TG Raithu Runa Mafi: అసెంబ్లీలో రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, 6.40లక్షల మందికి రుణమాఫీ నిధుల చెల్లింపు

1 month ago 52
ARTICLE AD

TG Raithu Runa Mafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణ మాఫీ నిధులను ముఖ‌్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. లక్షన్నర లోపు రుణాలకు సంబంధించిన నిధులను విడుదల చేశారు.

తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల

తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల

TG Raithu Runa Mafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణ మాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. లక్షన్నర లోపు రుణాల మాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేశారు. తెలంగాణలోని 17పార్లమెంటు నియోజక వర్గాల నుంచి లబ్దిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.2లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేశారు. తెలంగాణలో 11,34,412 మందికి రూ.6034 కోట్లను ఇప్పటికే చెల్లించారు.

రెండో విడతలో 6,40,223మందికి రూ. 6190 కోట్లను విడుదల చేశారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ లబ్ది పొందిన వారిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో, చివరి స్థానంలో హైదరాబాద్‌ ఉంది.

2024 మే6న వరంగల్ ఆర్ట్స్‌ కాలేజీలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించామని దానిని నిలబెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.  తన ప్రకటనను గత ప్రభుత్వ నేతలు హేళన చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ అసలు కంటే వడ్డీలకే సరిపోయిందన్నారు. రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్నా రుణమాఫీ చేయలేదన్నారు.రూ.19వేల కోట్ల అంచనాలు వేసి నాలుగు విడతల్లో చెల్లింపులు చేసి రూ.7వేలు కోట్లను మాత్రమే చెల్లించారన్నారు. రెండు విడతల్లో రూ. 25వేల కోట్లను మాత్రమే చెల్లించారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో పాటు 566 రైతు వేదికల్లో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గం నుంచి 15మంది లబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో అన్ని పార్లమెంటు సెగ్మెంట్‌ల నుంచి వచ్చిన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఇప్పటికే రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.1.50 లక్షల లోపు వ్యవసాయ రుణాలను జూలై 31లోగా మాఫీ చేస్తామన్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీలో జరిగే కార్యక్రమంలో లక్షన్నర లోపు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంగళవారం సాయంత్రంలోగా లబ్దిదారుల ఖాతాలకు నగదు జమ చేస్తారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఆగస్టు నాటికి మొత్తం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తవుతుందని చెప్పారు.

దేశ చరిత్రలో ఇదే ప్రథమం…

ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని చెబితే సాధ్యం కాదని ఎద్దేవా చేశారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పారు. రూ.31వేల కోట్లను రుణమాఫీ చేసిన చరిత్ర గతంలో లేదని, బ్యాంకర్లు కూడా రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని అన్నం పెట్టే రైతాంగానికి రుణాలు ఇచ్చే విషయంలో  మానవీయంగా వ్యవహరించాలని సూచించారు.  దేశంలో ఎప్పుడూ ఇలా ఒకేసారి రూ.31వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర రాష్ట్రాలకు లేదన్నారు. 

మొదటి విడత రైతు రుణమాఫీలో 17వేలమందికి సాంకేతిక కారణాలతో నగదు జమ కాలేదని వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పారు. వారిలో తప్పులు సరిచేసి 8వేల మందికి రుణాలు మాఫీ చేశామన్నారు.  ఆధార్‌ కార్డులో తప్పులు, బ్యాంకు అకౌంట్లలో తప్పులు, అధికారుల తప్పిదాలే తప్ప అర్హులైన ప్రతిఒక్కరికి రుణమాఫీ చేస్తున్నట్టు చెప్పారు.  ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే వెంటనే అధికారుల్ని సంప్రదించాలని సూచించారు. 

వ్యవసాయాన్ని పండుగ చేస్తాం…సిఎం రేవంత్‌

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పినట్టే రైతాంగానికి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు రుణమాఫీ కార్యక్రమానికి హాజరైన సిపిఐ, బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 

బ్యాంకుల్ని మోసం చేసే ఉద్దేశంతో రుణాలు తీసుకుని, దివాళా తీసాయని మభ్య పెట్టి దాదాపు రూ.14లక్షల కోట్ల రుపాయలు బ్యాంకులకు ఎగవేశారని చెప్పారు. దేశంలో రైతులు ఏ మూలన ఉన్నా రైతు పదిమందికి సాయపడటానికి, తాను అప్పుల పాలైనా పదిమందికి సాయపడాలనే ఉద్దేశంతో అప్పులు చేసి పంటలు పండిస్తున్నాడన్నారు. పండిన పంటలకు ఆశించిన ధర రాకపోవడం, వివిధ కారణాలతో  నష్టపోతున్నారని చెప్పారు. అధిక పన్నులతో అప్పులు చేసి సాగు చేస్తున్నారని, అప్పుల పాలైన వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఆగస్టు నెలాఖరులోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. జూలై, ఆగస్టలో చరిత్రలో నిలిచిపోతాయని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ.31వేల కోట్ల రుణమాఫీని చేయలేదన్నారు. రైతులను ఆదుకోడానికి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఎన్నికలు లేవని, రాజకీయ ప్రయోజనాలు  కోసం కాకుండా ఏ ఎన్నికలు లేని సమయంలో రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. 

రైతులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్ అడగలేదని బ్యాంకర్లు గుర్తుంచుకోవాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. గత ప్రభుత్వం చేసిన రూ.7లక్షల కోట్ల రుపాయల అప్పుల్లో రూ.43వేల కోట్ల రుపామయల అప్పులు భట్టి విక్రమార్క ఆర్థికమంత్రి తీర్చారన్నారు.  ప్రతి నెల రూ.5వేల కోట్ల రుపాయలు జీతాలుగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. రైతులకు 12 రోజుల్లో రూ.12500కోట్లు చెల్లించిన ఆర్థిక శాఖను అభినందించారు. 

WhatsApp channel

Read Entire Article