Adilabad Farmers: వరుణుడి కరుణకు రైతుల ఎదురుచూపులు..ఊరిస్తున్న మబ్బులు.. వాన జాడ కరువు

3 months ago 59
ARTICLE AD

Adilabad Farmers: సకాలంలో నైరుతి రుతు రుతు పవనాలు వస్తాయనే వాతావరణ శాఖ సమాచారంతో రైతులు ముందస్తు చర్యలు చేపట్టారు. మృగశిర కార్తెలో మంచి వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులు పత్తి విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వరుణుడి అలకతో వర్షాల జాడ లేకుండా పోయిందని కర్షకులు బెంగతో ఉన్నారు.

నీటి వనరులు ఉన్న కొందరు విత్తనాలకు నీటి తడులిచ్చే పనులు ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆకాశం దట్టమైన కారుమబ్బు లతో మేఘావృతమై రైతులను ఊరించిన వరుణుడు ఆయా గ్రామాల్లో చిరుజల్లులతోనే సరియడుతున్నాడు.

వాతావరణంతో ఎంతో వర్షం కురుస్తుందని ఆశించిన రైతులకు బెంగ తప్పడం లేదు. ఆరంభంలోనే ఈ పరిస్థితులు నెలకొనడంతో ఆవేదనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు మార్లు వర్షాలు కురిసాయి.

అడగంటిన జలశయాలు.. చెరువులు.. కుంటలు

కొన్ని చోట్ల ఎండలు మరింత మండుతుండడంతో గ్రామాల్లో చెరువులు, కుంటల్లో ఉన్న నీరంతా ఎండిపోయింది. పశుపక్ష్యాదులకు తాగునీటికి తండ్లాట తప్పడంలేదు. కడెం జలాశయం ఎగువన ఒక్క వర్షం కురిసినా కొంతమేర వరదనీరు ఈపాటికి వచ్చేది.

ఎగువప్రాంతాల్లోనూ వర్షం కురవక కడెంకు ఇంఫ్లో సున్నాగా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా కడెం జలాశయంలో నీటిమట్టం 671 అడుగులకు తగ్గిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా కనిష్ఠ స్థాయి నీటిమట్టం 675 అడుగులు కలదు, ఈసారి జలాలు అడుగంటిపోవడంతో బురదమట్టి చాలామేరకు తేలి కొంతమేర ఎడారి తలపిస్తోంది.

నీటిమట్టం తగ్గి మిషన్ భగీరథ ఇన్టేక్ వెలకు నీరందని పరి స్థితి నెలకొంది. అధికారులు కష్టంగా కొంతమేర గ్రామాలకు తాగునిటీ ని సరఫరా చేస్తున్నారు. నీటిమట్టం అడుగంటడంతో జలాశయంలో సందర్శకులతో తిరిగే పర్యాటకశాఖ పడవ మూలనపడింది.

జూన్ రెండో వారం నడుస్తున్నా ఒక్క తేలికపాటి వర్షంకూడా కురవకపోవడంతో వరదనీరు రావడంలేదు. గ్రామాల్లో చెరువులు, కుంటలూ నీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో గల స్వర్ణ, గాడ్డెనవాగు, కడం, ఛానక కోరట, పలు మేజర్ నీటి జలాశయాలు సైతం ఎగువన వర్షాలు కురియక వరద నీరు చేరాకపోవడంతో అడగంటినాయి. వరుణా కరుణిం చవా.. అంటూ ఆకాశానికి మొఖం పెట్టి చూస్తున్నారు రైతులు. అనేక చోట్ల పైపులు ద్వారా విత్తనాలు ఎండిపోకుండా నీరు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల బిందెలతో విత్తనాలు తడుపు కుంటున్నారు.

(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి , హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Read Entire Article