Jr Doctors Protest : జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్- నిధులు కేటాయిస్తూ రెండు జీవోలు జారీ

2 months ago 55
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jr Doctors Protest : జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్- నిధులు కేటాయిస్తూ రెండు జీవోలు జారీ

Jr Doctors Protest : తెలంగాణ జూడాలు సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. జూడాల డిమాండ్ల మేరకు ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది.

జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్- నిధులు కేటాయిస్తూ రెండూ జీవోలు జారీ

జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్- నిధులు కేటాయిస్తూ రెండూ జీవోలు జారీ

Jr Doctors Protest : తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఆరోగ్యశాఖ అధికారులు, డీఎంఈతో జరిపిన చర్చలతో సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వం జూడాలకు ఇచ్చిన హామీ మేరకు బుధవారం రెండు జీవోలు జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఆసుపత్రులకు నిధులు విడుదల చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతి గృహాల నిర్మాణానికి జీవో జారీ చేసింది. అలాగే కాకతీయ మెడికల్ కాలేజీ రోడ్ల పునరుద్ధరణకు నిధుల విడుదల చేస్తూ మరో జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ వర్సిటీలకు రూ.204.85 కోట్లు కేటాయించింది. ఇందులో ఉస్మానియాకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.79.50 కోట్లు , కాకతీయ వర్సిటీకి 2.75 కోట్లు మంజూరు చేసింది. సమ్మె తాత్కాలిక విరమణతో గాంధీ ఆసుపత్రితో సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు జూడాలు హాజరయ్యారు. జూడాలు... వైద్యారోగ్యశాఖ మంత్రి, అధికారులతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది.

రెండు జీవోలు జారీ

ప్రతి నెల స్టైఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ చుట్టూ తిరగాల్సి వ‌స్తుంద‌ని జూడాలు తెలిపారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని జూడాలు డిమాండ్ చేశారు. దీంతో పాటు వైద్య సీట్లకు అనుగుణంగా హాస్టళ్ల వ‌స‌తి సౌక‌ర్యాలు పెంచాలని చర్చల్లో తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భ‌వ‌నం నిర్మించాలన్నారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, త‌ర‌చూ రోడ్డు ప్రమాదాలు జ‌రుగుతున్నాయ‌ని, ఈ స‌మ‌స్యల‌ను సత్వరమే పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై బుధవారంలోపు జీవోలు జారీ అవ్వకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలిపారు. దీంతో ప్రభుత్వం ఇవాళ రెండు జీవోలు జారీచేసింది. వ‌స‌తి గృహాల నిర్మాణం, రోడ్ల పున‌రుద్ధర‌ణ‌కు నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నిధుల కేటాయింపు

ఉస్మానియా వైద్య కళాశాలకు ప్రభుత్వం రూ. 121.90 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో లేడిస్ హాస్టల్ నిర్మాణానికి రూ. 80 కోట్లు, బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి రూ. 35 కోట్లు, డెంట‌ల్ హాస్టల్ నిర్మాణానికి రూ. 6 కోట్లు, బాయ్స్ హాస్టల్ పనులకు రూ. 50 ల‌క్షలు, కృష్ణవేణి లేడిస్ హాస్టల్ మార్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 40 ల‌క్షలు విడుదల చేసింది. దీంతో పాటు గాంధీ మెడిక‌ల్ కాలేజీ మొత్తం రూ.79.50 కోట్లు విడుదల చేసింది. ఇందులో లేడిస్ హాస్టల్ నిర్మాణానికి రూ. 42 కోట్లు, బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి రూ. 23 కోట్లు, సీనియ‌ర్ రెసిడెంట్ బ్లాక్ హాస్టల్ నిర్మాణానికి రూ. 14.50 కోట్లు కేటాయించింది. కాక‌తీయ వైద్య కాలేజీలో ఇంట‌ర్నల్ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2.75 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే జూడాల ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. డిమాండ్లపై జూడాల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Read Entire Article