ఇండియన్ మసాలా ఉత్పత్తులపై హాంగ్‌కాంగ్ నిషేధం, ఎవరెస్ట్‌తో పాటు మరో సంస్థకీ షాక్

Hong Kong Bans MDH Masala: భారత్‌కి చెందిన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్‌ ఆంక్షలు విధించింది. ఆ దేశానికి ఎగుమతి అయిన ఆ మసాలా ప్యాక్‌లను వెనక్కి పంపింది. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో ఇండియన్ కంపెనీకి షాక్ తగిలింది. MDH సంస్థ తయారు చేస్తున్న సాంబార్ మసాలాపై హాంగ్‌కాంగ్ నిషేధం విధించింది. దీంతో పాటు Everest Food Products Pvt ఉత్పత్తులనూ బ్యాన్ చేసింది. ఈ మసాలాలో ethylene oxide పరిమితికి మించి ఉంటోందని, అందుకే నిషేధిస్తున్నామని స్పష్టం చేసింది. ఇది పురుగుల మందు అని, అది వాడితే ప్రాణానికి ముప్పు అని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 5వ తేదీనే వీటిపై నిషేధం విధించింది హాంగ్‌కాంగ్‌కి చెందిన  Centre For Food Safety సంస్థ. రొటీన్ చెకప్‌లో భాగంగా అన్ని ఆహార పదార్థాలను పరిశీలించగా MDH గ్రూప్‌కి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌లో ఇథిలీన్ ఆక్సైడ్‌ ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మూడు రిటైల్ ఔట్‌లెట్స్‌ నుంచి ఈ ప్యాక్‌లను సేకరించి పరిశీలించినట్టు అధికారులు వెల్లడించారు.  ఈ పౌడర్‌లో ఇథిలీన్ ఆక్సైడ్ గుర్తించిన వెంటనే ఆ ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలోనూ ఇదే రసాయనం ఉందని వెల్లడించారు. క్యాన్సర్ కారకమైన గ్రూప్‌ -1 carcinogen జాబితాలో ఇథిలీన్ ఆక్సైడ్‌ని ఎప్పుడో చేర్చారు. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని గతంలోనే వైద్యులు హెచ్చరించారు. అందుకే సింగపూర్, హాంగ్‌కాంగ్‌ వెంటనే స్పందించి ఇలా ఆంక్షలు విధించాయి. గతంలోనూ అమెరికాకి చెందిన Food and Drug Administration సంస్థ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని వెనక్కి పంపింది. అందులో Salmonella కారకాలు ఉన్నాయని గుర్తించింది.   

Apr 22, 2024 - 14:00
 0  3
ఇండియన్ మసాలా ఉత్పత్తులపై హాంగ్‌కాంగ్ నిషేధం, ఎవరెస్ట్‌తో పాటు మరో సంస్థకీ షాక్

Hong Kong Bans MDH Masala: భారత్‌కి చెందిన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్‌ ఆంక్షలు విధించింది. ఆ దేశానికి ఎగుమతి అయిన ఆ మసాలా ప్యాక్‌లను వెనక్కి పంపింది. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో ఇండియన్ కంపెనీకి షాక్ తగిలింది. MDH సంస్థ తయారు చేస్తున్న సాంబార్ మసాలాపై హాంగ్‌కాంగ్ నిషేధం విధించింది. దీంతో పాటు Everest Food Products Pvt ఉత్పత్తులనూ బ్యాన్ చేసింది. ఈ మసాలాలో ethylene oxide పరిమితికి మించి ఉంటోందని, అందుకే నిషేధిస్తున్నామని స్పష్టం చేసింది. ఇది పురుగుల మందు అని, అది వాడితే ప్రాణానికి ముప్పు అని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 5వ తేదీనే వీటిపై నిషేధం విధించింది హాంగ్‌కాంగ్‌కి చెందిన  Centre For Food Safety సంస్థ. రొటీన్ చెకప్‌లో భాగంగా అన్ని ఆహార పదార్థాలను పరిశీలించగా MDH గ్రూప్‌కి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌లో ఇథిలీన్ ఆక్సైడ్‌ ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మూడు రిటైల్ ఔట్‌లెట్స్‌ నుంచి ఈ ప్యాక్‌లను సేకరించి పరిశీలించినట్టు అధికారులు వెల్లడించారు. 

ఈ పౌడర్‌లో ఇథిలీన్ ఆక్సైడ్ గుర్తించిన వెంటనే ఆ ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలోనూ ఇదే రసాయనం ఉందని వెల్లడించారు. క్యాన్సర్ కారకమైన గ్రూప్‌ -1 carcinogen జాబితాలో ఇథిలీన్ ఆక్సైడ్‌ని ఎప్పుడో చేర్చారు. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని గతంలోనే వైద్యులు హెచ్చరించారు. అందుకే సింగపూర్, హాంగ్‌కాంగ్‌ వెంటనే స్పందించి ఇలా ఆంక్షలు విధించాయి. గతంలోనూ అమెరికాకి చెందిన Food and Drug Administration సంస్థ ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని వెనక్కి పంపింది. అందులో Salmonella కారకాలు ఉన్నాయని గుర్తించింది. 

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow