TG Inter Admissions 2024 : విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

2 months ago 79
ARTICLE AD

Telangana Intermediate Board Updates : ఇంటర్ అడ్మిషన్లపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్జేట్ ఇచ్చింది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

Telangana State Board of Intermediate Education: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును పొడిగించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.

జులై 31వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశాల‌కు గ‌డువు పొడిగించిన‌ట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. తాజాగా పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావటంతో… గడువును పొడిగించారు.

ఇంటర్ అడ్మిషన్ల విషయంలో కూడా బోర్డు మరోసారి కీలక ప్రకటన చేసింది. బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డు సైట్ లో ఉంచినట్లు తెలిపింది. వాటిని చెక్ చూసుకున్న తర్వాతే… అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.

ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01 నుంచే ప్రారంభమయ్యాయి. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్లు నిర్థారిస్తారని ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్థారించిన రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని ఇంటర్ బోర్డు కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎస్సీలకు - 15 శాతం, ఎస్టీ- 10 శాతం, బీసీలకు-29 శాతం, పీహెచ్ -5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్ కోటా - 5 శాతం, ఎక్స్-సర్వీస్ మెన్ - 3 శాతం, ఈడబ్ల్యూఎస్- 10 శాతం సీట్లు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 33.3 శాతం అంటే 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయించాలని తెలిపింది.

అకాడమిక్ క్యాలెండర్ ఇదే….

ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు(Inter Half Yearly Exams) నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి(Sankranti 2025) అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది ఇంటర్ పరీక్షలు(IPE 2024-25 )

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు - ఫిబ్రవరి మెదటి వారం, 2025ఇంటర్ వార్షిక పరీక్షలు - మార్చి మొదటి వారం, 20252024-25 అకాడమిక్ క్యాలెండర్ చివరి పనిదినం- మార్చి 29, 2025వేసవి సెలవులు- మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకుఅడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు - మే చివరి వారం, 20252025-26 విద్యాసంవత్సంలో ఇంటర్ కాలేజీల రీఓపెన్ -జూన్ 2, 2025

ఈ విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజుల పాటు ఇంటర్ కాలేజీలు (Inter Colleges Working Days)పనిచేయనున్నాయి. 75 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

Read Entire Article