Telangana News Live August 31, 2024: IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ

4 months ago 122
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 31, 2024: Ias Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ

 తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ

IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ(Image Source CMO Telangana)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 31 Aug 202405:10 PM IST

Telangana News Live: IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు - ఉత్తర్వులు జారీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్‌ ఇక్బాల్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202405:09 PM IST

Telangana News Live: Hyderabad Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ మార్గంలో కిలోమేటర్ల మేర ట్రాఫిక్ జామ్, వాహనాలు దారి మళ్లింపు

Hyderabad Vijayawada Highway : భారీ వర్షాలు రోడ్లను ముంచెత్తుతున్నాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్ పల్లి-అద్దంకి రహదారి మీదుగా మళ్లిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202405:08 PM IST

Telangana News Live: Ganesh Chaturthi 2024: గణేశ్ నవరాత్రి దీక్షలు చేపట్టండి.. మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా చెల్లిస్తా: బండి సంజయ్

Ganesh Chaturthi 2024: వినాయక చవిత ఉత్సవాలను నిర్వహించే వారు.. తప్పనిసరిగా 9 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని.. అందుకు తానే ఉదాహరణ అని స్పష్టం చేశారు. గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చు భరిస్తానని చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202404:47 PM IST

Telangana News Live: Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. అవసరం ఉంటేనే బయటకు రండీ.. మరోసారి మూసీ వరదలు!

Hyderabad Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై వరుణుడు పంజా విసురుతున్నాడు. కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202404:00 PM IST

Telangana News Live: Nalgonda News : భలే దొంగలు..! భక్తుల వేషంలో రెక్కీ, రాత్రివేళ ఆలయాల్లో చోరీలు - చివరికి ఇలా దొరికిపోయారు..!

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు హుండీలను కూడా స్వాధీనం చేశారు. 14 దేవాలయాల్లో వీరు దొంగతనాలకు పాల్పడ్డినట్లు పోలీసులు వెల్లడించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:51 PM IST

Telangana News Live: Telangana Rains : అసలే భారీ వర్షాలు.. కరెంటుతో జర భద్రం! పాటించాల్సిన జాగ్రత్తలివే

Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాల విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202403:21 PM IST

Telangana News Live: TG Schools Holiday : హైదరాబాద్ లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు, కలెక్టర్ ప్రకటన

TG Schools Holiday : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. ఐఎండీ సూచనల మేరకు ఎల్లుండి హైదరాబాద్ లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాగల 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202412:46 PM IST

Telangana News Live: Hydra: పటాన్‌చెరు, అమీన్‌పూర్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. టెన్షన్‌లో అక్రమార్కులు!

Hydra: హైదరాబాద్ చెరువుల్లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా.. సంగారెడ్డి జిల్లాలో ఉన్న చెరువుల పైన ఫోకస్ పెట్టింది. అమీన్ పూర్, పటాన్‌చెరులో ఉన్న పలు చెరువుల్లో ఆక్రమణలు ఉన్నట్టు ఫిర్యాదులు రావటంతో.. అధికారులు ఈ ఆక్రమణల పైన దృష్టి పెట్టారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202410:24 AM IST

Telangana News Live: Water From Neem Tree : జనగామ జిల్లాలో వింత ఘటన, వేప చెట్టు నుంచి నీళ్ల ప్రవాహం

Water From Neem Tree : జనగామ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. వేప చెట్టు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నేలకూలిన భారీ వేపచెట్టు మొదలు నుంచి దాదాపు పావు గంట సేపు నీళ్ల ప్రవాహం కొనసాగింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202408:03 AM IST

Telangana News Live: Hydra: ఉద్యోగులకూ హైడ్రా టెన్షన్.. ఆరుగురు అధికారులపై కేసు నమోదు.. త్వరలో మరికొందరిపై..

Hydra: హైడ్రా పేరు చెబితే ఇన్ని రోజులు అక్రమార్కులు వణికిపోయారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. తాజాగా ఆరుగురు అధికారులపై హైడ్రా ఫిర్యాదు చేయగా.. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202407:44 AM IST

Telangana News Live: HCU Phd Notification 2024 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ Phd నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

Hyderabad Central University : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదైంది.  2024-24 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ లో ప్రవేశాలు కల్పించనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202406:49 AM IST

Telangana News Live: TS Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడూ.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..!

TS Nominated Posts: ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలు రగిలిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా.. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202405:43 AM IST

Telangana News Live: Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. మళ్లీ 2016, 2020 సీన్ రిపీట్ అయ్యే అవకాశం!

Hyderabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202404:36 AM IST

Telangana News Live: Karimnagar : భూ అక్రమ దందాపై పోలీసుల కొరడా - 21 మందిపై కేసులు, ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్..!

భూ అక్రమ దందాలపై కరీంనగర్ పోలీసుల కొరడా ఝలిపిస్తున్నారు. ఓ సర్వే నెంబర్ లో అక్రమ రిజిస్ట్రేషన్ పై అందిన ఫిర్యాదు మేరకు…21 మందిపై కేసు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేయగా.. ఇందులో ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202402:21 AM IST

Telangana News Live: Warangal Health City : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ - కీలక ఫైళ్లు స్వాధీనం

వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ ఆఫీస్ నుంచి  పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలు… ఆ తరువాత నిర్మాణ వ్యయం పెంచడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202401:48 AM IST

Telangana News Live: Mee Seva Online : 'మీ సేవ'లో కొత్తగా 9 సేవలు..! ఇక ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లకుండానే ఈ పత్రాలను పొందవచ్చు

మీ సేవ సర్వీసులో మరో 9 కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫలితంగా  పలు ధ్రువీకరణ పత్రాలను తహసీల్దారు కార్యాలయాల్లో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే అందజేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202401:18 AM IST

Telangana News Live: TG GENCO Results 2024 : తెలంగాణ జెన్ కో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TG GENCO Results 2024 : తెలంగాణ జెన్‌కో ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి జులై 14వ తేదీన ఆన్ లైన్ పరీక్ష నిర్వహించగా… శుక్రవారం అధికారులు ఫలితాలను ప్రకటించారు. https://tggenco.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులను ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202412:30 AM IST

Telangana News Live: Telangana Congress : సీఎం మార్పునకు అవకాశముందా..? కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేంటి..?

ఉత్తమ్ సీఎం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఆయన యథాలాపంగా వ్యాఖ్యానించారా..? ఉద్దేశపూర్వకంగానే అన్నారా..? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశమేంటన్నది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 31 Aug 202411:51 PM IST

Telangana News Live: TG New Tourism Policy : వెయ్యి ఎక‌రాల్లో కొత్త జూ పార్క్ - టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు

కొత్త టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరం బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పూర్తి స్టోరీ చదవండి

Read Entire Article