TG EAPCET Counselling : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే

2 months ago 47
ARTICLE AD

TG EAPCET Counselling 2024 Updates: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ కు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ఉన్నత విద్యామండలి ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. జూన్ 27వ తేదీ నుంచే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. అయితే ఈ షెడ్యూల్‌ ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. జులై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

కొత్త షెడ్యూల్ ప్రకారం…. జులై 6వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ విడతకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇది జూలై 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక జులై 8 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. జులై 19న ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయించనున్నారు.

TG EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 2024- కొత్త తేదీలు

జూలై 4, 2024 - ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.జూలై 6, 2024 నుంచి జూలై 13 వరకు - ధ్రువపత్రాల పరిశీలనజులై 8, 2024 నుంచి జూలై 15వ తేదీ వరకు - వెబ్ ఆప్షన్ల ఎంపికజూలై 19, 2024 - ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపుజులై 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్.జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లు.జులై 31వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు.ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ.ఆగస్టు 9వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన.ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం.ఆగస్టు 13వ తేదీ మూడో విడత సీట్ల కేటాయింపు.ఆగస్టు 28న స్పాట్‌ అడ్మిషన్ల గైడ్స్ లైన్స్ విడుదల.అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tsche.ac.in/

జూలై 23 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్….

జులై 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 31వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 9వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 13న సీట్ల కేటాయింపు ఉండగా… ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు ఛాన్స్ ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 22 వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ తో పాటు 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 27, 28 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 28న స్పాట్‌ అడ్మిషన్ల గైడ్స్ లైన్స్ విడుదల కానున్నాయి.

ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్‌ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో అబ్బాయిలు…. 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే అమ్మాయిలు…. 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Read Entire Article