Made In India Movie : రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా' - ఇది ఇండియన్ సినిమా బయోపిక్!

వెండితెరకు బయోపిక్స్ కొత్త కాదు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలను మన దర్శక - రచయితలు, నిర్మాతలు తెరకెక్కించారు. వాస్తవ ఘటనలు, సంఘటనలు ఎన్నిటినో సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ బయోపిక్ అందరి దృష్టిలో ఆకర్షిస్తోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దామా? రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా'దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) సమర్పణలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'మేడ్ ఇన్ ఇండియా' (Made In India). దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? భారతీయ సినిమా పితామహుడిగా (ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా) చరిత్రకు ఎక్కిన దాదా సాహేబ్ ఫాల్కే (Dadasaheb Phalke) బయోపిక్ ఇది. మన దేశంలో తొలి ఫీచర్ ఫిల్మ్ 'రాజా హరిశ్చంద్ర' తీసిన ఘనత దాదా సాహేబ్ ఫాల్కే సొంతం. 1913లో ఆ సినిమా వచ్చింది. ఇండియాలో సినిమా ఎలా పుట్టింది? ఫాల్కే ఏం చేశారు? భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఏమిటి? వంటి అంశాలతో పాటు ఆయన జీవితాన్ని 'మేడ్ ఇన్ ఇండియా'లో చూపించనున్నట్లు తెలిసింది.  'మేడ్ ఇన్ ఇండియా' చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకుడు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షోయింగ్ బిజినెస్, ఎ మేజర్ మోషన్ పిక్చర్ సంస్థలపై సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. మరాఠీ, తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ''నేను ఫస్ట్ టైమ్ 'మేడ్ ఇన్ ఇండియా' కథ విన్నప్పుడు... భావోద్వేగానికి లోను అయ్యాను. బయోపిక్ తీయడం కష్టం. అందులోనూ ఫాదర్ ఆఫ్ ఇండియా సినిమా బయోపిక్ తీసి కన్వీన్స్ చేయడం మరింత కష్టం. అందుకు మా బాయ్స్ రెడీగా ఉన్నాను. సగర్వంగా 'మేడ్ ఇన్ ఇండియా' సినిమాను ప్రజెంట్ చేస్తున్నా'' అని రాజమౌళి ట్వీట్ చేశారు.    Also Read : ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కుమార్తె - విషాదంలో చిత్రసీమ రాజమౌళి ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించడం ఇది ఏమీ తొలిసారి కాదు. ఇంతకు ముందు ఆయన స్నేహితుడు, 'ఈగ' చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి తీసిన 'అందాల రాక్షసి' సినిమా నచ్చడంతో దాని నిర్మాణంలో భాగస్వామి అయ్యారు.  Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా? When I first heard the narration, it moved me emotionally like nothing else. Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:)With immense pride,Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ — rajamouli ss (@ssrajamouli) September 19, 2023 దర్శకుడిగా రాజమౌళి సినిమాలకు వస్తే... 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. 'ఆర్ఆర్ఆర్'కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు అందులోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో తదుపరి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆ విషయం రాజమౌళికి కూడా తెలుసు. ఆ అంచనాలు మించేలా ఆయన నెక్స్ట్ సినిమా జానర్ ఎంపిక చేసుకున్నారు. గ్లోబ్ ట్రాంటింగ్ సినిమాగా తెరకెక్కించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Sep 19, 2023 - 12:00
 0  0
Made In India Movie : రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా' - ఇది ఇండియన్ సినిమా బయోపిక్!

వెండితెరకు బయోపిక్స్ కొత్త కాదు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలను మన దర్శక - రచయితలు, నిర్మాతలు తెరకెక్కించారు. వాస్తవ ఘటనలు, సంఘటనలు ఎన్నిటినో సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ బయోపిక్ అందరి దృష్టిలో ఆకర్షిస్తోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దామా?

రాజమౌళి సమర్పణలో 'మేడ్ ఇన్ ఇండియా'
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) సమర్పణలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'మేడ్ ఇన్ ఇండియా' (Made In India). దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? భారతీయ సినిమా పితామహుడిగా (ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా) చరిత్రకు ఎక్కిన దాదా సాహేబ్ ఫాల్కే (Dadasaheb Phalke) బయోపిక్ ఇది.

మన దేశంలో తొలి ఫీచర్ ఫిల్మ్ 'రాజా హరిశ్చంద్ర' తీసిన ఘనత దాదా సాహేబ్ ఫాల్కే సొంతం. 1913లో ఆ సినిమా వచ్చింది. ఇండియాలో సినిమా ఎలా పుట్టింది? ఫాల్కే ఏం చేశారు? భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఏమిటి? వంటి అంశాలతో పాటు ఆయన జీవితాన్ని 'మేడ్ ఇన్ ఇండియా'లో చూపించనున్నట్లు తెలిసింది. 

'మేడ్ ఇన్ ఇండియా' చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకుడు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షోయింగ్ బిజినెస్, ఎ మేజర్ మోషన్ పిక్చర్ సంస్థలపై సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. మరాఠీ, తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

''నేను ఫస్ట్ టైమ్ 'మేడ్ ఇన్ ఇండియా' కథ విన్నప్పుడు... భావోద్వేగానికి లోను అయ్యాను. బయోపిక్ తీయడం కష్టం. అందులోనూ ఫాదర్ ఆఫ్ ఇండియా సినిమా బయోపిక్ తీసి కన్వీన్స్ చేయడం మరింత కష్టం. అందుకు మా బాయ్స్ రెడీగా ఉన్నాను. సగర్వంగా 'మేడ్ ఇన్ ఇండియా' సినిమాను ప్రజెంట్ చేస్తున్నా'' అని రాజమౌళి ట్వీట్ చేశారు.   

Also Read : ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కుమార్తె - విషాదంలో చిత్రసీమ

రాజమౌళి ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించడం ఇది ఏమీ తొలిసారి కాదు. ఇంతకు ముందు ఆయన స్నేహితుడు, 'ఈగ' చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి తీసిన 'అందాల రాక్షసి' సినిమా నచ్చడంతో దాని నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. 

Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?

దర్శకుడిగా రాజమౌళి సినిమాలకు వస్తే... 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. 'ఆర్ఆర్ఆర్'కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు అందులోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో తదుపరి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆ విషయం రాజమౌళికి కూడా తెలుసు. ఆ అంచనాలు మించేలా ఆయన నెక్స్ట్ సినిమా జానర్ ఎంపిక చేసుకున్నారు. గ్లోబ్ ట్రాంటింగ్ సినిమాగా తెరకెక్కించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow