TG Electricity Commission : విద్యుత్ విచారణ కమిషన్ నూతన ఛైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియామకం

1 month ago 50
ARTICLE AD

TG Electricity Commission Chairman : బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కమిషన్ వేసింది. ఈ కమిషన్ ఛైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా విద్యుత్ కమిషన్ కు కొత్త ఛైర్మన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఇంతకు ముందు విద్యుత్ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ నరసింహారెడ్డి వ్యవహరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వం నూతన ఛైర్మన్ ను మార్చింది.

విద్యుత్ కొనుగోలుపై విచారణ

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ విచారణ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డిని నియమించింది. విద్యుత్ కొనుగోలుపై తన వివరణ ఇవ్వాలని విద్యుత్ విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే కమిషన్ ఛైర్మన్ నిష్పాక్షపాతంగా లేరని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదని కొట్టివేసింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం.. విద్యుత్ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది.

అయితే విద్యు్త్ విచారణ కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌ కొట్టివేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కమిషన్ కొనసాగుతుందని, కొత్త ఛైర్మన్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి సుప్రీంకోర్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

ముందు హైకోర్టులో పిటిషన్

తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కమిషన్ ఏర్పాటుపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నారు. విద్యుత్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మరో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి నుంచి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరుకాలేదు. అయితే కమిషన్ కు 12 పేజీలతో కేసీఆర్ ఓ లేఖను రాశారు. అనంతరం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చి 14న జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్తు చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్ కు విచారణార్హత లేదని తన పిటిషన్ లో ప్రస్తావించారు. న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని… అలాంటి కమిషన్‌ ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. విద్యుత్తుపై విచారించే పరిధి ఎస్‌ఈఆర్సీకి మాత్రమే ఉంటుందని తన పిటిషన్ లో ప్రస్తావించారు. కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ కమిషన్ల చట్టం-1952లోని నిబంధనలతో పాటు విద్యుత్ చట్టం - 2023లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని వివరించారు. కమిషన్ నుంచి జారీ అయిన లేఖలను పక్కనపెట్టాలని కోరారు. అయితే కేసీఆర్ వాదనలతో ఏకీభవించని హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో కేసీఆఱ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

WhatsApp channel

Read Entire Article