TS TET DSC 2024 Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - టెట్ ఫలితాలతో వెబ్ సైట్ లో కొత్త ఆప్షన్, వెంటనే ఇలా చేయండి..!

3 months ago 62
ARTICLE AD

Telangana TET DSC 2024 Updates : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది విద్యాశాఖ. కొత్తగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో మరోసారి ఎడిట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… టెట్ 20024లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఫ్రీగా అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

గతేడాది చివర్లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను(TS DSC Notification 2024) కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పోస్టులను సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. 11,062 ఖాళీలను భర్తీ చేయనుంది. అయితే గతంలో కేవలం 5వేలకుపైగా పోస్టులతోనే నోటిఫికేషన్ వచ్చింది.

ఫలితంగా పలు జిల్లాల్లో ఖాళీలు లేకుండా పోయాయి. ఫలితంగా చాలా మంది అభ్యర్థులు ఓపెన్ కోటాలో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం పోస్టుల సంఖ్య పెరగటంతో గతంలోనే వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఫలితంగా చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను అప్డేట్ చేసుకున్నారు.

తాజాగా టెట్ ఫలితాలు రావటంతో… మరోసారి వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.. ఇక ఈ ఎడిట్ ఆప్షన్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని… ఆ తర్వాత ఓపెన్ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది.  జులై 17 నుంచి 31 వరకు  ఆన్‌లైన్‌ లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా… మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/  దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి ప్రత్యేకంగా అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 

ఎడిట్ ఆప్షన్ ప్రాసెస్….

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… https://schooledu.telangana.gov.in/ISMS/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.Click Here for Direct Recruitment of TS DSC - 2024 అనే అప్షన్ పై క్లిక్ చేయాలి.EDit Post Applied అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి Candidate's Aadhaar No, Payment Reference IDని ఎంట్రీ చేసి సెర్చ్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.ఓపెన్ అయిన దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్మాత తిరిగి సబ్మిట్ చేయాలి.ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇక టెట్ పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు కూడా https://schooledu.telangana.gov.in/ISMS/  వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయటంతో పాటు అప్డేట్ చేసుకోవచ్చు.

తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.

డిఎస్సీ 2024(TS DSC Exam 2024) ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. 

డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ *(TS TET Exam)వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

Read Entire Article