TG Assembly: సాయంత్రం కల్లా విద్యుత్‌ ఒప్పందాల విచారణకు కొత్త కమిషన్ ఛైర్మన్ నియమిస్తామన్న సీఎం రేవంత్‌

1 month ago 48
ARTICLE AD

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రానికి కల్లా విద్యుత్ ఒప్పందాల విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

TG Assembly: విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు మాట్లాడిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడెందుకు దానిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు.

ఛత్తీస్ ఘడ్, యాదాద్రి , భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని, వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించామని స్పష్టం చేశారు. విద్యుత్‌ కొనుగోళ్లు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు న్యాయ విచారణ కోరారని గుర్తు చేశారు.

అంతకుముందు ప్రభుత్వ తీరును మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి తప్పు పట్టారు. విద్యుత్‌ కొనుగోళ్లపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జగదీశ్‌రెడ్డి ఆవేదన చూస్తుంటే చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయ విచారణ జరుగుతోందని, విచారణ కమిషన్‌ ముందు వాదనలు వినిపిస్తేనే వారి నిజాయతీ బయటకు వస్తుందన్నారు. విద్యుత్ వ్యవహారంపై న్యాయ విచారణ కోరింది వాళ్లేనని, ఇప్పుడు వద్దంటున్నది వాళ్లేనన్నారు. విద్యుత్‌ కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ను సాయంత్రం నియమిస్తామన్నారు.

యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందని, విద్యుత్‌ వినయోగం ప్రాతిపదికనే విద్యుత్‌ విభజన జరిగేలా జైపాల్‌రెడ్డి విభజన సమయంలో కృషి చేశారని, విభజన చట్టంలో లేని స్పీకింగ్‌ ఆర్డర్‌ను విద్యుత్‌ విషయంలో జైపాల్‌రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. జైపాల్‌రెడ్డి కృషి వల్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్‌ విభజన జరిగిందని, విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం విద్యుత్‌ వచ్చేలా ఉందని, తెలంగాణను చీకట్ల నుంచి జైపాల్‌రెడ్డి కాపాడారన్నారు.

సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్ల రాష్ట్రం విద్యుత్‌ సమస్య నుంచి గట్టెక్కిందని, విద్యుత్‌పై విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. రూ.వేల కోట్ల విలువైన పనుల్లో అవినీతి జరిగిందని, విచారణలో వీళ్ల అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారని, విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని, విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని చెప్పిందని, విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామన్నారు.

తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని, వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ వచ్చిందన్నారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని, కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారన్నారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని చెప్పారు.

53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారన్నారు. కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయాలని డిమాండ్ చేశారు. తాను సభలో మాట్లాడితే నన్ను సభ నుంచి మార్షల్స్ తో బయటకు పంపించారని, సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు.

అవి ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయిన్నారు. పవర్ ప్లాంట్స్ కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో తెలివి ప్రదర్శించారని, గంపగుత్తగా బీహెచ్ఎల్ కాంట్రాక్టు అప్పగించారని, బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వీళ్ల బినామీలు, బంధువులు, అనుయాయులకు ఇచ్చారని ఆరోపించారు.

WhatsApp channel

Read Entire Article