Trinayani September 19th Episode: బిడ్డ పుట్టుకవెనుక గుట్టువిప్పిన పెద్దబొట్టమ్మ - పాముని గదిలో పెట్టి తాళం వేసిన సుమన!

Trinayani September 19th Written Update: అసలు నువ్వెందుకు బిడ్డని తీసుకెళ్లావు? నా బిడ్డని తీసుకెళ్లాల్సిన హక్కు నీకెక్కడిది అని సుమన అంటుంది. పెద్ద బొట్టమ్మ: నేను తీసుకొని వెళ్ళింది నాగయ్య కోసం, అది మా బిడ్డ కూడా. మా నాగులకు జీవన కాలం ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. కానీ విధి వలన మేము మా సంతనాన్ని కోల్పోయాం. అప్పుడు గాయత్రి అమ్మ, విశాలాక్షి అమ్మ వారి దయవల్ల ఎప్పటికైనా నాకు సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చింది. ఆ సంతానమే నీ కడుపులో పుట్టింది సుమను. సుమన: నా కడుపులో పెరిగే బిడ్డ నీది ఎలాగవుతుంది అని సుమన వాదిస్తుంది పెద్ద బొట్టమ్మ: నీకు ఈ బిడ్డ ఎలాగ కడుపులోకి వచ్చిందో చెప్పు? వల్లభ: ఇప్పుడు అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడుతుందేమో కదా పెద్ద బొట్టమ్మ: సుమన కృష్ణ రాయి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకున్న సమయంలో ఆ రాయిని వెళ్లి నాగయ్య చుట్టుకున్నాడు. అప్పుడే మా బిడ్డ సుమన కడుపులోకి వెళ్ళింది. విక్రాంత్: చెప్పాను కదా నేను తన ఆ పాపకి అసలు తండ్రిని కాదు అని. విశాల్: అలా అనకూడదు విక్రాంత్ బాధలోనైనా, కష్టంలోనైనా ఎప్పటికైనా భార్యకు తోడుగా భర్త ఉండాలి. తిలోత్తమ: మరి ఆ బిడ్డ పాముగా ఎలా మారింది? పెద్ద బొట్టమ్మ: ఈ బిడ్డ ఉదయం అంతా మనిషి రూపంలోని, రాత్రి అంతా పాము రూపంలోనే ఉంటుంది. రేపు ఉదయానికి తిరిగి మనిషి రూపంలోకి వస్తుంది. కావాలంటే మీరే చూడండి. అందుకే నేను మా బిడ్డను తీసుకుని వెళ్లడానికి ఎవరి అనుమతి తీసుకోలేదు. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు పెద్ద బొట్టమ్మ, నాగయ్యలు. Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర! ఆ తర్వాత సీన్ లో కుటుంబ సభ్యులందరూ ఆ చిన్న పాము కోసం వెతుకుతూ ఉంటారు. దురంధర: ఎంత వెతికినా కనిపించదేంటి ఆ చిన్ని పాము? నయని: ఒకవేళ వెళ్ళిపోయి ఉంటుందా? సుమన: లేదు. వెళ్ళే వీళ్ళ లేదు తల్లిని వీడి ఎక్కడికి వెళ్తుంది? నయని: అంటే ఆ బిడ్డకు నువ్వే తల్లివి అని ఒప్పుకుంటున్నావా? సుమన: నేను పూర్తిగా ఒప్పుకోవడం లేదు. ఆ పాముని నా గదిలో తాళం వేస్తాను రేపు ఉదయానికి మనిషిలా మారితే అప్పుడు నమ్ముతాను. దురంధర: ఒకసారి నువ్వే నీ నోటితో ఆ పామును పిలువు తల్లి మాటకి వస్తుంది కదా. అని అనగా సుమన పాప అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్న పాము సుమన దగ్గరికి వస్తుంది. నయని: పాము సుమన మాట వింటుంది. అని అన్న తర్వాత సుమన పాముని లోపలికి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు పాము లోపల తన ఊయల దగ్గరికి వెళ్తుంది. సుమన గది బయట తాళం వేసేస్తుంది. సుమన: రేపు ఉదయానికి పాము అమ్మాయిగా మారితే సరే సరే, లేకపోతే ఆ పాము ప్రాణాలు తీస్తాను. అని చెప్పి ఎందరు ఆపుతున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. Also Read: సుమనని రెచ్చగొట్టిన తిలోత్తమ.. పాప జాడ చెప్పిన స్వామీజీ?? మరోవైపు వల్లభ తన గదిలో సామ్రాణిని వెలిగిస్తూ గదంతా పొగతో నింపేస్తాడు. తిలోత్తమ: ఏం చేస్తున్నావురా? వల్లభ: ఏం చేయమంటావ్ మమ్మీ, మన ఇంటికి వచ్చింది ఒకటా రెండా మొత్తం మూడు పాములు. ఇల్లు అనుకుంటున్నారా పాముల పుట్ట అనుకుంటున్నారా? అందుకే వెంటనే ఒక గురువు దగ్గరికి వెళ్లి సాంబ్రాణి తెచ్చుకున్నాను. త్రిలోత్తమా: ఇది జల్లితే ఇప్పుడు పాములు రాకుండా ఉంటాయా? అయినా నువ్వు ఎందుకురా భయపడుతున్నావు. నా చావు గాయత్రి అక్క చేతిలోనే అని నయని ఆనాడే అన్నది కదా. అలాంటప్పుడు మూడు కాదు వెయ్య పాములు వచ్చినా సరే బుస్సు కొట్టి వెళ్ళిపోవాల్సిందే నువ్వేం భయపడొద్దు వల్లభ: అలాగే అనుకో మమ్మీ ఏదో ఒక రోజు అనుకోనిది ఏమైనా జరిగితే ఏం చేస్తావు? అయినా మనం నయని పిల్లల జోలికైనా వెళ్దాం కాని ఆ సుమన పాప జోలికి వద్దు మమ్మీ. అది పాము అని భయపడుతూ చెప్తాడు తిలోత్తమ: వెళ్లాలిరా సుమన పాప జోలికి కూడా వెళ్లాలి. కానీ శత్రుత్వంతో కాదు స్నేహపూరితంగా. అని అంటుంది. ఆ తర్వాత సీన్లో వల్లభ హాల్లో కంగారుగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నయని, హాసిని,స్వామీజీ వస్తారు. హాసిని: వల్లభ చూడు చెల్లి ఎంత కంగారుగా ఉన్నాడో? నయని: తను ఆలోచిస్తుంది సుమన కడుపులో పాము ఎలా పుట్టింది అని హాసిని: సుమన కడుపులో పాము ఉంది అని మనం అది కడుపులో ఉన్నప్పుడే తెలుసుకున్నాం కదా? స్వామీజీ: అప్పుడు ఆశ్చర్యపోయిన వల్లభుడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. నయని: అంటే మా చెల్లిని అనుమానిస్తున్నావా? వల్లభ: అలా కాదు వదిన కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది. స్వామీజీ: ఇతిహాసాలలో చాలాసార్లు ఇలాగ జరిగాయి. భౌతికంగా కలవకపోయినా సరే అంశలతో పిల్లలు పుట్టిన సందర్భాలు రామాయణం, మహాభారతాల్లో చాలానే ఉన్నాయి కనుక వీటిని అనుమానించకుండా నమ్మడమే మంచిది. వల్లభ: మీరు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తుంది. కానీ సుమనను ఎలా నమ్మించాలి? నయని: సుమనకి కావాల్సింది మీరు కట్టిన పుస్తులు కాదు తనకి రావాల్సిన ఆస్తి హాసిని: రేపు పాము మనుషులా మారిన తర్వాత తనకు ఆస్తి వస్తుందన్న సంతోషమే తన కళ్ళల్లో కనిపిస్తుందేమో నయని: రేపు పాము అమ్మాయిగా మారడం అవుతుంది కదా గురువుగారు? స్వామీజీ: కచ్చితంగా. Also Read: Krishna Mukunda Murari September 19th: కృష్ణకి మొత్తం తెలిసిపోయింది - మురారీకి భార్యగా సేవలు చేస్తున్న ముకుంద! Join Us On Telegram: https://t.me/abpdesamofficial

Sep 19, 2023 - 12:00
 0  0
Trinayani September 19th Episode:  బిడ్డ పుట్టుకవెనుక గుట్టువిప్పిన పెద్దబొట్టమ్మ - పాముని గదిలో పెట్టి తాళం వేసిన సుమన!

Trinayani September 19th Written Update: అసలు నువ్వెందుకు బిడ్డని తీసుకెళ్లావు? నా బిడ్డని తీసుకెళ్లాల్సిన హక్కు నీకెక్కడిది అని సుమన అంటుంది.

పెద్ద బొట్టమ్మ: నేను తీసుకొని వెళ్ళింది నాగయ్య కోసం, అది మా బిడ్డ కూడా. మా నాగులకు జీవన కాలం ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. కానీ విధి వలన మేము మా సంతనాన్ని కోల్పోయాం. అప్పుడు గాయత్రి అమ్మ, విశాలాక్షి అమ్మ వారి దయవల్ల ఎప్పటికైనా నాకు సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చింది. ఆ సంతానమే నీ కడుపులో పుట్టింది సుమను.

సుమన: నా కడుపులో పెరిగే బిడ్డ నీది ఎలాగవుతుంది అని సుమన వాదిస్తుంది

పెద్ద బొట్టమ్మ: నీకు ఈ బిడ్డ ఎలాగ కడుపులోకి వచ్చిందో చెప్పు?

వల్లభ: ఇప్పుడు అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడుతుందేమో కదా

పెద్ద బొట్టమ్మ: సుమన కృష్ణ రాయి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకున్న సమయంలో ఆ రాయిని వెళ్లి నాగయ్య చుట్టుకున్నాడు. అప్పుడే మా బిడ్డ సుమన కడుపులోకి వెళ్ళింది.

విక్రాంత్: చెప్పాను కదా నేను తన ఆ పాపకి అసలు తండ్రిని కాదు అని.

విశాల్: అలా అనకూడదు విక్రాంత్ బాధలోనైనా, కష్టంలోనైనా ఎప్పటికైనా భార్యకు తోడుగా భర్త ఉండాలి.

తిలోత్తమ: మరి ఆ బిడ్డ పాముగా ఎలా మారింది?

పెద్ద బొట్టమ్మ: ఈ బిడ్డ ఉదయం అంతా మనిషి రూపంలోని, రాత్రి అంతా పాము రూపంలోనే ఉంటుంది. రేపు ఉదయానికి తిరిగి మనిషి రూపంలోకి వస్తుంది. కావాలంటే మీరే చూడండి. అందుకే నేను మా బిడ్డను తీసుకుని వెళ్లడానికి ఎవరి అనుమతి తీసుకోలేదు. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు పెద్ద బొట్టమ్మ, నాగయ్యలు.

Also Read: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!

ఆ తర్వాత సీన్ లో కుటుంబ సభ్యులందరూ ఆ చిన్న పాము కోసం వెతుకుతూ ఉంటారు.

దురంధర: ఎంత వెతికినా కనిపించదేంటి ఆ చిన్ని పాము?

నయని: ఒకవేళ వెళ్ళిపోయి ఉంటుందా?

సుమన: లేదు. వెళ్ళే వీళ్ళ లేదు తల్లిని వీడి ఎక్కడికి వెళ్తుంది?

నయని: అంటే ఆ బిడ్డకు నువ్వే తల్లివి అని ఒప్పుకుంటున్నావా?

సుమన: నేను పూర్తిగా ఒప్పుకోవడం లేదు. ఆ పాముని నా గదిలో తాళం వేస్తాను రేపు ఉదయానికి మనిషిలా మారితే అప్పుడు నమ్ముతాను.

దురంధర: ఒకసారి నువ్వే నీ నోటితో ఆ పామును పిలువు తల్లి మాటకి వస్తుంది కదా. అని అనగా సుమన పాప అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్న పాము సుమన దగ్గరికి వస్తుంది.

నయని: పాము సుమన మాట వింటుంది. అని అన్న తర్వాత సుమన పాముని లోపలికి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు పాము లోపల తన ఊయల దగ్గరికి వెళ్తుంది. సుమన గది బయట తాళం వేసేస్తుంది.

సుమన: రేపు ఉదయానికి పాము అమ్మాయిగా మారితే సరే సరే, లేకపోతే ఆ పాము ప్రాణాలు తీస్తాను. అని చెప్పి ఎందరు ఆపుతున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Also Read: సుమనని రెచ్చగొట్టిన తిలోత్తమ.. పాప జాడ చెప్పిన స్వామీజీ??

మరోవైపు వల్లభ తన గదిలో సామ్రాణిని వెలిగిస్తూ గదంతా పొగతో నింపేస్తాడు.

తిలోత్తమ: ఏం చేస్తున్నావురా?

వల్లభ: ఏం చేయమంటావ్ మమ్మీ, మన ఇంటికి వచ్చింది ఒకటా రెండా మొత్తం మూడు పాములు. ఇల్లు అనుకుంటున్నారా పాముల పుట్ట అనుకుంటున్నారా? అందుకే వెంటనే ఒక గురువు దగ్గరికి వెళ్లి సాంబ్రాణి తెచ్చుకున్నాను.

త్రిలోత్తమా: ఇది జల్లితే ఇప్పుడు పాములు రాకుండా ఉంటాయా? అయినా నువ్వు ఎందుకురా భయపడుతున్నావు. నా చావు గాయత్రి అక్క చేతిలోనే అని నయని ఆనాడే అన్నది కదా. అలాంటప్పుడు మూడు కాదు వెయ్య పాములు వచ్చినా సరే బుస్సు కొట్టి వెళ్ళిపోవాల్సిందే నువ్వేం భయపడొద్దు

వల్లభ: అలాగే అనుకో మమ్మీ ఏదో ఒక రోజు అనుకోనిది ఏమైనా జరిగితే ఏం చేస్తావు? అయినా మనం నయని పిల్లల జోలికైనా వెళ్దాం కాని ఆ సుమన పాప జోలికి వద్దు మమ్మీ. అది పాము అని భయపడుతూ చెప్తాడు

తిలోత్తమ: వెళ్లాలిరా సుమన పాప జోలికి కూడా వెళ్లాలి. కానీ శత్రుత్వంతో కాదు స్నేహపూరితంగా. అని అంటుంది. ఆ తర్వాత సీన్లో వల్లభ హాల్లో కంగారుగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నయని, హాసిని,స్వామీజీ వస్తారు.

హాసిని: వల్లభ చూడు చెల్లి ఎంత కంగారుగా ఉన్నాడో?

నయని: తను ఆలోచిస్తుంది సుమన కడుపులో పాము ఎలా పుట్టింది అని

హాసిని: సుమన కడుపులో పాము ఉంది అని మనం అది కడుపులో ఉన్నప్పుడే తెలుసుకున్నాం కదా?

స్వామీజీ: అప్పుడు ఆశ్చర్యపోయిన వల్లభుడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు.

నయని: అంటే మా చెల్లిని అనుమానిస్తున్నావా?

వల్లభ: అలా కాదు వదిన కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది.

స్వామీజీ: ఇతిహాసాలలో చాలాసార్లు ఇలాగ జరిగాయి. భౌతికంగా కలవకపోయినా సరే అంశలతో పిల్లలు పుట్టిన సందర్భాలు రామాయణం, మహాభారతాల్లో చాలానే ఉన్నాయి కనుక వీటిని అనుమానించకుండా నమ్మడమే మంచిది.

వల్లభ: మీరు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తుంది. కానీ సుమనను ఎలా నమ్మించాలి?

నయని: సుమనకి కావాల్సింది మీరు కట్టిన పుస్తులు కాదు తనకి రావాల్సిన ఆస్తి

హాసిని: రేపు పాము మనుషులా మారిన తర్వాత తనకు ఆస్తి వస్తుందన్న సంతోషమే తన కళ్ళల్లో కనిపిస్తుందేమో

నయని: రేపు పాము అమ్మాయిగా మారడం అవుతుంది కదా గురువుగారు?

స్వామీజీ: కచ్చితంగా.

Also Read: Krishna Mukunda Murari September 19th: కృష్ణకి మొత్తం తెలిసిపోయింది - మురారీకి భార్యగా సేవలు చేస్తున్న ముకుంద!

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow