RR vs MI: అదిరిందయ్యా శర్మా, రాజస్థాన్‌ లక్ష్యం 180

RR vs MI,   Rajasthan target 180: రాజస్థాన్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌(MI)  తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ముంబై.. తిలక్‌ వర్మ, నెహల్‌ వధేరా పోరాటంతో  195 పరుగుల స్కోరు చేసింది. బ్యాటర్లందరూ పెవిలియన్‌కు వెనుదిరిగుతున్నా తిలక్‌వర్మ.. నెహల్‌ వధేరా పోరాడారు. సందీప్‌ శర్మ అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లు వేసిన సందీప్‌ 18 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.   పడుతూ... లేస్తూ.. రాజస్థాన్‌తో జరుగుతున్న  మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆరంభంలోనే దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. అయిదు బంతుల్లో ఆరు పరుగులు చేసిన రోహిత్‌ శర్మను బౌల్ట్‌ అవుట్‌ చేసి ముంబైకు తొలి షాక్ ఇచ్చాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే ముంబైకు మరో షాక్‌ తగిలింది. మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయ్యాడు. కిషన్‌ను సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు.    ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. సందీప్ శర్మ వేసిన 1.3 ఓవర్‌కు వికెట్ కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తొలుత అంపైర్ నాటౌట్‌ ఇవ్వగా.. రాజస్థాన్‌ డీఆర్‌ఎస్ తీసుకుకోవటంతో అది అవుట్ గా డిక్లేర్ అయ్యింది. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన సూర్యకుమార్‌ యాదవ్ కూడా పెవిలియన్‌ చేరాడు. ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లతో పది పరుగులు చేసిన సూర్యాను సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు. దీంతో 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  మహ్మద్‌ నబీ కూడా 27 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.   IPLలో చాహల్ అరుదైన ఘనత  మహ్మద్ నబీని ఔట్ చేసిన యుజేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. తర్వాత తిలక్‌ వర్మ, వధేరా కీలక ఇన్నింగ్స్‌  ఆడారు. వీరిద్దరూ బ్యాటర్లు నిలకడగా ఆడుతుండటంతో 13 ఓవర్లకు ముంబై స్కోరు 101/4కి చేరింది. చాహల్ వేసిన 15.1 ఓవర్‌కు సిక్సర్ బాది తిలక్ వర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చాహల్ వేసిన 16 ఓవర్‌లో నేహల్ వధేరా వరుసగా రెండు సిక్సర్లు బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు. కానీ ట్రెంట్ బౌల్ట్ వేసిన 17 ఓవర్‌తో తొలి బంతికి సందీప్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. 24 బంతుల్లో 49 అవుట్ అయ్యాడు. తిలక్‌ వర్మ కూడా 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి సందీప్‌ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్‌  తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సందీప్‌ శర్మ అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లు వేసిన సందీప్‌ 18 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.

Apr 22, 2024 - 23:00
 0  0
RR vs MI: అదిరిందయ్యా శర్మా, రాజస్థాన్‌ లక్ష్యం 180
RR vs MI,   Rajasthan target 180: రాజస్థాన్‌(RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌(MI)  తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ముంబై.. తిలక్‌ వర్మ, నెహల్‌ వధేరా పోరాటంతో  195 పరుగుల స్కోరు చేసింది. బ్యాటర్లందరూ పెవిలియన్‌కు వెనుదిరిగుతున్నా తిలక్‌వర్మ.. నెహల్‌ వధేరా పోరాడారు. సందీప్‌ శర్మ అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లు వేసిన సందీప్‌ 18 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.
 
పడుతూ... లేస్తూ..
రాజస్థాన్‌తో జరుగుతున్న  మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆరంభంలోనే దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. అయిదు బంతుల్లో ఆరు పరుగులు చేసిన రోహిత్‌ శర్మను బౌల్ట్‌ అవుట్‌ చేసి ముంబైకు తొలి షాక్ ఇచ్చాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే ముంబైకు మరో షాక్‌ తగిలింది. మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయ్యాడు. కిషన్‌ను సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు. 
 
ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. సందీప్ శర్మ వేసిన 1.3 ఓవర్‌కు వికెట్ కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తొలుత అంపైర్ నాటౌట్‌ ఇవ్వగా.. రాజస్థాన్‌ డీఆర్‌ఎస్ తీసుకుకోవటంతో అది అవుట్ గా డిక్లేర్ అయ్యింది. దీంతో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన సూర్యకుమార్‌ యాదవ్ కూడా పెవిలియన్‌ చేరాడు. ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లతో పది పరుగులు చేసిన సూర్యాను సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు. దీంతో 20 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  మహ్మద్‌ నబీ కూడా 27 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.
 
IPLలో చాహల్ అరుదైన ఘనత 
మహ్మద్ నబీని ఔట్ చేసిన యుజేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. తర్వాత తిలక్‌ వర్మ, వధేరా కీలక ఇన్నింగ్స్‌  ఆడారు. వీరిద్దరూ బ్యాటర్లు నిలకడగా ఆడుతుండటంతో 13 ఓవర్లకు ముంబై స్కోరు 101/4కి చేరింది. చాహల్ వేసిన 15.1 ఓవర్‌కు సిక్సర్ బాది తిలక్ వర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చాహల్ వేసిన 16 ఓవర్‌లో నేహల్ వధేరా వరుసగా రెండు సిక్సర్లు బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు. కానీ ట్రెంట్ బౌల్ట్ వేసిన 17 ఓవర్‌తో తొలి బంతికి సందీప్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. 24 బంతుల్లో 49 అవుట్ అయ్యాడు. తిలక్‌ వర్మ కూడా 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి సందీప్‌ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్‌  తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సందీప్‌ శర్మ అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్లు వేసిన సందీప్‌ 18 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow