TG Crop Loan Waiver Scheme : రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ - తెరపైకి ఆ రెండు కార్డులు..? లెక్కలు తేల్చే పనిలో సర్కార్..!

3 months ago 62
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Crop Loan Waiver Scheme : రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ - తెరపైకి ఆ రెండు కార్డులు..? లెక్కలు తేల్చే పనిలో సర్కార్..!

TG Crop Loan Waiver Scheme Updates: రైతు రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం లోతుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు రాగా… కేబినెట్ భేటీలో అన్నింటిపై చర్చించి కీలక ప్రకటన చేయాలని సర్కార్ భావిస్తోంది.

తెలంగాణలో రైతు రుణమాఫీ

Telangana Crop Loan Waiver Scheme Updates : రుణమాఫీ పథకం అమలు పై తెలంగాణ సర్కార్ కసరత్తు షురూ చేసింది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  ఇదే అంశంపై రేవంత్ సర్కార్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది.

ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా చేయాలనే దానిపై అనేక మార్గాలను అన్వేషిస్తోంది. అధికారుల నుంచి పలు ప్రతిపాదనలను కూడా స్వీకరిస్తూ… మల్లగుల్లాలు పడుతోంది.  ఇచ్చిన హామీ ప్రకారం…. రుణమాఫీ ప్రక్రియను షురూ చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.

ఇటీవలే రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ ప్రక్రియ అమలు కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని కూడా చెప్పారు.

ఇదిలా ఉంటే… రైతుల రుణమాఫీ విషయంలో కీలక ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా అర్హులు ఎవరు అనే దానిపై సర్కార్ దృష్టిపెట్టింది. ఈ విషయంలో లోతుగా కసరత్తు చేసి… అర్హత ఉన్నవారికి మాత్రమే స్కీమ్ ను వర్తింపచేయాలని భావిస్తోంది.

తెరపైకి కొత్త నిబంధనలు…?

పంట రుణాల మాఫీ అమలుకు విధివిధానాలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. అధికారుల నుంచి వచ్చిన పలు ప్రతిపాదనల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకునే విషయంపై సర్కార్ ఆలోచించింది.

రుణమాఫీ స్కీమ్ కు అర్హత పొందే లబ్ధిదారుడికి తప్పనిసరిగా పాస్ బుక్ ఉండటంతో పాటు రేషన్‌ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ఆలోచిస్తుందంట..!  దాదాపు రాష్ట్రంలో రుణమాఫీ స్కీమ్ కోసం 60 లక్షల మందికిపైగా రైతులు ఎదురుచూస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో చాలా మందికి పాస్ బుక్ లు లేవు. వీరికి వర్తింపజేయాలా లేదా అనేది కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

ఇదే కాకుండా… రేషన్ కార్డును కూడా ప్రమాణికంగా తీసుకోవాలనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురికి రైతుబంధు వస్తుండగా… వారందరీకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేవు. కేవలం వారి కుటుంబ పెద్ద పేరు మీదనే కార్డు ఉంటోంది.  ఫలితంగా ఈ నిబంధను వర్తింపజేస్తే…. కుటుంబ పెద్ద మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేసే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఈ ప్రతిపాదన రాగా.. సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చూడాలి..!

ఇక ఆదాయపు పన్ను చెల్లించే వారిని పూర్తిగా పక్కనపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ మార్గదర్శకాలను  ప్రభుత్వం ప్రధానంగా పరిశీలిస్తోంది. ఈ స్కీమ్ లో కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పన్నులు చెల్లించే వారికి వర్తించదు. కేవలం రైతులకు మాత్రం వర్తిస్తుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పలు పదవుల్లో ఉండే వారిని కూడా ఈ స్కీమ్ ను మినహాయించారు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలు కూడా ఈ స్కీమ్ కు సంబంధించి ఉన్నాయి.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్ ) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది..? ఫలితంగా అసలు రైతులకు మేలు జరుగుతుందా..? ఈ స్కీమ్ ను విజయవంతంగా అమలు చేయటంలో ఈ గైడ్ లైన్స్ ఎంతవరకు పని చేస్తాయనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. 

కేబినెట్ భేటీ - కటాఫ్ తేదీని నిర్ణయిస్తారా..?

జూన్ 21వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీపైనే చర్చించనున్నారు. అయితే స్కీమ్ గైడ్ లైన్స్, అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, కటాఫ్ తేదీపై లోతుగా చర్చించనున్నారు.

ప్రస్తుతం ఉన్న రుణాలు ఎన్ని…? కటాఫ్ తేదీని నిర్ణయించటం, అధిక సంఖ్యలో రైతులకు లబ్ధి చేకూర్చే మార్గాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దాదాపు ఈ సమావేశం తర్వాత…. కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఆగస్టు 15వ తేదీ నాటికే రుణాలను మాఫీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో… సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పట్టాలెక్కించాలని సర్కార్ చూస్తోంది. జూలై నుంచి ప్రారంభించి… విడతలవారీగా ఆగస్టు 15వ తేదీలోపు రుణాలను మాఫీ చేసే అవకాశం ఉంది.

Read Entire Article