Vijayashanti: ఒక్క యాక్ష‌న్ సినిమా దొరికితే ద‌డ‌ద‌డ‌లాడిస్తా - రిఎంట్రీపై విజ‌య శాంతి కామెంట్స్

Vijayashanti About Comeback Into Movies: విజ‌యశాంతి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కి పెట్టింది పేరు. ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. క్లాసు, మాసు, యాక్ష‌న్.. జోన‌ర్ ఏదైనా త‌నదైన శైలీలో యాక్టింగ్ చేస్తారు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఆమె. అయితే, ఒక్క‌సారిగా సినిమాల‌కు బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు విజ‌యశాంతి. ఇక ఆ త‌ర్వాత 13 ఏళ్ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆమె. 'స‌రిలేరు నీ కెవ్వ‌రు'లో చేశారు. అయితే, ఆ టైంలో ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విజ‌య శాంతి త‌ర్వాతి ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్ గా మారింది.  యాక్ష‌న్ సినిమాలు చేస్తాను..  ఎన్నో హిట్ సినిమాలు చేసిన విజ‌య శాంతి ఇటీవ‌ల కాలంలో మ‌హేశ్ బాబు న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో యాక్ట్ చేశారు. త‌ల్లి క్యారెక్ట‌ర్ లో న‌టించారు ఆమె. ఆ సినిమాలో ఆమె చేసిన న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 13 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. త‌ర్వాత యాక్ష‌న్ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ విష‌యంపై ఆమె మాట్లాడారు. "13 ఏళ్ల త‌ర్వాత అయినా ఎంట్రీ ఎందుకు ఇచ్చాను అంటే.. అక్క‌డ మ‌హేశ్ బాబు, అనిల్ రావిపూడి, మంచి క్యారెక్ట‌ర్. ఎప్ప‌టి నుంచో అడుగుతున్నారు రిజ‌క్ట్ చేస్తూ వ‌చ్చాను. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ న‌చ్చింది. టైం దొరికింది. అందుకే చేశాను. పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఫ్యూచ‌ర్ లో అంటారా? రొటీన్ సినిమా చేయ‌కుండా మంచి యాక్ష‌న్ సినిమా చేయాల‌ని ఉంది. ఒక్క యాక్ష‌న్ సినిమా మ‌ళ్లీ ధన్ ధ‌న్ ధ‌న్ చేయాల‌ని ఉంది. కానీ, క‌థ, పాత్ర అన్ని కొత్త‌గా ఉండాలి. అలాంటిది ఏమైనా ఉంటే చేయాల‌ని ఉంది. ఒక్క యాక్ష‌న్ సినిమా పాత విజ‌య్ శాంతి చేసిన లాంటి సినిమా. రొటీన్ మాత్రం వ‌ద్దు. చేస్తే  యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే చేస్తాను. అలా దొర‌కాలి, దొరికితే చూస్తాను. అది కూడా టైం కూడా దొరికితే. ఎందుకంటే బిజి బిజీ క‌దా. రాజ‌కీయం, పార్టీ అన్నీ ఉన్నాయి క‌దా" అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు విజ‌య శాంతి.  యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్..  విజ‌య‌శాంతిని అంద‌రూ 'రాములమ్మ' అని పిలుస్తారు. ఆమె చేసిన 'రాములమ్మ' సినిమా అప్ప‌ట్లో అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆమె ఏ క్యారెక్ట‌ర్ వేసినా అందులో ఇమిడిపోతారు. ఎంతో మంది హీరోలతో క‌లిసి న‌టించారు విజ‌య‌శాంతి. క్లాస్ పాత్ర‌లు వేశారు, మాస్ పాత్ర‌ల్లో న‌టించారు. డ్యాన్స్ కూడా అద‌ర‌గొడ‌తారు ఆమె. ఇక యాక్ష‌న్ సినిమాల‌కి పెట్టింది పేరు. ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీస‌ర్ గా, మిల‌ట‌రీ ఆఫీస‌ర్ గా చేశారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎన్నో చేశారు విజయశాంతి.  రాజ‌కీయాల్లో బిజీ బిజీ..  సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న విజ‌య శాంతి ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మం టైంలో, కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరిన ఆమె.. ఆ త‌ర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లు బీజేపీలో కొన‌సాగిన విజ‌య శాంతి.. ఈ మ‌ధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా సినిమాల‌ను మానేసిన ఆమె రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు.  Also Read: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?

Apr 25, 2024 - 18:00
 0  0
Vijayashanti: ఒక్క యాక్ష‌న్ సినిమా దొరికితే ద‌డ‌ద‌డ‌లాడిస్తా - రిఎంట్రీపై విజ‌య శాంతి కామెంట్స్

Vijayashanti About Comeback Into Movies: విజ‌యశాంతి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కి పెట్టింది పేరు. ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. క్లాసు, మాసు, యాక్ష‌న్.. జోన‌ర్ ఏదైనా త‌నదైన శైలీలో యాక్టింగ్ చేస్తారు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఆమె. అయితే, ఒక్క‌సారిగా సినిమాల‌కు బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు విజ‌యశాంతి. ఇక ఆ త‌ర్వాత 13 ఏళ్ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆమె. 'స‌రిలేరు నీ కెవ్వ‌రు'లో చేశారు. అయితే, ఆ టైంలో ఇంట‌ర్వ్యూ ఇచ్చిన విజ‌య శాంతి త‌ర్వాతి ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్ గా మారింది. 

యాక్ష‌న్ సినిమాలు చేస్తాను.. 

ఎన్నో హిట్ సినిమాలు చేసిన విజ‌య శాంతి ఇటీవ‌ల కాలంలో మ‌హేశ్ బాబు న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో యాక్ట్ చేశారు. త‌ల్లి క్యారెక్ట‌ర్ లో న‌టించారు ఆమె. ఆ సినిమాలో ఆమె చేసిన న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 13 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. త‌ర్వాత యాక్ష‌న్ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ విష‌యంపై ఆమె మాట్లాడారు.

"13 ఏళ్ల త‌ర్వాత అయినా ఎంట్రీ ఎందుకు ఇచ్చాను అంటే.. అక్క‌డ మ‌హేశ్ బాబు, అనిల్ రావిపూడి, మంచి క్యారెక్ట‌ర్. ఎప్ప‌టి నుంచో అడుగుతున్నారు రిజ‌క్ట్ చేస్తూ వ‌చ్చాను. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ న‌చ్చింది. టైం దొరికింది. అందుకే చేశాను. పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఫ్యూచ‌ర్ లో అంటారా? రొటీన్ సినిమా చేయ‌కుండా మంచి యాక్ష‌న్ సినిమా చేయాల‌ని ఉంది. ఒక్క యాక్ష‌న్ సినిమా మ‌ళ్లీ ధన్ ధ‌న్ ధ‌న్ చేయాల‌ని ఉంది. కానీ, క‌థ, పాత్ర అన్ని కొత్త‌గా ఉండాలి. అలాంటిది ఏమైనా ఉంటే చేయాల‌ని ఉంది. ఒక్క యాక్ష‌న్ సినిమా పాత విజ‌య్ శాంతి చేసిన లాంటి సినిమా. రొటీన్ మాత్రం వ‌ద్దు. చేస్తే  యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే చేస్తాను. అలా దొర‌కాలి, దొరికితే చూస్తాను. అది కూడా టైం కూడా దొరికితే. ఎందుకంటే బిజి బిజీ క‌దా. రాజ‌కీయం, పార్టీ అన్నీ ఉన్నాయి క‌దా" అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు విజ‌య శాంతి. 

యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్.. 

విజ‌య‌శాంతిని అంద‌రూ 'రాములమ్మ' అని పిలుస్తారు. ఆమె చేసిన 'రాములమ్మ' సినిమా అప్ప‌ట్లో అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆమె ఏ క్యారెక్ట‌ర్ వేసినా అందులో ఇమిడిపోతారు. ఎంతో మంది హీరోలతో క‌లిసి న‌టించారు విజ‌య‌శాంతి. క్లాస్ పాత్ర‌లు వేశారు, మాస్ పాత్ర‌ల్లో న‌టించారు. డ్యాన్స్ కూడా అద‌ర‌గొడ‌తారు ఆమె. ఇక యాక్ష‌న్ సినిమాల‌కి పెట్టింది పేరు. ఎన్నో సినిమాల్లో పోలీస్ ఆఫీస‌ర్ గా, మిల‌ట‌రీ ఆఫీస‌ర్ గా చేశారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎన్నో చేశారు విజయశాంతి. 

రాజ‌కీయాల్లో బిజీ బిజీ.. 

సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న విజ‌య శాంతి ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మం టైంలో, కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరిన ఆమె.. ఆ త‌ర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లు బీజేపీలో కొన‌సాగిన విజ‌య శాంతి.. ఈ మ‌ధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా సినిమాల‌ను మానేసిన ఆమె రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. 

Also Read: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow