TG DSC 2024 Updates : డీఎస్సీకి భారీగా దరఖాస్తులు - ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ..! జూలై 17 నుంచి పరీక్షలు

2 months ago 56
ARTICLE AD

TS DSC 2024 Updates : తెలంగాణ డీఎస్సీ 2024 అప్లికేషన్ల ప్రక్రియ పూర్తైంది. అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. జూలై 17వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్త అప్లికేషన్లు వచ్చాయి.

గతేడాది చివర్లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను(TS DSC Notification 2024) కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పోస్టులను సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ కొత్త నోటిఫికేషన్ లో భాగంగా 11,062 ఖాళీలను భర్తీ చేయనుంది. అయితే గతంలో కేవలం 5వేలకుపైగా పోస్టులతోనే నోటిఫికేషన్ వచ్చింది.

ఈసారి డీఎస్సీ దరఖాస్తుల లెక్కలు చూస్తే….. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి వచ్చాయి. దాదాపు 27 వేలకు పైగా అప్లికేషన్లు రాగా…. నల్గొండ నుంచి 15వేలకు పైగా వచ్చాయి. అతి తక్కువగా మేడ్చల్‌ జిల్లా నుంచి 3వేల లోపు దరఖాస్తులు అందాయి. మొత్తం దరఖాస్తులను పోస్టులతో పోల్చితే… ఒక్కో ఉద్యోగానికి 25 మంది పోటీ పడే అవకాశం ఉంది.

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. జూన్ 20వ తేదీతో డీఎస్సీ దరఖాస్తుల గడువు పూర్తి అయింది. మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. నిజానికి ఏప్రిల్ 3వ తేదీతోనే దరఖాస్తుల గడువు పూర్తి కావాల్సి ఉండేది. కానీ టెట్ ఫలితాల విడుదల నేపథ్యంలో… జూన్ 20వ తేదీ వరకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. కొత్తగా టెట్ లో క్వాలిఫై అయినవారి కోసం గడువును పొడిగించింది. ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రాయితీ అవకాశాన్ని 23,919 మంది వినియోగించుకున్నారు.

జూలై 17 నుంచి డీఎస్సీ పరీక్షలు

జులై 17 నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. జూలై 31వ తేదీ వరకు వరకు ఆన్‌లైన్‌ లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.

డిఎస్సీ 2024(TS DSC Exam 2024) ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.

డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ *(TS TET Exam)వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

హాల్ టికెట్లు విడుదల…..

TGPSC Hostel Welfare Officer Hall Ticket : హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వీటిని TGPSC వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్‌ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 29వ తేదీవ తేదీతో పూర్తి కానున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత (CRBT)విధానంలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ఈ ఉద్యోగాల భర్తీ కోసం 2 పేపర్లతో కూడిన పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులు ఉంటాయి. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్) ఉంటాయి. 150 ప్రశ్నలు-150 మార్కులు అంటే ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో మాధ్యమాల్లో ఉంటాయి.

Read Entire Article