TSPSC: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ వాయిదాకు 'నో' ఛాన్స్‌, పరీక్ష నిర్వహణకు సిద్ధమే అంటున్న అధికారులు

TSPSC Group1 Posts: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కూడా వచ్చే నెలాఖరులోగా విడుదల చేయాలని కమిషన్‌ అధికారులు భావిస్తున్నారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన, తర్జుమా చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల గుర్తింపు వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలన్నీ దిగ్విజయంగా జరగుతున్న నేపథ్యంలో.. పరీక్ష వాయిదా వేసే ఉద్దేశం టీఎస్‌పీఎస్సీకి లేదని స్పష్టమవుతోంది. అభ్యర్థులు ఇప్పటికే గ్రూప్‌-1 పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో వేలాది మంది అభ్యర్థులకు శిక్షణ కొనసాగుతోంది. వీటితోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్టడీ సర్కిళ్లలోనూ శిక్షణ కొనసాగుతుంది. తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. గ్రూప్-1 పోస్టుల వివరాలు.. క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య 1. డిప్యూటీ కలెక్టర్ 45 2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115 3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48 4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04 5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07 6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06 7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05 8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08 9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30 10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41 11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 03 12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్) 05 13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02 14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05 15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20 16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38 17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41 18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140   మొత్తం ఖాళీలు 563   పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు.  ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్. మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ. Notification Website మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Apr 22, 2024 - 01:00
 0  7
TSPSC:  'గ్రూప్-1' ప్రిలిమ్స్ వాయిదాకు 'నో' ఛాన్స్‌, పరీక్ష నిర్వహణకు సిద్ధమే అంటున్న అధికారులు

TSPSC Group1 Posts: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కూడా వచ్చే నెలాఖరులోగా విడుదల చేయాలని కమిషన్‌ అధికారులు భావిస్తున్నారు. 

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన, తర్జుమా చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల గుర్తింపు వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలన్నీ దిగ్విజయంగా జరగుతున్న నేపథ్యంలో.. పరీక్ష వాయిదా వేసే ఉద్దేశం టీఎస్‌పీఎస్సీకి లేదని స్పష్టమవుతోంది. అభ్యర్థులు ఇప్పటికే గ్రూప్‌-1 పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో వేలాది మంది అభ్యర్థులకు శిక్షణ కొనసాగుతోంది. వీటితోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్టడీ సర్కిళ్లలోనూ శిక్షణ కొనసాగుతుంది.

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది.

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

 

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

TSPSC Group 1 Notification: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల - పోస్టులు, అర్హతలు, పరీక్ష వివరాలు ఇలా

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.

మెయిన్ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow