Naga Panchami Serial Today April 19th: 'నాగ పంచమి' సీరియల్: అయ్యో.. పంచమి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్.. గుండె పగిలేలా ఏడ్చి ఏడిపించేసిన మోక్ష!

Naga Panchami Today Episode నా కొడుకు మోక్షకు నేను అంటే ప్రాణం నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లడని వైదేహి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మోక్ష అవునమ్మ నువ్వు అంటే నాకు ప్రాణం కానీ నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటాడు.  మోక్ష: నీ మూఢ నమ్మకాలతో నా బిడ్డను వదులుకోమని చెప్తున్నావ్ కదా. ఆ పాపాన్ని నీతో నేను చేయించలేనమ్మ అందుకే వెళ్లిపోతున్నా.. పంచమి.. పంచమి.. త్వరగా రా.. నాగేశ్వరి పాము కూడా అక్కడికి చాటుగా వస్తుంది. వైదేహి: మోక్ష నువ్వు వెళ్లిపోతే నా మీద ఒట్టే.  రఘురాం: అలాంటి పరిస్థితులు నువ్వే కల్పించావ్ వైదేహి.శబరి: మోక్ష నీ రక్తమే వైదేహి నువ్వు మొండి అయితే మోక్ష జగమొండి.మీనాక్షి: ఇప్పటికైనా మించి పోయింది లేదు వదినా గర్భం తీయించమని నువ్వు అడగకు.వైదేహి: మోక్ష ఎవరు చెప్పినా నా మనసులో బాధపోదు. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయం నేను తట్టుకోలేను.మోక్ష: ఇక నీకు ఆ భయం లేదమ్మా. మేం వెళ్లిపోతున్నాం. నాకు ఏం జరిగినా మీకు తెలీదు. రా పంచమిపంచమి: ఆగండి మోక్షాబాబు. తల్లీ కొడుకుల్ని విడదీసిన పాపం నా బిడ్డకు అవసరం లేదు. నేను కడుపు తీయించుకుంటాను. నా కోసం నా బిడ్డ కోసం మీరు ఎవరూ విడిపోవాల్సిన అవసరంలేదు అత్తయ్య. నేను నా బిడ్డను పోగొట్టుకోవడానికి సిద్ధం. మోక్ష: నేను ఒప్పుకోను పంచమి. అది నిర్ణయించడం నీ ఒక్కదాని ఇష్టం కాదు పంచమి. నేను ఒప్పుకోవాలి. పంచమి: నిజమే మోక్షాబాబు. కానీ నా కడుపులో ఉన్నది మూడు నెలల పిండం మాత్రమే. కానీ అత్తయ్య గారి ముందు పాతికేళ్లు పెంచిన ప్రేమ ఉంది. మనం మన బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ కంటే మీ మీద మీ అమ్మ పెంచుకున్న ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. ఆ ప్రేమను వెలకట్టలేం మోక్షాబాబు. మోక్ష: నీకు పిచ్చిపట్టినట్లు ఉంది పంచమి. నాకు ఏం జరగదు. నువ్వు భయపడి మన బిడ్డను బలి పెట్టడానికి సిద్ధపడుతున్నావు.పంచమి: అవును అత్తయ్య గారికి కొడుకు కావాలి. నాకు భర్త కావాలి. రఘురాం: పంచమి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదమ్మ. శబరి: తొందర పడకమ్మా ఆ బాధ జీవితాంతం మిగిలిపోతుంది. మీనాక్షి: మరోసారి గురువుగారిని కలిసి మాట్లాడుదాం పంచమి. పరిహారం ఉంటుంది. పంచమి: అవసరం లేదు నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మీ ఇష్టం అత్తయ్య గారు మీరు చెప్పినట్లే వింటాను. వైదేహి: చాలా సంతోషం పంచమి నా కన్న ప్రేమను అర్థం చేసుకున్నావు. అని పంచమిని వైదేహి హగ్ చేసుకుంటే.. మోక్ష కుప్పకూలిపోతాడు. మరోవైపు నాగేశ్వరి పాము కూడా దిగులుగా వెనుదిరుగుతుంది. ఈరోజే మనం హాస్పిటల్‌కి వెళ్దాం పంచమి.. వెళ్దాం.. మరోవైపు నాగేశ్వరి నాగదేవతని ప్రసన్నం చేసుకొని పంచమి తన కడుపులో బిడ్డను తీయించుకోవడానికి నిర్ణయించుకుందని ఇంట్లో పరిస్థితులు అలా వచ్చాయని చెప్తుంది. తనకు పుట్టుబోయే బిడ్డ వల్ల భర్తకు కీడు జరుగుతుందని కరాళి బాగా నమ్మించిందని నాగేశ్వరి నాగదేవతకు చెప్తుంది. దీంతో నాగదేవత అలా జరగడానికి వీల్లేదు అని చెప్తుంది. పంచమిని కలవమని నాగదేవత నాగేశ్వరికి చెప్తుంది.  నాగదేవత: తన కడుపులో పెరుగుతున్నది తన కన్న తల్లి అని పంచమికి తెలియాలి. అప్పుడు పంచమినే తన కడుపులో బిడ్డను కాపాడుకుంటుంది. ప్రస్తుతం మనకున్నది ఇదొక్కటే మార్గం ప్రయత్నించు.  మోక్ష: పంచమి నువ్వు చేస్తున్నది మహాపాపం అని నీకు తెలీయడం లేదు. నువ్వు బలవంతంగా ఈ పనికి ఒప్పుకుంటున్నావ్.పంచమి: ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పుదు మోక్షాబాబు. మీ అమ్మగారు మిమల్ని వదులుకోలేరు. కాబట్టి నేను నా బిడ్డను వదులుకోక తప్పదు. అందుకు మీరు ఒప్పుకొని తీరాలి. నాకు మీరు కావాలి. మోక్ష: కానీ నాకు నా బిడ్డ ముఖ్యం.వైదేహి: నాకు నా బిడ్డ ముఖ్యం మోక్ష. ఇక ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు.మోక్ష: తర్వాత తర్వాత చాలా బాధ పడతావు పంచమి.రఘురాం: అమ్మా పంచమి నీ నిర్ణయం మార్చుకో.పంచమి: నేను మాట ఇచ్చాను మామయ్యగారు.మీనాక్షి: పంచమి మోక్ష చెప్పింది విను. వైదేహి: మీరు ఎవరూ మాట్లాడకండి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ మీ ఏడుపులు ఏంటి. పంచమి: అత్తయ్య గారు తల్లిని నేను ఒప్పుకుంటున్నాను.వైదేహి: మీ మాటలు నమ్మి ఫ్యామిలీ డాక్టర్‌కి కాల్ చేశాను. ఆవిడ నిన్ను ఇప్పుడే తీసుకురమ్మాన్నారు. పంచమి: పదండి అత్తయ్య గారు.మోక్ష: నేను వెళ్లనివ్వను.  వైదేహి పంచమిని తీసుకొని వెళ్తుంది. మోక్ష పంచమి అని వెనక పడతాడు. మోక్ష బతిమాలుతాడు. దీంతో వైదేహి మోక్షని గదిలో పెట్టి తాళం వేసేస్తుంది. ఎవరైనా డోర్ తీస్తే నా శవాన్ని చూస్తారని చెప్పి పంచమిని తీసుకొని వెళ్తుంది. మోక్ష తలుపు కొడుతూ చాలా ఏడుస్తాడు.  మరోవైపు కరాళి, ఫణేంద్రలు అదంతా చూస్తారు. తాము అనుకున్నది కొద్ది సేపట్లో జరుగుతుందని అంటుంది. ఈ కొద్ది సమయం చాలా జాగ్రత్తగా ఉండాలని. నాగేశ్వరి, నాగదేవతలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు అని వాళ్లని అడ్డుకోవాలని అంటుంది. ఇద్దరూ బయల్దేరు తారు. మరోవైపు మోక్ష ఇంట్లో అందరూ దిగులుగా కూర్చొంటారు. మోక్ష తన తండ్రి, శబరి వాళ్లకి తలుపు తీయమని వేడుకుంటాడు. అన్నల్ని కూడా పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  Also Read: సత్యభామ సీరియల్: సత్యని అలా చూసిన క్రిష్ మతిపోయిందిగా.. టామ్ అండ్ జర్రీ వార్ మామూలుగా లేదు!

Apr 19, 2024 - 17:00
 0  0
Naga Panchami Serial Today April 19th: 'నాగ పంచమి' సీరియల్: అయ్యో.. పంచమి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్.. గుండె పగిలేలా ఏడ్చి ఏడిపించేసిన మోక్ష!

Naga Panchami Today Episode నా కొడుకు మోక్షకు నేను అంటే ప్రాణం నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లడని వైదేహి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మోక్ష అవునమ్మ నువ్వు అంటే నాకు ప్రాణం కానీ నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటాడు. 

మోక్ష: నీ మూఢ నమ్మకాలతో నా బిడ్డను వదులుకోమని చెప్తున్నావ్ కదా. ఆ పాపాన్ని నీతో నేను చేయించలేనమ్మ అందుకే వెళ్లిపోతున్నా.. పంచమి.. పంచమి.. త్వరగా రా.. నాగేశ్వరి పాము కూడా అక్కడికి చాటుగా వస్తుంది. 
వైదేహి: మోక్ష నువ్వు వెళ్లిపోతే నా మీద ఒట్టే.  
రఘురాం: అలాంటి పరిస్థితులు నువ్వే కల్పించావ్ వైదేహి.
శబరి: మోక్ష నీ రక్తమే వైదేహి నువ్వు మొండి అయితే మోక్ష జగమొండి.
మీనాక్షి: ఇప్పటికైనా మించి పోయింది లేదు వదినా గర్భం తీయించమని నువ్వు అడగకు.
వైదేహి: మోక్ష ఎవరు చెప్పినా నా మనసులో బాధపోదు. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయం నేను తట్టుకోలేను.
మోక్ష: ఇక నీకు ఆ భయం లేదమ్మా. మేం వెళ్లిపోతున్నాం. నాకు ఏం జరిగినా మీకు తెలీదు. రా పంచమి
పంచమి: ఆగండి మోక్షాబాబు. తల్లీ కొడుకుల్ని విడదీసిన పాపం నా బిడ్డకు అవసరం లేదు. నేను కడుపు తీయించుకుంటాను. నా కోసం నా బిడ్డ కోసం మీరు ఎవరూ విడిపోవాల్సిన అవసరంలేదు అత్తయ్య. నేను నా బిడ్డను పోగొట్టుకోవడానికి సిద్ధం. 
మోక్ష: నేను ఒప్పుకోను పంచమి. అది నిర్ణయించడం నీ ఒక్కదాని ఇష్టం కాదు పంచమి. నేను ఒప్పుకోవాలి. 
పంచమి: నిజమే మోక్షాబాబు. కానీ నా కడుపులో ఉన్నది మూడు నెలల పిండం మాత్రమే. కానీ అత్తయ్య గారి ముందు పాతికేళ్లు పెంచిన ప్రేమ ఉంది. మనం మన బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ కంటే మీ మీద మీ అమ్మ పెంచుకున్న ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. ఆ ప్రేమను వెలకట్టలేం మోక్షాబాబు. 
మోక్ష: నీకు పిచ్చిపట్టినట్లు ఉంది పంచమి. నాకు ఏం జరగదు. నువ్వు భయపడి మన బిడ్డను బలి పెట్టడానికి సిద్ధపడుతున్నావు.
పంచమి: అవును అత్తయ్య గారికి కొడుకు కావాలి. నాకు భర్త కావాలి. 
రఘురాం: పంచమి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదమ్మ. 
శబరి: తొందర పడకమ్మా ఆ బాధ జీవితాంతం మిగిలిపోతుంది. 
మీనాక్షి: మరోసారి గురువుగారిని కలిసి మాట్లాడుదాం పంచమి. పరిహారం ఉంటుంది. 
పంచమి: అవసరం లేదు నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మీ ఇష్టం అత్తయ్య గారు మీరు చెప్పినట్లే వింటాను. 
వైదేహి: చాలా సంతోషం పంచమి నా కన్న ప్రేమను అర్థం చేసుకున్నావు. అని పంచమిని వైదేహి హగ్ చేసుకుంటే.. మోక్ష కుప్పకూలిపోతాడు. మరోవైపు నాగేశ్వరి పాము కూడా దిగులుగా వెనుదిరుగుతుంది. ఈరోజే మనం హాస్పిటల్‌కి వెళ్దాం పంచమి.. వెళ్దాం..

మరోవైపు నాగేశ్వరి నాగదేవతని ప్రసన్నం చేసుకొని పంచమి తన కడుపులో బిడ్డను తీయించుకోవడానికి నిర్ణయించుకుందని ఇంట్లో పరిస్థితులు అలా వచ్చాయని చెప్తుంది. తనకు పుట్టుబోయే బిడ్డ వల్ల భర్తకు కీడు జరుగుతుందని కరాళి బాగా నమ్మించిందని నాగేశ్వరి నాగదేవతకు చెప్తుంది. దీంతో నాగదేవత అలా జరగడానికి వీల్లేదు అని చెప్తుంది. పంచమిని కలవమని నాగదేవత నాగేశ్వరికి చెప్తుంది. 

నాగదేవత: తన కడుపులో పెరుగుతున్నది తన కన్న తల్లి అని పంచమికి తెలియాలి. అప్పుడు పంచమినే తన కడుపులో బిడ్డను కాపాడుకుంటుంది. ప్రస్తుతం మనకున్నది ఇదొక్కటే మార్గం ప్రయత్నించు. 

మోక్ష: పంచమి నువ్వు చేస్తున్నది మహాపాపం అని నీకు తెలీయడం లేదు. నువ్వు బలవంతంగా ఈ పనికి ఒప్పుకుంటున్నావ్.
పంచమి: ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పుదు మోక్షాబాబు. మీ అమ్మగారు మిమల్ని వదులుకోలేరు. కాబట్టి నేను నా బిడ్డను వదులుకోక తప్పదు. అందుకు మీరు ఒప్పుకొని తీరాలి. నాకు మీరు కావాలి. 
మోక్ష: కానీ నాకు నా బిడ్డ ముఖ్యం.
వైదేహి: నాకు నా బిడ్డ ముఖ్యం మోక్ష. ఇక ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు.
మోక్ష: తర్వాత తర్వాత చాలా బాధ పడతావు పంచమి.
రఘురాం: అమ్మా పంచమి నీ నిర్ణయం మార్చుకో.
పంచమి: నేను మాట ఇచ్చాను మామయ్యగారు.
మీనాక్షి: పంచమి మోక్ష చెప్పింది విను. 
వైదేహి: మీరు ఎవరూ మాట్లాడకండి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ మీ ఏడుపులు ఏంటి. 
పంచమి: అత్తయ్య గారు తల్లిని నేను ఒప్పుకుంటున్నాను.
వైదేహి: మీ మాటలు నమ్మి ఫ్యామిలీ డాక్టర్‌కి కాల్ చేశాను. ఆవిడ నిన్ను ఇప్పుడే తీసుకురమ్మాన్నారు. 
పంచమి: పదండి అత్తయ్య గారు.
మోక్ష: నేను వెళ్లనివ్వను. 

వైదేహి పంచమిని తీసుకొని వెళ్తుంది. మోక్ష పంచమి అని వెనక పడతాడు. మోక్ష బతిమాలుతాడు. దీంతో వైదేహి మోక్షని గదిలో పెట్టి తాళం వేసేస్తుంది. ఎవరైనా డోర్ తీస్తే నా శవాన్ని చూస్తారని చెప్పి పంచమిని తీసుకొని వెళ్తుంది. మోక్ష తలుపు కొడుతూ చాలా ఏడుస్తాడు. 

మరోవైపు కరాళి, ఫణేంద్రలు అదంతా చూస్తారు. తాము అనుకున్నది కొద్ది సేపట్లో జరుగుతుందని అంటుంది. ఈ కొద్ది సమయం చాలా జాగ్రత్తగా ఉండాలని. నాగేశ్వరి, నాగదేవతలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు అని వాళ్లని అడ్డుకోవాలని అంటుంది. ఇద్దరూ బయల్దేరు తారు. మరోవైపు మోక్ష ఇంట్లో అందరూ దిగులుగా కూర్చొంటారు. మోక్ష తన తండ్రి, శబరి వాళ్లకి తలుపు తీయమని వేడుకుంటాడు. అన్నల్ని కూడా పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని అలా చూసిన క్రిష్ మతిపోయిందిగా.. టామ్ అండ్ జర్రీ వార్ మామూలుగా లేదు!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow