Under 19 world cup: యువ భారత్‌ ఓటమికి కారణాలివే?

U19 World Cup 2024 Final: అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup 2024)ను ఆరోసారి ఒడిసిపట్టాలన్న యువ భారత్‌ ఆటగాళ్ల కల చెదిరింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా....  అండర్‌ 19 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఓడించి కప్పును ఒడిసిపట్టింది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా... కంగారుల సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమికి అనేక కారణాలున్నాయని మాజీలు విశ్లేషిస్తున్నారు.   కారణాలివే..! ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్‌ కెప్టెన్‌ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో కేవలం ఎనిమిది పరుగులకే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ రెండుసార్లు ఔట్ నుంచి తప్పించుకున్నా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు.    భారత్ బౌలర్ల ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ తరహాలో లేదు. అయితే, 16పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ దక్కినా.. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడును ఆశించిన స్థాయిలో భారత్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా పూర్తి ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 77 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే, ఆరంభంలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం జట్టుపై ప్రభావం చూపింది. భారత్ జట్టు మిడిల్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. మిడిలార్డర్‌ బ్యాటర్లు ఎవరు కూడా కనీసం 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు.    తప్పని నిరాశ ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ప్రపంచ‌ క‌ప్( U19 World Cup Final 2024)లోనూ కుర్రాళ్లకు నిరాశే ఎదురైంది. నవంబర్‌ 19, 2023న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆదివారం ఫైనల్లో కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.. కానీ ఆసీస్ విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది. 254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా కుర్రాళ్లు నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. సీనియర్లు ఎలాగైతే తుది మెట్టుపై కంగారు పడ్డారో, సరిగ్గా అదే తీరుగా భారత కుర్రాళ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్లలో బార్డ్‌మాన్, మెక్ మిలన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, విడ్లర్ 2 వికెట్లు తీశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకూ భారత్‌ 9సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్ ఆడగా.. 2000, 2008, 2012, 2018, 2022లో మొత్తం 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకు ముందు 2006, 2016, 2020లలో ఫైనల్లో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. చెరో రెండు ఫైనల్స్ నెగ్గి మెగా ట్రోఫీని అందుకున్నాయి.

Feb 12, 2024 - 15:00
 0  0
Under 19 world cup: యువ భారత్‌ ఓటమికి కారణాలివే?
U19 World Cup 2024 Final: అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup 2024)ను ఆరోసారి ఒడిసిపట్టాలన్న యువ భారత్‌ ఆటగాళ్ల కల చెదిరింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా....  అండర్‌ 19 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఓడించి కప్పును ఒడిసిపట్టింది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా... కంగారుల సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమికి అనేక కారణాలున్నాయని మాజీలు విశ్లేషిస్తున్నారు.
 
కారణాలివే..!
ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్‌ కెప్టెన్‌ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో కేవలం ఎనిమిది పరుగులకే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ రెండుసార్లు ఔట్ నుంచి తప్పించుకున్నా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు. 
 
భారత్ బౌలర్ల ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ తరహాలో లేదు. అయితే, 16పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ దక్కినా.. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడును ఆశించిన స్థాయిలో భారత్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా పూర్తి ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 77 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే, ఆరంభంలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం జట్టుపై ప్రభావం చూపింది. భారత్ జట్టు మిడిల్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. మిడిలార్డర్‌ బ్యాటర్లు ఎవరు కూడా కనీసం 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. 
 
తప్పని నిరాశ
ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ప్రపంచ‌ క‌ప్( U19 World Cup Final 2024)లోనూ కుర్రాళ్లకు నిరాశే ఎదురైంది. నవంబర్‌ 19, 2023న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆదివారం ఫైనల్లో కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.. కానీ ఆసీస్ విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది. 254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా కుర్రాళ్లు నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. సీనియర్లు ఎలాగైతే తుది మెట్టుపై కంగారు పడ్డారో, సరిగ్గా అదే తీరుగా భారత కుర్రాళ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్లలో బార్డ్‌మాన్, మెక్ మిలన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, విడ్లర్ 2 వికెట్లు తీశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకూ భారత్‌ 9సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్ ఆడగా.. 2000, 2008, 2012, 2018, 2022లో మొత్తం 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకు ముందు 2006, 2016, 2020లలో ఫైనల్లో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. చెరో రెండు ఫైనల్స్ నెగ్గి మెగా ట్రోఫీని అందుకున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow