IPL 2024: చెన్నై దూకుడును, లక్నో ఆపగలదా ?

LSG vs CSK IPL 2024 Preview and Prediction : ఐపీఎల్‌(IPL)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) మ్యాచ్‌ వస్తుందంటే చాలు అభిమానులకు అదో పండుగలా మారిపోయింది. ధోనీ మైదానంలో అడుగుపెడితే చాలు స్టేడియాలన్నీ మార్కోగుతున్నాయి. ముంబై(MI)తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌లో వరుసగా మూడో సిక్సర్లు బాది అభిమానులకు మజా పంచిన ధోనీ మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఇవాళ పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో... చెన్నై తలపడనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సొంత మైదానంలో చెన్నైకు చెక్‌ పెట్టాలని లక్నో భావిస్తుండగా.. బౌలింగ్‌ లోపాలను సరిదిద్దుకుని ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలని చెన్నై సూపర్‌ కింగ్స్ భావిస్తోంది. గత రెండు మ్యాచుల్లో ఈ రెండు జట్లు భిన్నమైన ఫలితాలను చూశాయి. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించగా... K.L. రాహుల్ నేతృత్వంలోని  లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. లక్నో సమస్యలు దాటగలదా..? లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటింగ్ ఆర్డర్... పేపర్‌పై చాలా బలంగా ఉంది. రాహుల్‌,  క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్‌లతో కూడిన లక్నో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. కానీ వీరిలో ఆత్మ విశ్వాసం లేకపోవడంతో  బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్నారు. లక్నో బ్యాటర్లు... మతీషా పతిరాణ యార్కర్లకు ఎలా సమాధానం చెప్తారో చూడాలి. ముస్తాఫిజుర్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా కూడా ఎకానా పిచ్‌పై లక్నో బౌలర్లను ఇబ్బంది పెట్టగలడు. ఈ సీజన్‌లో లక్నోలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 175గా ఉంది. ఈ స్కోరు పటిష్టమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లకు సరిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు లక్నోను గాయాలు వేధిస్తున్నాయి. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఇప్పటికే రెండు మ్యాచులకు దూరంకాగా... ఈ మ్యాచులోనూ మాయంక్‌ ఆడడం కష్టంగా మారింది.  స్పిన్నర్లే కీలకంఇరు జట్లలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్ భారీ అంచనాలు ఉన్నా ఇప్పటివరకూ మెరుగ్గా రాణించలేదు. బిష్ణోయ్‌ ఆరు మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. బిష్ణోయ్ వర్సెస్ శివమ్ దూబే మధ్య పోరు ఆసక్తి రేపనుంది. లక్నో ఓపెనర్‌ క్వింటన్ డి కాక్ ఎలా రాణిస్తాడో చూడాలి. కృనాల్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కెప్టెన్ KL రాహుల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఆరు మ్యాచుల్లో 19 సిక్సర్లతో నికోలస్ పూరన్ మాత్రమే ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

Apr 19, 2024 - 08:00
 0  0
IPL 2024: చెన్నై దూకుడును, లక్నో ఆపగలదా ?

LSG vs CSK IPL 2024 Preview and Prediction : ఐపీఎల్‌(IPL)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) మ్యాచ్‌ వస్తుందంటే చాలు అభిమానులకు అదో పండుగలా మారిపోయింది. ధోనీ మైదానంలో అడుగుపెడితే చాలు స్టేడియాలన్నీ మార్కోగుతున్నాయి. ముంబై(MI)తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌లో వరుసగా మూడో సిక్సర్లు బాది అభిమానులకు మజా పంచిన ధోనీ మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఇవాళ పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో... చెన్నై తలపడనుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సొంత మైదానంలో చెన్నైకు చెక్‌ పెట్టాలని లక్నో భావిస్తుండగా.. బౌలింగ్‌ లోపాలను సరిదిద్దుకుని ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలని చెన్నై సూపర్‌ కింగ్స్ భావిస్తోంది. గత రెండు మ్యాచుల్లో ఈ రెండు జట్లు భిన్నమైన ఫలితాలను చూశాయి. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించగా... K.L. రాహుల్ నేతృత్వంలోని  లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది.

లక్నో సమస్యలు దాటగలదా..?
 లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటింగ్ ఆర్డర్... పేపర్‌పై చాలా బలంగా ఉంది. రాహుల్‌,  క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్‌లతో కూడిన లక్నో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. కానీ వీరిలో ఆత్మ విశ్వాసం లేకపోవడంతో  బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్నారు. లక్నో బ్యాటర్లు... మతీషా పతిరాణ యార్కర్లకు ఎలా సమాధానం చెప్తారో చూడాలి. ముస్తాఫిజుర్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా కూడా ఎకానా పిచ్‌పై లక్నో బౌలర్లను ఇబ్బంది పెట్టగలడు. ఈ సీజన్‌లో లక్నోలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 175గా ఉంది. ఈ స్కోరు పటిష్టమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లకు సరిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు లక్నోను గాయాలు వేధిస్తున్నాయి. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఇప్పటికే రెండు మ్యాచులకు దూరంకాగా... ఈ మ్యాచులోనూ మాయంక్‌ ఆడడం కష్టంగా మారింది. 

స్పిన్నర్లే కీలకం
ఇరు జట్లలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్ భారీ అంచనాలు ఉన్నా ఇప్పటివరకూ మెరుగ్గా రాణించలేదు. బిష్ణోయ్‌ ఆరు మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. బిష్ణోయ్ వర్సెస్ శివమ్ దూబే మధ్య పోరు ఆసక్తి రేపనుంది. లక్నో ఓపెనర్‌ క్వింటన్ డి కాక్ ఎలా రాణిస్తాడో చూడాలి. కృనాల్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కెప్టెన్ KL రాహుల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఆరు మ్యాచుల్లో 19 సిక్సర్లతో నికోలస్ పూరన్ మాత్రమే ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.


లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow