kadaknath chicken: జగిత్యాల జిల్లాలో వింత కోడి, మనిషి మాట వింటున్న కడక్ నాథ్ కోడి, చూసేందుకు ఎగబడుతున్న జనం

3 months ago 61
ARTICLE AD

kadaknath chicken: జగిత్యాల జిల్లాలో వింత కోడి జనాల్ని ఆకట్టుకుంటోంది. యాజమాని చెప్పినట్టు వింటుంది. మనిషి చెప్పే మాటలు విని పాటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కడక్ నాథ్ కోడి ఖతర్నాక్ కోడి అనిపించుకుంటుంది.

వివరాల్లోకి వెళ్ళితే జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి మినీ కొళ్ళ ఫారం నిర్వహిస్తు ఉపాధి పొందుతున్నాడు. అందులో 200 వరకు కడక్‌ నాథ్‌ రకం కోళ్ళను పెంచుతున్నాడు. అందులో ఓ కోడి వింతగా ప్రవర్తిస్తుంది. మల్లారెడ్డి చెప్పినట్లు వింటుంది. మల్లారెడ్డి తో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తుంది. రమ్మంటే వస్తుంది. పొమ్మంటే దూరంగా పోతుంది. పో అనగానే ముందుకు ఉరుకుతుంది.

వెనక్కి రా అంటే వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. యాజమాని మల్లారెడ్డి భుజాల పైకి ఎక్కి తన అప్యాయతను చాటుకుంటుంది. చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మల్లారెడ్డి సైతం ఆ కోడి పట్ల అమితమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు.

వింత కోడిని చూసేందుకు వస్తున్న జనం

మనిషి చెప్పినట్లు వింటూ వింతగా ప్రవర్తిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని చూసేందుకు జనం వస్తున్నారు. కోడి కావాలని కోరుకునే వారు కూడా లేకపోలేదు. యజమాని మాత్రం ఆ కోడిని విక్రయించడానికి నిరాకరిస్తున్నాడు. తాను చెప్పినట్లు వింటూ తనతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తున్న కోడి బతికినంత కాలం తన ఫామ్ లోనే ఉంటుందంటున్నారు. ఇలాంటి కోడి దొరకడం అరుదని చిన్నప్పటి నుంచి తాను చెప్పినట్లు విని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు.

కోడి మైండ్ కాదు.. మనిషి మైండే…

ఎవరైనా ఏదైనా చెప్తే క్షణాల్లో మర్చిపోతే కోడి మైండ్ అంటూ నిందిస్తారు. ఎందుకంటే కోడి బూడిదలో పొర్లినప్పుడు వచ్చే ఆలోచన బయటకు వచ్చి బూడిద దులిపితే అంతా మరిచిపోతుందట.అందుకే కోడికి ఏది గుర్తుండదు కాబట్టి మనిషి కూడా మర్చిపోతే కోడి మైండోడా అంటారు. కానీ ఇప్పుడు లక్ష్మీపూర్ లో కడక్ నాథ్ కోడి యవ్వారాన్ని చూసిన తర్వాత దానిది కోడి మైండ్ కాదు మనిషి మైండేనని భావించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ కోడి కడక్ నాథ్ కోడి కాదు, ఖతర్నాక్ కోడి అంటున్నారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Read Entire Article