TG Text Books: పాఠ్య పుస్తకాల పంపిణీ పరేషాన్, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో సర్వత్రా ఆందోళన

3 months ago 60
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Text Books: పాఠ్య పుస్తకాల పంపిణీ పరేషాన్, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో సర్వత్రా ఆందోళన

TG Text Books: వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు పాఠ్యపుస్తకాల పంపిణీ గందరగోళంగా మారింది. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయంతో పాఠ్యపుస్తకాల పంపిణీకి బ్రేక్ పడింది.

తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలనే ఆదేశాలపై అసంతృప్తి

తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలనే ఆదేశాలపై అసంతృప్తి

TG Text Books: తెలంగాణలో ఇదివరకే పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రభుత్వ పాఠశాలల టీచర్ లు పిల్లలకు ఇచ్చిన పుస్తకాలను లాక్కున్నారు. పాఠ్యపుస్తకాలు ఇచ్చి 24 గంటలు గవడకముందే వెనక్కి తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

బ్రేక్ వేసిన ముందుమాట

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకంలో ముందుమాటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉండడమే పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీకి బ్రేక్ వేసిందా?.. అంటే అవుననే సమాదానం వస్తుంది.

తెలంగాణలో 12 ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభంకాగ తొలి రోజే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 90 శాతం పుస్తకాలను పిల్లలకు పంపిణీ చేశారు. ఒక రోజు గడిచాక పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయవద్దని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఒక వేళ పంపిణీ చేస్తే వెనక్కి తీసుకోవాలని సూచించింది.

దీంతో అధికారులు వెంటనే పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని టీచర్లను ఆదేశించడంతో ఆగమేఘాలపై టీచర్స్ పిల్లలకు ఇచ్చిన పుస్తకాలను లాక్కున్నంత పని చేశారు. పంపిణీ చేసిన పుస్తకాలను టీచర్ లు వెనక్కి తీసుకోవడంతో విద్యార్ధులు, అధ్యాపకులు విస్మయం వ్యక్తం చేశారు.

ముందుమాట పేజీ కట్ చేసిన టీచర్ లు

ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయంతో పాఠ్యపుస్తకాల పంపిణీకి బ్రేక్ పడడంతో రకరకాల చర్చ సాగుతుంది. విద్యా బోధనకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు పాఠశాలల టీచర్ లు తెలుగు వాచకంలోని ముందుమాట పేజీని కట్ చేసి విద్యాబోధన చేస్తున్నారు.

ఆ పాఠ్యపుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళకుండా స్కూల్ లోనే పెట్టేలా చర్యలు చేపట్టారు. కొత్త పుస్తకాలు ప్రింట్ చేసి పంపిస్తారా?.. లేక ఆ తెలుగువాచకంలోని ముందుమాట పేజీని తొలగించి మరో పేజీ పేస్ట్ చేస్తారా అనేది స్పష్టత లేక పోవడంతో అటు విద్యార్ధులు, ఇటు టీచర్ లు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.

ఒక్క పేజీ కోసం కోట్లాది రూపాయల విలువ చేసే పాఠ్యపుస్తకాల పంపిణీని నిలిపివేయడం సరైన పద్దతి కాదంటున్నారు ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు. ముందుమాటను ఎవరు పట్టించుకునే అవకాశమే లేదని అలాంటి పరిస్థితిలో పాఠ్యపుస్తకాల పంపిణీని నిలిపివేయడం సమంజసంగా లేదంటున్నారు.

తెలుగువాచకంలో ముందుమాట పేజీ విషయంలోనే ప్రభుత్వం ఇలా పేచీ పెడితే సోషల్ పాఠ్యపుస్తకంలో తెలంగాణ రాష్ట్ర సాధన కేసిఆర్ వల్లే సాద్యమయ్యిందని తెలంగాణ ప్రధాత కేసిఆర్ అని పాఠ్యాంశం ఉంది. మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కృషి ఫలితంగానే తెలంగాణా సిద్దించిందని భావిస్తున్న కాంగ్రెస్, సోషల్ సబ్జెక్ట్ ను రద్దు చేసి కొత్త సెలబస్ తో పాఠ్యపుస్తకం రూపొందిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేసీఆర్ పేరో లేక అతని గురించో పాఠ్యపుస్తకాల్లో లేకుండా చూడాలంటే వేసవి సెలవుల్లో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పంథాలకు పోకుండా ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాలు వృధాకాకుండా చూడాలని కోరుతున్నారు.

అక్కడ అలా... ఇక్కడ ఇలా..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు సర్కార్ పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తుంది. పాఠ్యపుస్తకాల్లో కేసిఆర్ పేరుతో ఉండడంతో పుస్తకాల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయగా అందుకు భిన్నమైన ఆలోచనతో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణలో హర్షం వ్యక్తమవుతుంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాద్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థులకు పంపిణీ చేసే బ్యాగ్ లలో ఎలాంటి మార్పు లేకుండా పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడాన్ని తెలంగాణ టీచర్ లు స్వాగతిస్తున్నారు. బ్యాగ్ ల విషయంలో మార్పులేకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ తెలంగాణలో ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాల విషయంలో ఎలాంటి మార్పు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Read Entire Article