Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు

Makers Announced Premalu 2: ఇటీవల రిలీజైన బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. అదే మలయాళ  చిత్రం 'ప్రేమలు' . హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంది..  మలయాళంలో విడుదలై అక్కడ భారీ విజయం అందుకుంది ఈ చిత్రం. ఇటీవల మార్చి 9న ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం  తెలుగులోనూ రిలీజ్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక్కడ దాదాపు రూ. 17కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ సినిమాను డైరెక్టర్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథ పెద్దగా లేకపోయినా ఫన్‌ ఎలిమెంట్స్‌ బాగా ఆకట్టుకన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కడం, నేటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే డైలాగ్స్‌, లవ్‌ స్టోరీ కావడంతో యువతను ప్రేమలు బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్‌తో అదరగొడుతున్న ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. 'ప్రేమలు' మూవీకి సీక్వెల్‌ ఉందని ప్రకటిస్తూ రిలీజ్‌పై ఇప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌ 2025లోనే రిలీజ్‌ అవుతుందని స్పష్టం చేశారు. కాగా 'ప్రేమలు 2' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇస్తూ ఎస్‌ఎస్‌ కార్తీక తన ఎక్స్‌లో పోస్ట్‌లో షేర్‌ చేశాడు. "ప్రేమలు(#premalu) నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం. దీన్ని మరిచిపోలేని విధంగా చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు నేను నిజంగా కృతజ్ఞుడిని. బిగ్‌ థ్యాంక్స్‌ టూ భావనా స్టూడియోస్‌. ఇప్పుడు 'ప్రేమలు 2'(#premalu 2) కూడా రాబోతుంది. మరింత ప్రేమ, ఉత్సాహంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ కార్తీకేయ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక బ్లాక్‌బస్టర్‌ ప్రేమలు మూవీకి సీక్వెల్‌ అనౌన్స్‌ చేయడంతో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.  #Premalu was such a beautiful chapter in my life. I'm truly grateful to my Telugu audience for making it unforgettable. Big thanks to @BhavanaStudios for all the support and love ❤️Excited and humbled to present #Premalu2 in Telugu, with even more love… pic.twitter.com/ghgsj9swF9 — S S Karthikeya (@ssk1122) April 19, 2024 Also Read: 'లీడర్‌' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన శేఖర్‌ కమ్ముల - ఈసారి కూడా రానానే హీరో!

Apr 19, 2024 - 23:00
 0  0
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు

Makers Announced Premalu 2: ఇటీవల రిలీజైన బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి తాజాగా సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. అదే మలయాళ  చిత్రం 'ప్రేమలు' . హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంది..  మలయాళంలో విడుదలై అక్కడ భారీ విజయం అందుకుంది ఈ చిత్రం. ఇటీవల మార్చి 9న ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం  తెలుగులోనూ రిలీజ్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక్కడ దాదాపు రూ. 17కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ సినిమాను డైరెక్టర్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథ పెద్దగా లేకపోయినా ఫన్‌ ఎలిమెంట్స్‌ బాగా ఆకట్టుకన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కడం, నేటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే డైలాగ్స్‌, లవ్‌ స్టోరీ కావడంతో యువతను ప్రేమలు బాగా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్‌తో అదరగొడుతున్న ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. 'ప్రేమలు' మూవీకి సీక్వెల్‌ ఉందని ప్రకటిస్తూ రిలీజ్‌పై ఇప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌ 2025లోనే రిలీజ్‌ అవుతుందని స్పష్టం చేశారు. కాగా 'ప్రేమలు 2' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇస్తూ ఎస్‌ఎస్‌ కార్తీక తన ఎక్స్‌లో పోస్ట్‌లో షేర్‌ చేశాడు. "ప్రేమలు(#premalu) నా జీవితంలో ఒక అందమైన అధ్యాయం. దీన్ని మరిచిపోలేని విధంగా చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు నేను నిజంగా కృతజ్ఞుడిని. బిగ్‌ థ్యాంక్స్‌ టూ భావనా స్టూడియోస్‌. ఇప్పుడు 'ప్రేమలు 2'(#premalu 2) కూడా రాబోతుంది. మరింత ప్రేమ, ఉత్సాహంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ కార్తీకేయ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇక బ్లాక్‌బస్టర్‌ ప్రేమలు మూవీకి సీక్వెల్‌ అనౌన్స్‌ చేయడంతో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 

Also Read: 'లీడర్‌' సీక్వెల్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన శేఖర్‌ కమ్ముల - ఈసారి కూడా రానానే హీరో!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow