Pallavi Prashanth: ఆ ఇద్దరు నా కొడుకును రారా పోరా అంటూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు: కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ తండ్రి

బిగ్ బాస్ సీజన్ 7లో అయితే అందరికంటే చాలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు పల్లవి ప్రశాంత్. ఒక రైతుబిడ్డను అని చెప్పుకుంటూ, తానొక రైతును అని పదేపదే కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుచేస్తున్నాడు. తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి, తనను అవమానిస్తున్న కంటెస్టెంట్స్ గురించి తన తండ్రి స్పందించారు. రైతుల బ్రతుకులు వేస్ట్..రైతుల బ్రతుకులు ఘోరంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు పల్లవి ప్రశాంత్ తండ్రి. కాలం కలిసి వస్తేనే రైతుల జీవితాలు బాగుంటాయని లేకపోతే వారికి అనేక కష్టాలు ఉంటాయని అన్నారు. వ్యవసాయం కోసం రూ.1 లక్ష ఖర్చు పెడితే కాలం కలిసొస్తే ఆ లక్ష.. రెండు లక్షలు అవుతుంది లేకపోతే లేదని వాపోయారు. రైతుల బ్రతుకులు వేస్ట్ అని పదేపదే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక రైతు బిడ్డగా తన కొడుకు ఎదగడం, బిగ్ బాస్ వరకు వెళ్లడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రైతును బిగ్ బాస్‌లోకి రానివ్వడం సంతోషంగా ఉందన్నారు. తమకు అంతే తృప్తిగా ఉందని తెలిపారు. ఘోరంగా తిడుతున్నారు..బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు అయిపోతే.. పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఒకవైపు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. దానిపై తన తండ్రి స్పందించారు. ‘‘ప్రశాంత్‌ను ఘోరంగా తిడుతున్నారు. డబ్బులు ఉన్నాయనే అలా మాట్లాడుతున్నారు. రైతుబిడ్డ కాబట్టి రైతులకు డబ్బులు ఇస్తా అన్నాడు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఇస్తా అన్నాడు’’ అంటూ ప్రశాంత్ తండ్రి తెలిపారు. ప్రశాంత్‌ను ఇంట్లో అందరూ రారా, పోరా అంటున్నారని వాపోయారు. ప్రేమగా అంటే ఏం కాదు కానీ అది అమర్యాదగా అనిపిస్తుందని బాధపడ్డారు. తాత రైతు కానీ తండ్రి రైతు కాదు కదా..పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ సమయంలో ఆట సందీప్.. తన తాత కూడా రైతే అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానిపై కూడా పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించారు. ‘‘మా తాత రైతు అని చెప్పుకున్నాడు. కానీ మా తండ్రి రైతు అని చెప్పలేదు కదా. బిల్డింగులు కట్టడం గొప్ప కాదు. ఒక ఎకరం పొలంలో పంట పండిస్తే అదే గొప్ప’’ అని కౌంటర్ ఇచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ పదేపదే రైతుబిడ్డ అని ఇస్తున్న స్టేట్‌మెంట్ గురించి కూడా తన తండ్రి మాట్లాడారు. ‘‘రైతుబిడ్డ అని వాళ్లు హేళన చేస్తున్నారు. కానీ నా కొడుకు మాత్రం అలా చెప్పుకోలేదు’’ అంటూ ప్రశాంత్‌ను సమర్ధిస్తూ మాట్లాడారు. తన కొడుకు ఎప్పుడూ జీవితంలో ఒక మాట పడలేదని ఎమోషనల్ అయ్యారు. పెద్దకొడుకు అనుకుంటా..నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ హైలెట్‌గా నిలిచింది. ఇక అమర్‌దీప్‌ను, అతడు అన్న మాటలను ఉద్దేశించి కూడా ప్రశాంత్ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘అతడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ కూడా అలాగే మాట్లాడాడు. ఇద్దరు ఉన్నవాళ్లే. ఒక సీరియల్ తీస్తే అతడికి రూ.10 లక్షలు వచ్చినప్పుడు బీటెక్ చదివినవాళ్లకి ఇవ్వచ్చు కదా. మరి ఎవరికైనా ఇచ్చారా. లేదు కదా. ప్రశాంత్‌పై అతను పళ్లు కొరుకుతున్నాడు. అయినా కూడా అతను నా కొడుకులాగానే. ప్రశాంత్‌ను రారా, పోరా అన్నా కూడా అతను నా పెద్ద కొడుకు అనుకుంటాను’’ అని అమర్‌దీప్ గురించి మాట్లాడారు ప్రశాంత్ తండ్రి. పల్లవి ప్రశాంత్ ఇంట్లో ఉన్నట్టే బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ఉంటున్నాడని, అతడి కోపం ఇప్పటివరకు చూడలేదని కేవలం బిగ్ బాస్‌లోనే చూస్తున్నామని ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్తున్నారు. Also Read: శృతి హాసన్‌ను కంగారుపెట్టిన ఫ్యాన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Sep 18, 2023 - 21:00
 0  0
Pallavi Prashanth: ఆ ఇద్దరు నా కొడుకును రారా పోరా అంటూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు: కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ తండ్రి

బిగ్ బాస్ సీజన్ 7లో అయితే అందరికంటే చాలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు పల్లవి ప్రశాంత్. ఒక రైతుబిడ్డను అని చెప్పుకుంటూ, తానొక రైతును అని పదేపదే కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుచేస్తున్నాడు. తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి, తనను అవమానిస్తున్న కంటెస్టెంట్స్ గురించి తన తండ్రి స్పందించారు.

రైతుల బ్రతుకులు వేస్ట్..
రైతుల బ్రతుకులు ఘోరంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు పల్లవి ప్రశాంత్ తండ్రి. కాలం కలిసి వస్తేనే రైతుల జీవితాలు బాగుంటాయని లేకపోతే వారికి అనేక కష్టాలు ఉంటాయని అన్నారు. వ్యవసాయం కోసం రూ.1 లక్ష ఖర్చు పెడితే కాలం కలిసొస్తే ఆ లక్ష.. రెండు లక్షలు అవుతుంది లేకపోతే లేదని వాపోయారు. రైతుల బ్రతుకులు వేస్ట్ అని పదేపదే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక రైతు బిడ్డగా తన కొడుకు ఎదగడం, బిగ్ బాస్ వరకు వెళ్లడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రైతును బిగ్ బాస్‌లోకి రానివ్వడం సంతోషంగా ఉందన్నారు. తమకు అంతే తృప్తిగా ఉందని తెలిపారు.

ఘోరంగా తిడుతున్నారు..
బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు అయిపోతే.. పల్లవి ప్రశాంత్ ఒక్కడే ఒకవైపు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. దానిపై తన తండ్రి స్పందించారు. ‘‘ప్రశాంత్‌ను ఘోరంగా తిడుతున్నారు. డబ్బులు ఉన్నాయనే అలా మాట్లాడుతున్నారు. రైతుబిడ్డ కాబట్టి రైతులకు డబ్బులు ఇస్తా అన్నాడు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఇస్తా అన్నాడు’’ అంటూ ప్రశాంత్ తండ్రి తెలిపారు. ప్రశాంత్‌ను ఇంట్లో అందరూ రారా, పోరా అంటున్నారని వాపోయారు. ప్రేమగా అంటే ఏం కాదు కానీ అది అమర్యాదగా అనిపిస్తుందని బాధపడ్డారు.

తాత రైతు కానీ తండ్రి రైతు కాదు కదా..
పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ సమయంలో ఆట సందీప్.. తన తాత కూడా రైతే అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానిపై కూడా పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించారు. ‘‘మా తాత రైతు అని చెప్పుకున్నాడు. కానీ మా తండ్రి రైతు అని చెప్పలేదు కదా. బిల్డింగులు కట్టడం గొప్ప కాదు. ఒక ఎకరం పొలంలో పంట పండిస్తే అదే గొప్ప’’ అని కౌంటర్ ఇచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ పదేపదే రైతుబిడ్డ అని ఇస్తున్న స్టేట్‌మెంట్ గురించి కూడా తన తండ్రి మాట్లాడారు. ‘‘రైతుబిడ్డ అని వాళ్లు హేళన చేస్తున్నారు. కానీ నా కొడుకు మాత్రం అలా చెప్పుకోలేదు’’ అంటూ ప్రశాంత్‌ను సమర్ధిస్తూ మాట్లాడారు. తన కొడుకు ఎప్పుడూ జీవితంలో ఒక మాట పడలేదని ఎమోషనల్ అయ్యారు.

పెద్దకొడుకు అనుకుంటా..
నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ హైలెట్‌గా నిలిచింది. ఇక అమర్‌దీప్‌ను, అతడు అన్న మాటలను ఉద్దేశించి కూడా ప్రశాంత్ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘అతడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ కూడా అలాగే మాట్లాడాడు. ఇద్దరు ఉన్నవాళ్లే. ఒక సీరియల్ తీస్తే అతడికి రూ.10 లక్షలు వచ్చినప్పుడు బీటెక్ చదివినవాళ్లకి ఇవ్వచ్చు కదా. మరి ఎవరికైనా ఇచ్చారా. లేదు కదా. ప్రశాంత్‌పై అతను పళ్లు కొరుకుతున్నాడు. అయినా కూడా అతను నా కొడుకులాగానే. ప్రశాంత్‌ను రారా, పోరా అన్నా కూడా అతను నా పెద్ద కొడుకు అనుకుంటాను’’ అని అమర్‌దీప్ గురించి మాట్లాడారు ప్రశాంత్ తండ్రి. పల్లవి ప్రశాంత్ ఇంట్లో ఉన్నట్టే బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ఉంటున్నాడని, అతడి కోపం ఇప్పటివరకు చూడలేదని కేవలం బిగ్ బాస్‌లోనే చూస్తున్నామని ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్తున్నారు.

Also Read: శృతి హాసన్‌ను కంగారుపెట్టిన ఫ్యాన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow