Pottel Teaser: గొర్రెపిల్ల కోసం ఊరంతా ఒకటై ఓ కుటుంబంపై దాడి - ఉత్కంఠ రేపుతున్న 'పొట్టెల్‌' టీజర్‌

Ananya Nagall Pettel Teaser Out; దర్శకుడు సాహిత్ మోతుకూరి మూడో సినిమాగా తెరకెక్కుతున్న సినిమా 'పొట్టెల్‌'. యువ చంద్రా, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇప్పిటికే రిలీజ్‌ అయిన ఈ మూవీ ప్రచార పోస్టర్స్‌తో మూవీ అంచనాలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను బ్లాక్‌బస్టర్‌ హిట్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన ఈ పొట్టెల్‌ టీజర్‌ అద్యాంతం ఆసక్తిగా సాగింది. డార్క్‌ థీమ్‌తో మొదలైన ఈ టీజర్‌ ఉత్కంఠగా సాగింది. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబాన్ని కుల వివక్షతో ఆ గ్రామస్థులంతా వెలివేయడం, అదే సమయంలో ఆ కుటుంబ పెద్ద ఊరికి చెందిన పవిత్రమైన పొట్టెలు తప్పివడంతో ఊరు ప్రజలంతా ఒక్కటై ఆ కుటుంబంపై దాడి చేస్తుండం వంటి ఆసక్తికర అంశాలతో టీజర్‌ సాగింది. ఇక ఇందులో నటుడు అజయ్‌ పటెల్‌ దొర పాత్రలో కనిపించాడు. తన దగ్గర పనిచేసే వారు పనివారిలాగే ఉండాలని, చదువుకోవద్దు అనే ఆలోచనలో ఉండే దొరలాగా కనిపించాడు. 'చదుకున్న పనోడు, పటేలు సమానం అయితరంటే నేను ఎట్లా ఉరుకుంటనే' అనే డైలాగ్‌తో మూవీ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇక యువ చంద్రా భార్యగా అనన్య నాగళ్ల నటించింది. ఒక సీన్‌లో అతడి భార్య అయిన అనన్యను వెనకనుంచి ఓ వ్యక్తి తన్నడం, హీరో కూతురితో కలిసి సైకిల్‌పై వెళ్తుండగా ఊరు ప్రజలంతా దాడి చేయడం వంటి సన్నివేశాలతో టీజర్‌ సాగింది. ఇలాంటి పరిస్థితులు ఇప్పటికే తెలంగాణలో ఏదోక మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని బేస్‌ చేసుకుని సాహిత్‌ మోతుకురి పోట్టెల్‌ను ఓ కల్పిత కథగా రూపొందించి తెరకెక్కిస్తున్నాడు. గ్రామాల్లో కనిపించే కుల వివక్ష, పేదవాడు అనే చిన్న చూపు, పటెల్‌ దోర ఆగడాలు వంటి థీమ్‌తో దర్శకుడు సాహిత్‌ ఓ మంచి సందేశం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మూవీ టీం అనౌన్స్‌ చేయబోతుంది. ఇక టీజర్‌ లాంచ్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమా గురించి మాట్లాడాడు. సాహిత్‌తో నాకు నాలుగేళ్ల పరిచయం ఉంది. ఈ కథ గురించి నాకు ముందుగా ఫోన్‌లో చెప్పాడు. ఈ మూవీ విషయంలో అతడు మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 'పొట్టెల్' టీజర్ చూస్తున్నపుడు ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. తెలుగులో ఇలాంటి కంటెంట్‌ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఈ మూవీని ఫస్ట్‌డే చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి" అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం పోటెల్‌ దర్శకుడు, నటీనటులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. కాగా ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Apr 18, 2024 - 23:00
 0  1
Pottel Teaser: గొర్రెపిల్ల కోసం ఊరంతా ఒకటై ఓ కుటుంబంపై దాడి - ఉత్కంఠ రేపుతున్న 'పొట్టెల్‌' టీజర్‌

Ananya Nagall Pettel Teaser Out; దర్శకుడు సాహిత్ మోతుకూరి మూడో సినిమాగా తెరకెక్కుతున్న సినిమా 'పొట్టెల్‌'. యువ చంద్రా, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇప్పిటికే రిలీజ్‌ అయిన ఈ మూవీ ప్రచార పోస్టర్స్‌తో మూవీ అంచనాలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను బ్లాక్‌బస్టర్‌ హిట్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన ఈ పొట్టెల్‌ టీజర్‌ అద్యాంతం ఆసక్తిగా సాగింది. డార్క్‌ థీమ్‌తో మొదలైన ఈ టీజర్‌ ఉత్కంఠగా సాగింది. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబాన్ని కుల వివక్షతో ఆ గ్రామస్థులంతా వెలివేయడం, అదే సమయంలో ఆ కుటుంబ పెద్ద ఊరికి చెందిన పవిత్రమైన పొట్టెలు తప్పివడంతో ఊరు ప్రజలంతా ఒక్కటై ఆ కుటుంబంపై దాడి చేస్తుండం వంటి ఆసక్తికర అంశాలతో టీజర్‌ సాగింది.

ఇక ఇందులో నటుడు అజయ్‌ పటెల్‌ దొర పాత్రలో కనిపించాడు. తన దగ్గర పనిచేసే వారు పనివారిలాగే ఉండాలని, చదువుకోవద్దు అనే ఆలోచనలో ఉండే దొరలాగా కనిపించాడు. 'చదుకున్న పనోడు, పటేలు సమానం అయితరంటే నేను ఎట్లా ఉరుకుంటనే' అనే డైలాగ్‌తో మూవీ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇక యువ చంద్రా భార్యగా అనన్య నాగళ్ల నటించింది. ఒక సీన్‌లో అతడి భార్య అయిన అనన్యను వెనకనుంచి ఓ వ్యక్తి తన్నడం, హీరో కూతురితో కలిసి సైకిల్‌పై వెళ్తుండగా ఊరు ప్రజలంతా దాడి చేయడం వంటి సన్నివేశాలతో టీజర్‌ సాగింది. ఇలాంటి పరిస్థితులు ఇప్పటికే తెలంగాణలో ఏదోక మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని బేస్‌ చేసుకుని సాహిత్‌ మోతుకురి పోట్టెల్‌ను ఓ కల్పిత కథగా రూపొందించి తెరకెక్కిస్తున్నాడు. గ్రామాల్లో కనిపించే కుల వివక్ష, పేదవాడు అనే చిన్న చూపు, పటెల్‌ దోర ఆగడాలు వంటి థీమ్‌తో దర్శకుడు సాహిత్‌ ఓ మంచి సందేశం ఇవ్వబోతున్నాడు.

ప్రస్తుతం ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మూవీ టీం అనౌన్స్‌ చేయబోతుంది. ఇక టీజర్‌ లాంచ్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమా గురించి మాట్లాడాడు. సాహిత్‌తో నాకు నాలుగేళ్ల పరిచయం ఉంది. ఈ కథ గురించి నాకు ముందుగా ఫోన్‌లో చెప్పాడు. ఈ మూవీ విషయంలో అతడు మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 'పొట్టెల్' టీజర్ చూస్తున్నపుడు ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. తెలుగులో ఇలాంటి కంటెంట్‌ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఈ మూవీని ఫస్ట్‌డే చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి" అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం పోటెల్‌ దర్శకుడు, నటీనటులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. కాగా ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow