టేస్ట్ కోసం నాన్‌వెజ్‌లో ఆ మసాలా వేస్తున్నారా? జాగ్రత్త అందులో పురుగుల మందు ఉందట!

Everest Fish Curry Masala: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని (Everest Fish Curry Masala) భారత్ పెద్ద ఎత్తున సింగపూర్‌కి ఎగుమతి చేస్తోంది. అయితే.. ఉన్నట్టుండి సింగపూర్‌ ఆ మసాలా ప్యాకింగ్‌లను వెనక్కి (Everest Masala Exports) పంపేసింది. అందులో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే వెనక్కి పంపుతున్నట్టు వెల్లడించింది. ఈ మసాలాలో ethylene oxide మితిమీరి ఉంటోందని, అది చాలా ప్రమాదకరమని తేల్చి చెప్పింది. హాంగ్‌కాంగ్‌లోని Centre for Food Safety హెచ్చరికలతో వెంటనే ఆ మసాలాని భారత్‌కి పంపేయాలని నిర్ణయించుకుంది. పరిమితికి మించి ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉండడం వల్ల నిరాకరిస్తున్నట్టు తెలిపింది.  ఇథిలీన్ ఆక్సైడ్ అంత ప్రమాదకరమా..? ఇథిలీన్ ఆక్సైడ్‌ని సాగులో ఎక్కువగా వినియోగిస్తారు. పురుగుల మందులా వాడతారు. పంటకు తెగులు పట్టకుండా కట్టడి చేసేందుకు చల్లుతారు. ప్రమాదకరమైన ఈ పౌడర్‌ని ఆహార పదార్థాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదు. కానీ...ఎవరెస్ట్ మసాలాలో ఈ పౌడర్‌ని వినియోగిస్తున్నట్టుగా ఆరోపిస్తోంది సింగపూర్ ఫుడ్‌ సేఫ్‌టీ విభాగం. అక్కడి చట్టాల ప్రకారం ఈ వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఎవరెస్ట్ తయారు చేసిన మసాలా వాడితే అది ప్రజారోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరించింది. పలు కెమికల్స్ తయారీలోనూ ఇథిలీన్ ఆక్సైడ్‌నే ఎక్కువగా వినియోగిస్తారు. అందులో ethylene glycol ఒకటి. మెడికల్ ఎక్విప్‌మెంట్‌ని శుభ్రం చేసేందుకు వాడే స్టెరిలెంట్‌లలోనూ ఇథిలీన్ ఆక్సైడ్‌ని వాడతారు. దీన్ని ఆహార పదార్థాల్లో కలపడం వల్ల వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఊపిరితిత్తులు పాడవడం, తలనొప్పి, వాంతులు, డయేరియా లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   

Apr 19, 2024 - 17:00
 0  2
టేస్ట్ కోసం నాన్‌వెజ్‌లో ఆ మసాలా వేస్తున్నారా? జాగ్రత్త అందులో పురుగుల మందు ఉందట!

Everest Fish Curry Masala: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాని (Everest Fish Curry Masala) భారత్ పెద్ద ఎత్తున సింగపూర్‌కి ఎగుమతి చేస్తోంది. అయితే.. ఉన్నట్టుండి సింగపూర్‌ ఆ మసాలా ప్యాకింగ్‌లను వెనక్కి (Everest Masala Exports) పంపేసింది. అందులో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే వెనక్కి పంపుతున్నట్టు వెల్లడించింది. ఈ మసాలాలో ethylene oxide మితిమీరి ఉంటోందని, అది చాలా ప్రమాదకరమని తేల్చి చెప్పింది. హాంగ్‌కాంగ్‌లోని Centre for Food Safety హెచ్చరికలతో వెంటనే ఆ మసాలాని భారత్‌కి పంపేయాలని నిర్ణయించుకుంది. పరిమితికి మించి ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉండడం వల్ల నిరాకరిస్తున్నట్టు తెలిపింది. 

ఇథిలీన్ ఆక్సైడ్ అంత ప్రమాదకరమా..?

ఇథిలీన్ ఆక్సైడ్‌ని సాగులో ఎక్కువగా వినియోగిస్తారు. పురుగుల మందులా వాడతారు. పంటకు తెగులు పట్టకుండా కట్టడి చేసేందుకు చల్లుతారు. ప్రమాదకరమైన ఈ పౌడర్‌ని ఆహార పదార్థాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదు. కానీ...ఎవరెస్ట్ మసాలాలో ఈ పౌడర్‌ని వినియోగిస్తున్నట్టుగా ఆరోపిస్తోంది సింగపూర్ ఫుడ్‌ సేఫ్‌టీ విభాగం. అక్కడి చట్టాల ప్రకారం ఈ వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించింది. ఎవరెస్ట్ తయారు చేసిన మసాలా వాడితే అది ప్రజారోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరించింది. పలు కెమికల్స్ తయారీలోనూ ఇథిలీన్ ఆక్సైడ్‌నే ఎక్కువగా వినియోగిస్తారు. అందులో ethylene glycol ఒకటి. మెడికల్ ఎక్విప్‌మెంట్‌ని శుభ్రం చేసేందుకు వాడే స్టెరిలెంట్‌లలోనూ ఇథిలీన్ ఆక్సైడ్‌ని వాడతారు. దీన్ని ఆహార పదార్థాల్లో కలపడం వల్ల వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఊపిరితిత్తులు పాడవడం, తలనొప్పి, వాంతులు, డయేరియా లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow