Trinayani Serial Today April 23rd: 'త్రినయని' సీరియల్: గాయత్రీ జాడ తెలియకుండా అడ్డుకున్న హాసిని, పావనామూర్తి.. సుమన సూటి ప్రశ్నలకు నయని షాక్!

Trinayani Today Episode నయని తులసి మొక్కతో ఏర్పాటు చేసిన అమ్మవారికి పూజ చేస్తుంది. నయని పూజకు ఇంట్లో గాలి వీస్తుంది. అందరూ ఆశ్చర్యపోయి ఏం జరుగుతుందా అని దిక్కులు చూస్తారు. నయని పూజ ముగించి అందరికి హారతి ఇస్తుంది. సుమన: కర్టెన్స్ ఊగే అంత గాలి వీస్తున్నా ఇక్కడ దీపాలు అరిపోవడం లేదే.. విక్రాంత్: అమ్మవారి దయ ఉంటే అన్న ఉన్నట్లే..విశాల్: అమ్మవారే కాదు అన్నావ్.. లేదు అన్నావ్.. ఎక్కడ ఉన్నదో చూపించమన్నావ్. చెట్టులో పుట్టులో.. రాయిలో ప్రతీ చోట దేవుడిని చూసే మనం కళ్లెదుటే ఉన్న తులసి మొక్కలో దేవుడిని గుర్తించలేకపోతే ఎలా సుమన.సుమన: సర్లెండి బావగారు. ఆ అమ్మవారిని నేను గుర్తించకపోయినా మీ అమ్మ వస్తే గుర్తు పడతాను కదా.డమ్మక్క: వస్తుంది చూడండి..తిలోత్తమ: ఏయ్ డమ్మక్క ఎక్కడొస్తుంది గాయత్రీ అక్క.డమ్మక్క: నా వైపు ఏం చూస్తారు అటు చూడండి.. మరోవైపు విశాలాక్షి శివుడి ధ్యానంలో ఉంటుంది. ఓం నమః శివాయ అని విశాలాక్షి అనగానే తులసి కోట నుంచి వెతురురు వస్తుంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. విశాల్ అయితే గాయత్రీ పాపే అమ్మ అనేలా ఏదో ఒక సూచన వస్తుంది అనుకున్నా అని అనుకొని హాసిని, పావనాలను సైగ చేస్తాడు. దీంతో వాళ్లిద్దరూ  తమ వెంట తెచ్చిన అద్దాలను ఆ కాంతికి అడ్డుగా పెడతారు. విశాల్ గాయత్రీ పాపను వారి వెనకకు తీసుకెళ్తాడు. అందరూ సుమన ఓడిపోయావని.. నయని గెలుపు చూడమని అంటారు.  తులసి కోట నుంచి కాంతి గాయత్రీ పాప వైపు వస్తుంది. హాసిని అద్దం అడ్డుగా పెట్టుకోవడంతో ఆ అద్దం నుంచి వెలుగు వెళ్లి గాయత్రీ పాప మీద పడుతుంది. అందరూ గమనించేలోనే రెండో అద్దం పట్టుకున్న పావనా మూర్తి పాపకు అడ్డుగా అద్దం పెడతాడు. దీంతో కాంతి వెనక్కి వెళ్లి శ్రీ చక్రం ఏర్పడుతుంది. అందరూ ఆ వెలుతురులో గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని గుర్తించలేకపోతారు.  తిలోత్తమ: (అద్దాలు పట్టుకున్న హాసిని, పావనాలతో) ఏయ్ ఎందుకు అలా చేస్తున్నారు. నయని: అమ్మవారికి దిష్టి తగలకుండా అత్తయ్య.తిలోత్తమ: దిష్టి సంగతి సరే ఆ కాంతి సంగతేంటి. విక్రాంత్: అవును మామయ్య ఎటు వైపు వెళ్తుందో తెలియకముందే డైవర్ట్ చేశారు అనిపించింది. సుమన: అటు ఒకసారి ఇటొకసారి ఇలా మూడు నాలుగు వైపుల కాంతి పడింది. పెద్దత్తయ్య ఎటు వైపు ఉన్నట్లు. నయని: అమ్మవారే దారి చూపిస్తారు సుమన. ఎక్కడున్నా గాయత్రీ అమ్మగారిని వెతికి తీసుకురావొచ్చు.డమ్మక్క: లేదు లేదు అన్నవారికి కనువిప్పు కలగాలి.నయని: అమ్మవారు లేదు అన్న మా చెల్లే గాయత్రీ పాప వైపు కాంతి వెళ్తుందని చెప్తుంది. ఇంతకంటే ఏం కావాలి. తిలోత్తమ: ఏయ్ హాసిని అద్దాలు కిందకి దించండి..వల్లభ: పెద్దకాంతి వచ్చింది కానీ పెద్దమ్మ రాలేదు.విక్రాంత్: నీకు ఇంకా లైట్ వెలగలేదు బ్రో. పెద్దమ్మ ఉండే దారి అయితే కనిపించింది.  మరోవైపు తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. శిరస్సు లేని అమ్మవారి పూజ గురించి చెప్తారు. కాంతి వచ్చినప్పుడు హాసిని, పావనా అడ్డుగా అద్దం పెట్టారని చెప్తారు. దీంతో అఖండ స్వామి కాంతి ఎవరి వైపు పయనించిందని అడిగితే గాయత్రీ పాప వైపు అని చెప్తారు. దీంతో అఖండ స్వామి గాయత్రీ పాప ద్వారే గాయత్రీ దేవి జాడ తెలుసుకోవాలని అంటారు. గాయత్రీ దేవి జాడ తెలుసుకునేందుకు ఓ పొడిని ఇస్తారు అఖండ స్వామి. ఆ పొడిని గాయత్రీ దేవి పటానికి.. గాయత్రీ పాప ముఖానికి ఈ పొడి రాయమని.. తర్వాత బూడిద పూసిన అద్దంలో చూస్తే గాయత్రీ దేవిని చూడగలుగుతారని అంటారు. మరోవైపు సుమన విశాల్ దగ్గరకు వస్తుంది. విశాల్ ఏం కావాలని సుమన అడిగితే.. క్లారిటీ కావాలని అంటుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి సుమనను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. ఇంతలో నయని కూడా అక్కడికి వస్తుంది. సుమన: నీతో కూడా చెప్పని రహస్యాలు బావగారి దగ్గర చాలా ఉన్నాయి అక్క. నా డౌట్ ఏంటి అంటే మా అక్క తులసమ్మ పూజ చేసింది. అందులో నుంచి కాంతి వస్తుందని విశాల్ బావగారు ముందే ఎలా ఊహించారు. నయని: అంటే ఏంటే నీ ఉద్దేశం అమ్మవారి శక్తిని అనుమానిస్తున్నావా..సుమన: లేదు అక్క హాసిని అక్కని, పావనామూర్తి బాబాయ్‌ని అద్దం తీసుకొచ్చి ఆ కాంతి ప్రతి బింబించేలా చేశారా లేకపోతే దాని దారి మళ్లించారా..నయని: బాబుగారు..విశాల్: నయని ఇందులో ఏం ఉందో నాకు అర్థం కాలేదు.నయని: అద్దం అడ్డంగా పెట్టకపోతే ఆ కాంతి ఎటు వైపు వెళ్లేది.విశాల్: కావాలని చేసింది కాదు కదా ఇంతలోటుగా ఆలోచించక్కర్లేదు నయని.సుమన: అద్దం అడ్డుపెట్టకపోతే ఆ కాంతి కచ్చితంగా గాయత్రీ అత్తయ్య ఎక్కడున్నారో అక్కడికే వెళ్లేది. బావగారే అడ్డుపడేలా చేశారు. లేదంటే పెద్దత్తయ్య జాడ తెలిసేది.విక్రాంత్: ఏయ్ అప్పుడు కన్నతల్లి.. ఇప్పుడు కన్న కూతురు తన గురించి తెలుసుకోవాలి అని ఎందుకు ఉండదు.సుమన: తెలుసుకోరాదా.. తెలియరాదా.. రెండింటికి తేడా ఉంది..  ఇంతలో నయనికి తన దివ్యదృష్టి వల్ల పోలీస్‌ నోట్లో నుంచి నురగ వచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో పోలీసన్నకు ఏం జరగబోతుందని నయని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  Also Read: రెజీనా మంచి మనసు... బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్

Apr 23, 2024 - 08:00
 0  1
Trinayani Serial Today April 23rd: 'త్రినయని' సీరియల్: గాయత్రీ జాడ తెలియకుండా అడ్డుకున్న హాసిని, పావనామూర్తి.. సుమన సూటి ప్రశ్నలకు నయని షాక్!

Trinayani Today Episode నయని తులసి మొక్కతో ఏర్పాటు చేసిన అమ్మవారికి పూజ చేస్తుంది. నయని పూజకు ఇంట్లో గాలి వీస్తుంది. అందరూ ఆశ్చర్యపోయి ఏం జరుగుతుందా అని దిక్కులు చూస్తారు. నయని పూజ ముగించి అందరికి హారతి ఇస్తుంది.

సుమన: కర్టెన్స్ ఊగే అంత గాలి వీస్తున్నా ఇక్కడ దీపాలు అరిపోవడం లేదే.. 
విక్రాంత్: అమ్మవారి దయ ఉంటే అన్న ఉన్నట్లే..
విశాల్: అమ్మవారే కాదు అన్నావ్.. లేదు అన్నావ్.. ఎక్కడ ఉన్నదో చూపించమన్నావ్. చెట్టులో పుట్టులో.. రాయిలో ప్రతీ చోట దేవుడిని చూసే మనం కళ్లెదుటే ఉన్న తులసి మొక్కలో దేవుడిని గుర్తించలేకపోతే ఎలా సుమన.
సుమన: సర్లెండి బావగారు. ఆ అమ్మవారిని నేను గుర్తించకపోయినా మీ అమ్మ వస్తే గుర్తు పడతాను కదా.
డమ్మక్క: వస్తుంది చూడండి..
తిలోత్తమ: ఏయ్ డమ్మక్క ఎక్కడొస్తుంది గాయత్రీ అక్క.
డమ్మక్క: నా వైపు ఏం చూస్తారు అటు చూడండి..

మరోవైపు విశాలాక్షి శివుడి ధ్యానంలో ఉంటుంది. ఓం నమః శివాయ అని విశాలాక్షి అనగానే తులసి కోట నుంచి వెతురురు వస్తుంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. విశాల్ అయితే గాయత్రీ పాపే అమ్మ అనేలా ఏదో ఒక సూచన వస్తుంది అనుకున్నా అని అనుకొని హాసిని, పావనాలను సైగ చేస్తాడు. దీంతో వాళ్లిద్దరూ  తమ వెంట తెచ్చిన అద్దాలను ఆ కాంతికి అడ్డుగా పెడతారు. విశాల్ గాయత్రీ పాపను వారి వెనకకు తీసుకెళ్తాడు. అందరూ సుమన ఓడిపోయావని.. నయని గెలుపు చూడమని అంటారు. 

తులసి కోట నుంచి కాంతి గాయత్రీ పాప వైపు వస్తుంది. హాసిని అద్దం అడ్డుగా పెట్టుకోవడంతో ఆ అద్దం నుంచి వెలుగు వెళ్లి గాయత్రీ పాప మీద పడుతుంది. అందరూ గమనించేలోనే రెండో అద్దం పట్టుకున్న పావనా మూర్తి పాపకు అడ్డుగా అద్దం పెడతాడు. దీంతో కాంతి వెనక్కి వెళ్లి శ్రీ చక్రం ఏర్పడుతుంది. అందరూ ఆ వెలుతురులో గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని గుర్తించలేకపోతారు. 

తిలోత్తమ: (అద్దాలు పట్టుకున్న హాసిని, పావనాలతో) ఏయ్ ఎందుకు అలా చేస్తున్నారు. 
నయని: అమ్మవారికి దిష్టి తగలకుండా అత్తయ్య.
తిలోత్తమ: దిష్టి సంగతి సరే ఆ కాంతి సంగతేంటి. 
విక్రాంత్: అవును మామయ్య ఎటు వైపు వెళ్తుందో తెలియకముందే డైవర్ట్ చేశారు అనిపించింది. 
సుమన: అటు ఒకసారి ఇటొకసారి ఇలా మూడు నాలుగు వైపుల కాంతి పడింది. పెద్దత్తయ్య ఎటు వైపు ఉన్నట్లు. 
నయని: అమ్మవారే దారి చూపిస్తారు సుమన. ఎక్కడున్నా గాయత్రీ అమ్మగారిని వెతికి తీసుకురావొచ్చు.
డమ్మక్క: లేదు లేదు అన్నవారికి కనువిప్పు కలగాలి.
నయని: అమ్మవారు లేదు అన్న మా చెల్లే గాయత్రీ పాప వైపు కాంతి వెళ్తుందని చెప్తుంది. ఇంతకంటే ఏం కావాలి. 
తిలోత్తమ: ఏయ్ హాసిని అద్దాలు కిందకి దించండి..
వల్లభ: పెద్దకాంతి వచ్చింది కానీ పెద్దమ్మ రాలేదు.
విక్రాంత్: నీకు ఇంకా లైట్ వెలగలేదు బ్రో. పెద్దమ్మ ఉండే దారి అయితే కనిపించింది. 

మరోవైపు తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. శిరస్సు లేని అమ్మవారి పూజ గురించి చెప్తారు. కాంతి వచ్చినప్పుడు హాసిని, పావనా అడ్డుగా అద్దం పెట్టారని చెప్తారు. దీంతో అఖండ స్వామి కాంతి ఎవరి వైపు పయనించిందని అడిగితే గాయత్రీ పాప వైపు అని చెప్తారు. దీంతో అఖండ స్వామి గాయత్రీ పాప ద్వారే గాయత్రీ దేవి జాడ తెలుసుకోవాలని అంటారు.

గాయత్రీ దేవి జాడ తెలుసుకునేందుకు ఓ పొడిని ఇస్తారు అఖండ స్వామి. ఆ పొడిని గాయత్రీ దేవి పటానికి.. గాయత్రీ పాప ముఖానికి ఈ పొడి రాయమని.. తర్వాత బూడిద పూసిన అద్దంలో చూస్తే గాయత్రీ దేవిని చూడగలుగుతారని అంటారు.

మరోవైపు సుమన విశాల్ దగ్గరకు వస్తుంది. విశాల్ ఏం కావాలని సుమన అడిగితే.. క్లారిటీ కావాలని అంటుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి సుమనను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. ఇంతలో నయని కూడా అక్కడికి వస్తుంది.

సుమన: నీతో కూడా చెప్పని రహస్యాలు బావగారి దగ్గర చాలా ఉన్నాయి అక్క. నా డౌట్ ఏంటి అంటే మా అక్క తులసమ్మ పూజ చేసింది. అందులో నుంచి కాంతి వస్తుందని విశాల్ బావగారు ముందే ఎలా ఊహించారు. 
నయని: అంటే ఏంటే నీ ఉద్దేశం అమ్మవారి శక్తిని అనుమానిస్తున్నావా..
సుమన: లేదు అక్క హాసిని అక్కని, పావనామూర్తి బాబాయ్‌ని అద్దం తీసుకొచ్చి ఆ కాంతి ప్రతి బింబించేలా చేశారా లేకపోతే దాని దారి మళ్లించారా..
నయని: బాబుగారు..
విశాల్: నయని ఇందులో ఏం ఉందో నాకు అర్థం కాలేదు.
నయని: అద్దం అడ్డంగా పెట్టకపోతే ఆ కాంతి ఎటు వైపు వెళ్లేది.
విశాల్: కావాలని చేసింది కాదు కదా ఇంతలోటుగా ఆలోచించక్కర్లేదు నయని.
సుమన: అద్దం అడ్డుపెట్టకపోతే ఆ కాంతి కచ్చితంగా గాయత్రీ అత్తయ్య ఎక్కడున్నారో అక్కడికే వెళ్లేది. బావగారే అడ్డుపడేలా చేశారు. లేదంటే పెద్దత్తయ్య జాడ తెలిసేది.
విక్రాంత్: ఏయ్ అప్పుడు కన్నతల్లి.. ఇప్పుడు కన్న కూతురు తన గురించి తెలుసుకోవాలి అని ఎందుకు ఉండదు.
సుమన: తెలుసుకోరాదా.. తెలియరాదా.. రెండింటికి తేడా ఉంది.. 

ఇంతలో నయనికి తన దివ్యదృష్టి వల్ల పోలీస్‌ నోట్లో నుంచి నురగ వచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో పోలీసన్నకు ఏం జరగబోతుందని నయని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రెజీనా మంచి మనసు... బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow