IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights- బలమైన చెన్నై సూపర్ కింగ్స్ పై.. అంతే బలంగా లక్నో సూపర్ జెయింట్స్ గెలిచి చూపించింది. చెన్నై విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఓవర్ ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా..!  no-1: రాహుల్-డికాక్ ఓపెనింగ్ సూపర్..!177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వికెట్ పడకుండా 15 ఓవర్లలో 134 కొట్టారు. చెన్నై బ్యాటర్లు స్కోర్ చేయడానికి ఇబ్బంది పడిన అదే పిచ్ పై అదరగొట్టారు. 53 బాల్స్ లో 3 సిక్సర్లు, 9 ఫోర్లతో రాహుల్ 82 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో వైపు.. డికాక్ 54 పరుగులతో మంచి పార్ట్‌నప్ షిప్ నమోదు చేశాడు. no-2: పవర్ ప్లేలో చెన్నై ఢమాల్..!ఫస్ట్ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే 2వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర డకౌట్ కాగా..రుత్ రాజ్ గైక్వాడ్ 17 పరుగులే వెనుతిరిగాడు.33 కే 2 వికెట్లు కోల్పోవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది. no-3: సర్ జడేజా మ్యాజిక్..! చెన్నై బ్యాటర్లలో జడేజా ఒక్కటే చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 40 బాల్స్ లో 57 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక, ఫీల్డింగ్ లోనూ కెప్టెన్ రాహుల్ క్యాచ్... సింగిల్ హ్యాండ్ తో పట్టి వావ్ అనిపించాడు.   beఅదరగొట్టాడు. no-4: ధోని ది ఫినిషర్..!ధోనిని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో ఈరోజు మరోసారి రుజువైంది. 9 బాల్స్ లో 2 సిక్సులు, 3 ఫోర్లు మొత్తంగా 28 పరుగులు కొట్టాడు. 360 డిగ్రీలు తిరిగి ధోని కొట్టిన సిక్స్ ఐతే మొత్తం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవచ్చు.  no-5:ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ తో.. ఆడిన 7 మ్యాచుల్లో  3వ ఓటమి ముటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 7 మ్యాచుల్లో 4వ విజయాన్ని సాధించింది.

Apr 20, 2024 - 02:00
 0  0
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights- బలమైన చెన్నై సూపర్ కింగ్స్ పై.. అంతే బలంగా లక్నో సూపర్ జెయింట్స్ గెలిచి చూపించింది. చెన్నై విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఓవర్ ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో జరిగిన టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దామా..! 

no-1: రాహుల్-డికాక్ ఓపెనింగ్ సూపర్..!
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వికెట్ పడకుండా 15 ఓవర్లలో 134 కొట్టారు. చెన్నై బ్యాటర్లు స్కోర్ చేయడానికి ఇబ్బంది పడిన అదే పిచ్ పై అదరగొట్టారు. 53 బాల్స్ లో 3 సిక్సర్లు, 9 ఫోర్లతో రాహుల్ 82 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో వైపు.. డికాక్ 54 పరుగులతో మంచి పార్ట్‌నప్ షిప్ నమోదు చేశాడు.

no-2: పవర్ ప్లేలో చెన్నై ఢమాల్..!
ఫస్ట్ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే 2వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర డకౌట్ కాగా..రుత్ రాజ్ గైక్వాడ్ 17 పరుగులే వెనుతిరిగాడు.33 కే 2 వికెట్లు కోల్పోవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది.

no-3: సర్ జడేజా మ్యాజిక్..! 
చెన్నై బ్యాటర్లలో జడేజా ఒక్కటే చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 40 బాల్స్ లో 57 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక, ఫీల్డింగ్ లోనూ కెప్టెన్ రాహుల్ క్యాచ్... సింగిల్ హ్యాండ్ తో పట్టి వావ్ అనిపించాడు.   beఅదరగొట్టాడు.

no-4: ధోని ది ఫినిషర్..!
ధోనిని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో ఈరోజు మరోసారి రుజువైంది. 9 బాల్స్ లో 2 సిక్సులు, 3 ఫోర్లు మొత్తంగా 28 పరుగులు కొట్టాడు. 360 డిగ్రీలు తిరిగి ధోని కొట్టిన సిక్స్ ఐతే మొత్తం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. 

no-5:ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ తో.. ఆడిన 7 మ్యాచుల్లో  3వ ఓటమి ముటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 7 మ్యాచుల్లో 4వ విజయాన్ని సాధించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow