్ చేయడం మంచి విషయమంటూ ధనుష్ ఫ్యాన్స్ అంతా తనను ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇలా సింపుల్‌గా ఉంటాడు కాబట్టే ధనుష్‌కు అంత ఎక్కువ ఫ్యాన్‌బేస్ ఉందని మరికొందరు అనుకుంటున్నారు. ఆనంద్ పెళ్లికి ధనుష్ వస్తాడు అని ముందు నుండే తెలుసు అని తన సన్నిహితులు చెప్తున్నారు. పెళ్లి తర్వాత రాధిక, శరత్‌కుమార్‌లను కలవడానికి ధనుష్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆనంద్ పెళ్లి ఫోటోల్లో ఉన్న డ్రెస్‌తోనే రాధిక, శరత్‌కుమార్‌లతో కూడా ఫోటోలకు పోజులిచ్చాడు ధనుష్. 

‘కెప్టెన్ మిల్లర్’గా..
శరవేగంగా సినిమాలు తెరకెక్కించే హీరోలలో ధనుష్ కూడా ఒకరు. ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తూ.. ధనుష్ ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. ప్రస్తుతం తన చేతిలో ‘కెప్టెన్ మిల్లర్’ అనే చిత్రం ఉంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఇదొక యాక్షన్ చిత్రమని అర్థమవుతోంది. ఇప్పటికే ఎన్నో యాక్షన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘రాకీ’, ‘సానీ కాయిదమ్’ లాంటి కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించిన అరుణ్.. ‘కెప్టెన్ మిల్లర్’ను కూడా పూర్తిగా కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

హ్యాట్రిక్ హిట్ కోసం..
ఇక కేవలం తమిళంలోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో కూడా నటించి, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. హిందీలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబినేషన్‌లో హిందీలో రెండు సినిమాలో వచ్చాయి. ఈసారి వీరిద్దరూ కలిసి బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్.. తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి రావడం ఆనంద్‌తో పాటు తన ఫ్యాన్స్‌ను కూడా సంతోషపెట్టింది.

Also Read: మెగా ఇంట వినాయక చవితి సంబరాలు, ఈసారి ప్రత్యేకత ఇదేనట!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow