BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

3 months ago 106
ARTICLE AD

BC RJC CET Results 2024 : తెలంగాణలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సర ఇంటర్‌ ప్రవేశాలకు ఏప్రిల్‌ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇవాళ(మే 19న) గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు రిలీజ్ చేశారు. ఈ పరీక్షలో విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించామన్నారు. జూనియర్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో మే 20 నుంచి 30వ తేదీలోపు రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు బీసీ ఆర్జేసీ సెట్ ఫలితాలను గురుకుల వెబ్‌సైట్‌ https://mjpabcwreis.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి?

Step 1 : విద్యార్థులు https://mjpabcwreis.cgg.gov.in వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.Step 2 : MJPTBCW RJC-CET-2024 ఆన్ లైన్ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి.Step 3 : తర్వాతి పేజీలో విద్యార్థి హాల్ టికెట్ నెం, మొబైల్ నెం, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.Step 4 : రిజిల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి. భవిష్యత్ అవసరలా కోసం ఫలితాలు సేవ్ చేసుకోండి.

తెలంగాణలో 261 జూనియర్ కాలేజీల పలు గ్రూప్‌లు, ఒకేషనల్ కోర్సుల అందిస్తున్నాయి. జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేస్తున్నారు.

ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. MJPTBC ఇంటర్మీడియట్ కోర్ గ్రూపులు, వృత్తి విద్యా కోర్సులను 2024 విద్యా సంవత్సరం కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు అందిస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉచిత శిక్షణపై అవగాహన కలిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 261 జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయి. వాటిలో నుంచి 4 కళాశాలలు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఉద్దేశించనవి.

మే 20న ఈసెట్ ఫలితాలు

తెలంగాణ ఈసెట్ -2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఇందుకు అధికారులు ముహుర్తం ఫిక్స్ చేశారు. మే 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ఈసెట్ - 2024 పరీక్షను నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకల ఆధారంగా….. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.

ఈసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు?

తెలంగాణ ఈసెట్ 2024 పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ లోకి వెళ్లాలి,

హోమ్ పేజీలో కనిపించే 'టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ - 2024 పై క్లిక్ చేయాలి.

లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.

టీఎస్ ఈసెట్ 2024 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డును పొందవచ్చు

Read Entire Article