TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

3 months ago 85
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Iti Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Telangana ITI Admissions 2024 : తెలంగాణలోని ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ ఐటీఐ ప్రవేశాలు

తెలంగాణ ఐటీఐ ప్రవేశాలు (image source https://iti.telangana.gov.in/)

Telangana ITI Admissions 2024 : తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 సెషన్‌కు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. జూన్‌ 10వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

ఐటీఐ ప్రవేశాల ముఖ్య వివరాలు:

ప్రవేశాల ప్రకటన - ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రంకోర్సులు - ఐటీఐ కోర్సు (2024-25)అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్నింటినికి 8వ తరగతిని విద్యా అర్హతగా నిర్ణయించారు.ట్రేడ్ - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్వయోపరిమితి - 14 ఏళ్లు నిండి ఉండాలి.సీట్ల కేటాయింపు - అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోదరఖాస్తులు రుసుం - రూ. 100 చెల్లించాలి.దరఖాస్తులు ప్రారంభం - 16 మే , 2024దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 10 జూన్ , 2024.ఆన్ లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు. ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.అధికారిక వెబ్ సైట్ - https://iti.telangana.gov.in/దరఖాస్తు ఫారమ్ లింక్ - https://tsiti.ucanapply.com/

ఏపీలో ఐటీఐ ప్రవేశాలు…

AP ITI Admissions 2024 Notification: ఏపీలోని ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం వివరాలను పేర్కొంది. 2024-2025 సెషన్‌కు గాను ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశాలను కల్పించనుంది.

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పదో తరగతిలో పాస్ అయిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. https://iti.ap.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

ఏపీ ఐటీఐ కోర్సుల ముఖ్య వివరాలు :

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల ప్రకటన - ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం, విజయవాడఅర్హతలు - పదో తరగతిలో ఉతీర్ణత సాధించాలి.ట్రేడ్ కోర్సులు - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్,కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్వయసు - 14 ఏళ్లు నిండి ఉండాలి.దరఖాస్తు విధానం -ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో సమర్పించాలి. వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఎంపిక విధానం - పదో తరగతిలో సాధించిన మార్కలను చూస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది.ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి.పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అటెస్టేషన్చే యించుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తులు ప్రారంభం - మే 09, 2024.దరఖాస్తులకు చివరి తేదీ - జూన్ 063, 2024.ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లింక్ - https://itiadmissions.ap.gov.in/iti/open_application_entry.jsp అధికారిక వెబ్ సైట్ - https://iti.ap.gov.in/

IPL_Entry_Point

Read Entire Article