Student Suicide: హైదరాబాద్‌ హాస్టల్ గదిలో ఏడో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి, పాఠశాల వద్ద ఉద్రిక్తత

2 months ago 51
ARTICLE AD

Student Suicide: హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ ప్రైవేట్ పాఠశాలల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు మరియు పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం......మెదక్ జిల్లా,మెదక్. పట్టణానికి చెందిన వీరయ్య,మాధవీలత ల పెద్ద కుమారుడు మల్లికార్జున కుత్బుల్లాపూర్ లో ఓ ప్రైవేట్ పాఠశాలల్లో ఏడో తరగతి చదువుతూ అక్కడే హాస్టల్ లో ఉంటున్నాడు.

గత సోమవారమే అతన్ని తల్లితండ్రులు హాస్టల్ లో చేర్చారు.మంగళవారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి పడుకున్న మల్లిఖార్జున ఎంతకూ నిద్ర లేవడం లేదు.

దీంతో తోటి స్నేహితులు యాజమాన్యానికి విషయాన్ని తెలుపగా హుటాహుటిన మల్లికార్జునను సుచిత్రలోని రష్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు మరియు విద్యార్థి సంఘాలు, పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తమ విద్యార్థికి రాత్రికి రాత్రి ఏమైందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. అయితే మల్లికార్జున పడుకున్న బెడ్ షీట్ లోనే అతడు టాయిలెట్ పోయడం. అలాగే కాళ్ళకి బెడ్ షీట్ మూడి పడి ఉండడం,పలు అనుమానాలకు తావు తీసింది. మల్లిఖార్జున గుండెపోటు తో మరణించాడా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రైవేట్ కాలేజీలో కలుషిత నీరు తాగి 25 మంది విద్యార్థులకు అస్వస్థత

చందా నగర్ లోని ఓ ప్రైవేట్ జూనియర్ ఉమెన్ కాలేజి హాస్టల్‌లో కలుషిత నీరు తాగి ఏకంగా 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాగా కాలేజి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వారిని ఆస్పత్రికి తరలించింది. పలువురు విద్యార్థినులు తమ తల్లితండ్రులకు తెలపడంతో వారు కాలేజి ప్రిన్సిపాల్ ను నిలదీశారు. దీంతో ఆమె వివరణ ఇచ్చారు.

తాగు నీరు కలుషితం అవ్వడం వల్ల 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని,అందులో 16 మంది విద్యార్థినులు ఇప్పటికే డిశ్చార్జి అయ్యారని కేవలం మరో 9 మంది చికిత్స పొందుతున్నారని మరోసారి ఇలాంటి తప్పు జరగదని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం తాగు నీరు మరియు ఆహారాన్ని పరిశీలించారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

Read Entire Article