TG Politics : తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షుల ఎంపికపై ఉత్కంఠ- ఈసారి బీసీ నేతలకే ఛాన్స్!

2 months ago 52
ARTICLE AD

TG Politics : కాంగ్రెస్, బీజేపీ పార్టీల కొత్త అధ్యక్షులు ఎవరు అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఇటు బీజేపీలో కూడా రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడంతో కొత్త అధ్యక్షుడి అవసరం అనివార్యమైంది. దీంతో ఏ పార్టీకి ఎవరు చీఫ్ కానున్నారు అనేది ఆయా పార్టీల్లో,పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే బీజేపీ చీఫ్ గా ఎవరు ఉండబోతున్నారు అని కాంగ్రెస్......కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఎవరు ఉండబోతున్నారు అని బీజేపీ.....పరస్పరం దృష్టి పెట్టిన వాతవరణం రాష్ట్రంలో నెలకొంది.

బీసీ నేతలకే రెండు పార్టీలు మొగ్గు

అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన నేతనే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని ఆయా పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో పీసీసీ పదవిని ఓ బీసీ నాయకుడికే ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట. బీసీ నేతేనే పీసీసీ చీఫ్ గా నియమించాలని ఇటు రాష్ట్ర నాయకత్వం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిడి పెరుగుతుందంట. ఇటు బీజేపీ కూడా బీసీ నేతనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో అందరికంటే బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే వారిని దూరం చేసుకోకుండా ఇరు పార్టీలు బీసీ నేతేకే మొగ్గు చూపుతున్నాయి.

ప్రత్యర్థి పార్టీ వ్యూహాలపై కూడా నిఘా

ప్రత్యర్థి పార్టీ నాయకత్వానికి ధీటుగా సొంత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయిలో పటిష్ట చేయడం, ప్రజలకు దగ్గర అయ్యేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోవడం, పై చెయ్యి సాధించేందుకు వ్యూహాలు రూపొందించుకోవడం అన్నీ పార్టీల్లో సహజంగా ఉండేదే. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఆ పార్టీకి కొత్త సారథి ఎవరు? ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? దాంతో రాజకీయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశాలపై రెండు పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రత్యర్థి పార్టీకి నాయకత్వం ఎవరో తెలిన తరువాతే తమ పార్టీ అధ్యక్షుడిని ప్రకటించేందుకు రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు నియమించే విషయంలో గతంలో ఎన్నడూ లేని ఆందోళన,అలజడి ఈసారి రెండు పార్టీలో కనిపిస్తున్నాయి. కాగా ఫలానా వ్యక్తి వస్తే సొంత పార్టీ ఓటు బ్యాంక్ పై ఎఫెక్ట్ పడుతుందా? ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చిలుతుందా? అనే కోణంలో కూడా ఇరు పార్టీలు ఆలోచిస్తున్నాయట.

నేతల మధ్య అంతర్గత పోరు

ఇదిలా ఉంటే సీనియర్, జూనియర్ నేతల మధ్య కూడా కొత్త అధ్యక్షుడు చిచ్చు మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జూనియర్, సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు బలంగా ఉందనే చెప్పాలి. ఫలానా వ్యక్తికి దక్కే అవకాశం ఉంది అంటూ ప్రచారం రాగానే నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వ్యూహాలకు కూడా కసరత్తు జరుగుతుంది. సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి పెరిగితే నిర్ణయంలో మార్పు ఉంటుంది అని ఈ వ్యూహం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. కాంగ్రెస్, బీజేపీలకు కొత్త చీఫ్ లను హైకమాండ్ ప్రకటించే సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవేళ రాకూడదన్న వ్యక్తికే ఆ అవకాశం దక్కితే పూర్తి స్థాయి దృష్టి కేంద్రకరించలేని విధంగా రకరకాల సమస్యలతో ఒత్తిడి పెంచేలా, నిత్యం ఇరుకున పెట్టేలా విమర్శలు, ఆరోపణలతో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి లేకుండా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఏ పార్టీకి ఎవరు చీఫ్ గా వస్తారో అనేది తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Read Entire Article