Malaikottai Vaaliban: మోహన్ లాల్ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మలైకోటై వాలిబన్'. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. పిఎస్ రఫిక్ దీనికి కథ అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్‌ వచ్చింది. వినాయక చవితి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.  'మలైకోటై వాలిబన్' చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబిక్ డే స్పెషల్ గా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ''కౌంట్ డౌన్ మొదలైంది! వాలిబన్ 2024 జనవరి 25వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నాడు'' అని మోహన్ లాల్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా ఆరు భాషల్లో అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను పంచుకున్నారు.            View this post on Instagram                       A post shared by Mohanlal (@mohanlal) 'మలైకోటై వాలిబన్' రిలీజ్ డేట్ పోస్టర్ లో మోహన్ లాల్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇందులో సీనియర్ నటుడు మట్టిలో కూర్చొని ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నాడు. ముడి వేసిన జుట్టు, కుబురు గడ్డం, కాళ్లకు కడియాలు, చేతికి పెద్ద పచ్చబొట్టుతో ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు. ఆరు పదులు దాటిన వయస్సులోనూ పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్నాడు. నిజానికి మోహన్ లాల్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ సాధించలేకపోతున్నారు. 'లూసిఫర్' తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'మలైకోటై వాలిబన్' సినిమాతో కంప్లీట్ యాక్టర్ తన సత్తా ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగా మంచి రిలీజ్ డేట్ దొరికిందని భావిస్తున్నారు. జనవరి 25 గురువారం మూవీ విడుదల అవుతుంది కాబట్టి, నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి అవకాశం కల్పిస్తుందని నమ్ముతున్నారు. జూన్‌ నెలలోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.  'మలైకోటై వాలిబన్‌' చిత్రాన్ని జాన్‌-మేరీ క్రియేటివ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్ ఎంటర్టైన్మెంట్స్, సెంచురీ ఫిలిమ్స్‌, ఆమెన్ మూవీ మొనాస్టరీ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శిబు బేబీ జాన్, మోహన్ లాల్, లిజో జోస్ పెల్లిస్సేరీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌ లాల్ తో పాటుగా హరీష్‌ పేరడి, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటుగా మరికొందరు ఇతర భాషల నటీనటులు నటిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ పిళ్లై ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, డీప్ ఎస్. జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.  ఇకపోతే 'మలైకోటై వాలిబన్‌' తో పాటుగా మరో అర డజను సినిమాల్లో మోహన్ లాల్ నటిస్తున్నారు. 'బరోజ్: గార్డియన్ ఆఫ్ డి'గామా' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. 'ఎంపురాన్' చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. 'వృషభ' సినిమా ఏకకాలంలో తెలుగు మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. 'రామ్: పార్ట్ 1' షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. 'రామ్: పార్ట్ 2', 'నేరు' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో 'లూసిఫర్'కు సీక్వెల్ 'ఎల్ 2 : ది ఎంపరర్' సినిమా కూడా చేస్తున్నారు.  Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Sep 19, 2023 - 00:00
 0  0
Malaikottai Vaaliban: మోహన్ లాల్ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మలైకోటై వాలిబన్'. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. పిఎస్ రఫిక్ దీనికి కథ అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్‌ వచ్చింది. వినాయక చవితి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. 

'మలైకోటై వాలిబన్' చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబిక్ డే స్పెషల్ గా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ''కౌంట్ డౌన్ మొదలైంది! వాలిబన్ 2024 జనవరి 25వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నాడు'' అని మోహన్ లాల్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా ఆరు భాషల్లో అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను పంచుకున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mohanlal (@mohanlal)

'మలైకోటై వాలిబన్' రిలీజ్ డేట్ పోస్టర్ లో మోహన్ లాల్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇందులో సీనియర్ నటుడు మట్టిలో కూర్చొని ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నాడు. ముడి వేసిన జుట్టు, కుబురు గడ్డం, కాళ్లకు కడియాలు, చేతికి పెద్ద పచ్చబొట్టుతో ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు. ఆరు పదులు దాటిన వయస్సులోనూ పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉన్నాడు.

నిజానికి మోహన్ లాల్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ సాధించలేకపోతున్నారు. 'లూసిఫర్' తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'మలైకోటై వాలిబన్' సినిమాతో కంప్లీట్ యాక్టర్ తన సత్తా ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగా మంచి రిలీజ్ డేట్ దొరికిందని భావిస్తున్నారు. జనవరి 25 గురువారం మూవీ విడుదల అవుతుంది కాబట్టి, నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి అవకాశం కల్పిస్తుందని నమ్ముతున్నారు. జూన్‌ నెలలోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 

'మలైకోటై వాలిబన్‌' చిత్రాన్ని జాన్‌-మేరీ క్రియేటివ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్ ఎంటర్టైన్మెంట్స్, సెంచురీ ఫిలిమ్స్‌, ఆమెన్ మూవీ మొనాస్టరీ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శిబు బేబీ జాన్, మోహన్ లాల్, లిజో జోస్ పెల్లిస్సేరీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌ లాల్ తో పాటుగా హరీష్‌ పేరడి, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటుగా మరికొందరు ఇతర భాషల నటీనటులు నటిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ పిళ్లై ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, డీప్ ఎస్. జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 

ఇకపోతే 'మలైకోటై వాలిబన్‌' తో పాటుగా మరో అర డజను సినిమాల్లో మోహన్ లాల్ నటిస్తున్నారు. 'బరోజ్: గార్డియన్ ఆఫ్ డి'గామా' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. 'ఎంపురాన్' చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. 'వృషభ' సినిమా ఏకకాలంలో తెలుగు మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. 'రామ్: పార్ట్ 1' షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. 'రామ్: పార్ట్ 2', 'నేరు' చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో 'లూసిఫర్'కు సీక్వెల్ 'ఎల్ 2 : ది ఎంపరర్' సినిమా కూడా చేస్తున్నారు. 

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow