Gadwal Mla Back To BRS : సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

1 month ago 53
ARTICLE AD

Gadwal Mla Back To BRS : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. కేటీఆర్ సమక్షంలో ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ చేరారు, ఇంతలోనే మనసు మార్చుకుని సొంత గూటికి తిరిగొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Gadwal Mla Back To BRS : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ బాట పట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కేటీఆర్ ను కలిసి కృష్ణ మోహన్ రెడ్డి...ఇవాళ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు.

రెండు నెలల్లోనే

జులై 6న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి ఆధ్వర్యంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇంతలోనే ఆయన మనసు మార్చుకుని గులాబీ పార్టీకి తిరిగి వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సమయంలో...కాంగ్రెస్ నుంచి బ్యాక్ టు బీఆర్ఎస్ అని గద్వాల ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఘర్ వాప్సీ మొదలుపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్న తరుణంలో...ఓ ఎమ్మెల్యే చేజారిపోవడం గట్టి ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు రాస్కోండి "బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా" అని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.

బీఆర్ఎస్ టు కాంగ్రెస్

2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. అసెంబ్లీ ఫలితాలలో కాంగ్రెస్ 64, సీపీఐ 1, బీఆర్ఎస్ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 సీట్లు సాధించాయి. 65 సీట్లతో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలినాళ్లలో...ప్రభుత్వం కూలిపోతుందని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేశాయి. ఇంతలో లోక్ సభ ఎన్నికల రావడంతో..పార్టీలు ప్రచారాల్లో బిజీ అయ్యాయి. అదును చూసుకుని కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. దీంతో ఒక్కొక్కరిగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం ఖాయం అని సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్..కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి తగ్గింది. ఈ 9 మందితో కలిపి కాంగ్రెస్ కు 74 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది.

దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఇంకొంత మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో... గద్వాల ఎమ్మె్ల్యే కృష్ణ మోహన్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్ చేరడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బే అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలతో కృష్ణమోహన్ రెడ్డికి మధ్య మనస్పర్థలే... ఆయన యూటర్న్ తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే మరికొంతమంది వాదన మరోలా ఉంది. బీఆర్ఎస్ నుంచి వలసలు తగ్గించేందుకు కేసీఆర్... ఉద్దేశపూర్వకంగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి పంపారని, సమయం చూసి మళ్లీ వెనక్కి రప్పించారంటున్నారు. ఎమ్మెల్యేల వలసలు తగ్గించేందుకు కేసీఆర్ ప్లాన్ భాగమే ఇదంతా అంటున్నారు.

WhatsApp channel

Read Entire Article