ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ రేంజే వేరు, నెలకి రూ.9 లక్షల సంపాదన - కానీ ఆమె ఎక్కడా కనిపించదట

Spanish AI Influencer Meet Aitana: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ (AI) టెక్నాలజీతో ఉద్యోగాలు పోతున్నాయంటూ ఓ వైపు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఆ AI తో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. స్పానిష్‌కి చెందిన ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్ నెలకి రూ.9 లక్షలు సంపాదిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌ మార్కెట్‌లో ఉన్నారు. మంచి కంటెంట్‌తో లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు AI ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ Spanish AI Influencer. పేరు మీట్ అయిటానా (Meet Aitana). ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫిట్‌నెస్ లవర్ అంటూ బయోలో రాసుకుందీ AI ముద్దుగుమ్మ. రకరకాల బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తూ బోలెండంత సంపాదించి పెడుతోంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టే పోస్ట్‌లన్నీ దాదాపు పెయిడ్ ప్రమోషన్స్‌వే. ఫాలోవర్స్‌కి బ్రాండ్స్‌ని సజెస్ట్ చేస్తూ కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. చాలా కంపెనీలు ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి తమ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసుకునేందుకు ఎగబడుతున్నాయి. Euronews వెల్లడించిన వివరాల ప్రకారం ఇలా ఈ యాడ్స్‌, ప్రమోషన్స్‌తో నెలకి 10 వేల యూరోలు సంపాదిస్తోంది మీట్. అంటే మన కరెన్సీలో రూ.9 లక్షలు. Clueless అనే సంస్థ ఓనర్ రూబన్ క్రూజ్ (Ruben Cruz) ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేశాడు.  నిజానికి తమ కంపెనీని ప్రమోట్ చేసుకునేందుకు క్లూలెస్ సంస్థ ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఆధారపడింది. కాకపోతే ప్లాన్ ప్రకారం వాళ్లు కంటెంట్ ఇవ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం లాంటి కారణాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు క్రూజ్. అప్పుడే సొంతగా ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. సొంతగా ఓ మోడల్‌ని తయారు చేసుకుని ఆ మోడల్ ద్వారా బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నారు. అలా వచ్చిన ఆలోచనే ఇప్పుడు లక్షలు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీలు ఇలా సొంతగా AI Model ని క్రియేట్ చేసుకునేందుకు క్రూజ్‌నే సంప్రదిస్తున్నాయి. 

Apr 18, 2024 - 17:00
 0  5
ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ రేంజే వేరు, నెలకి రూ.9 లక్షల సంపాదన - కానీ ఆమె ఎక్కడా కనిపించదట

Spanish AI Influencer Meet Aitana: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ (AI) టెక్నాలజీతో ఉద్యోగాలు పోతున్నాయంటూ ఓ వైపు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఆ AI తో ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. స్పానిష్‌కి చెందిన ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్ నెలకి రూ.9 లక్షలు సంపాదిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌ మార్కెట్‌లో ఉన్నారు. మంచి కంటెంట్‌తో లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు AI ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ Spanish AI Influencer. పేరు మీట్ అయిటానా (Meet Aitana). ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫిట్‌నెస్ లవర్ అంటూ బయోలో రాసుకుందీ AI ముద్దుగుమ్మ.

రకరకాల బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తూ బోలెండంత సంపాదించి పెడుతోంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టే పోస్ట్‌లన్నీ దాదాపు పెయిడ్ ప్రమోషన్స్‌వే. ఫాలోవర్స్‌కి బ్రాండ్స్‌ని సజెస్ట్ చేస్తూ కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. చాలా కంపెనీలు ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి తమ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసుకునేందుకు ఎగబడుతున్నాయి. Euronews వెల్లడించిన వివరాల ప్రకారం ఇలా ఈ యాడ్స్‌, ప్రమోషన్స్‌తో నెలకి 10 వేల యూరోలు సంపాదిస్తోంది మీట్. అంటే మన కరెన్సీలో రూ.9 లక్షలు. Clueless అనే సంస్థ ఓనర్ రూబన్ క్రూజ్ (Ruben Cruz) ఈ AI ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేశాడు. 

నిజానికి తమ కంపెనీని ప్రమోట్ చేసుకునేందుకు క్లూలెస్ సంస్థ ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఆధారపడింది. కాకపోతే ప్లాన్ ప్రకారం వాళ్లు కంటెంట్ ఇవ్వకపోవడం, ఇబ్బంది పెట్టడం లాంటి కారణాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు క్రూజ్. అప్పుడే సొంతగా ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. సొంతగా ఓ మోడల్‌ని తయారు చేసుకుని ఆ మోడల్ ద్వారా బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నారు. అలా వచ్చిన ఆలోచనే ఇప్పుడు లక్షలు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీలు ఇలా సొంతగా AI Model ని క్రియేట్ చేసుకునేందుకు క్రూజ్‌నే సంప్రదిస్తున్నాయి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow