TGPSC Group 4 Updates : గ్రూప్‌ 4 సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే...!

2 months ago 58
ARTICLE AD

TSPSC Group-4 Certificate Verification: గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కోసం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులతో కూడిన జాబితా ఇటీవలే విడుదలైంది. వారి ధ్రువపత్రాలను పరిశీలించి… తుది జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ప్రకటించింది.

షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్‌ 20వ తేదీన ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 21వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది.

కమిషన్ నిర్ణయించిన తేదీల్లో కాకుండా ఎవరైనా గైర్హాజరైతే వారికి కూడా టీఎస్పీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. ఆగస్టు 24, 27, 28, 29, 31 ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.

కావాల్సిన పత్రాలివే:

అభ్యర్థుల ప్రాథమిక వివరాలతో కూడిన చెక్‌లిస్ట్‌ ఉండాలి. ఇది కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.హాల్‌టికెట్‌అప్లికేషన్ ఫారమ్ - రెండు సెట్లు కావాలి.పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ - SSC మెమోస్థానికత నిర్ధారణ కోసం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు బొనఫైడ్ సర్టిఫికెట్లుప్రొవిజినల్‌, కాన్వొకేషన్‌ సర్టిఫికెట్‌, మెమోలు బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్ ను సమర్పించాలి. వివాహిత మహిళలకు ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనిటీ సర్టిఫికెట్‌, నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్లు భర్త పేరుతో ఉంటే అనుమతి లేదు.ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులైతే EWS ధ్రువీకరణ(2021 - 22) పత్రం ఉండాలి.దివ్యాంగ అభ్యర్థులు సదరం సర్టిఫికెట్‌ ను సమర్పించాలి.ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులుగా ఉంటే పని చేస్తున్న సంస్థ నుంచి NOC(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి.గెజిటెడ్‌ అధికారి సంతకంతో ఉన్న 2 అటిస్టేషన్‌ కాపీలు ఉండాలి.నిరుద్యోగి అని తెలిపే డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ ఫామ్ కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.నోటిఫికేషన్ పేర్కొన్న పోస్ట్‌ కోడ్‌ 70కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు తాము హిందువు అని తెలిపే డిక్లరేషన్‌ తప్పనిసరిగా వెళ్లాలి.పోస్ట్‌కోడ్‌ 94, 95కు ఉద్యోగాలకైతే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి.మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఉండాలి.

మెరిట్‌ లిస్ట్‌‌లో చోటు దక్కించుకున్న అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. 8130 పోస్టులకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు పోటీ పడనున్నారు. వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసిన వారికి మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అనుమతించనున్నారు.

గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భ‌ర్తీ చేయనున్నారు. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ఇప్పటికే ప్రకటించారు . గ్రూప్‌ 4 చెక్‌ లిస్ట్‌ కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌ను https://www.tspsc.gov.in/ చూడొచ్చు.  గత ఏడాది జులైలో గ్రూప్ 4 పరీక్షల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

హాల్ టికెట్లు విడుదల

TGPSC Hostel Welfare Officer Hall Ticket : హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వీటిని TGPSC వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్‌ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 29వ తేదీవ తేదీతో పూర్తి కానున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత (CRBT)విధానంలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ఈ ఉద్యోగాల భర్తీ కోసం 2 పేపర్లతో కూడిన పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులు ఉంటాయి. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్) ఉంటాయి. 150 ప్రశ్నలు-150 మార్కులు అంటే ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో మాధ్యమాల్లో ఉంటాయి.

Read Entire Article