UGC NET June Admit Card 2024 : యూజీసీ నెట్ జూన్ సెషన్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

3 months ago 70
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ugc Net June Admit Card 2024 : యూజీసీ నెట్ జూన్ సెషన్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

UGC NET June Admit Card 2024 Updates : యూజీసీ నెట్‌ 2024 హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

యూజీసీ నెట్‌-2024 అడ్మిట్‌కార్డులు విడుదల

యూజీసీ నెట్‌-2024 అడ్మిట్‌కార్డులు విడుదల

UGC NET June Admit Card 2024 Updates : యూజీసీ నెట్‌ 2024 (జూన్ సెషన్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

UGC NET June Admit Card 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి

యూజీసీ నెట్ (జూన్ సెషన్) 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.హోంపేజీలో కనిపించే  UGC NET Admit Card 2024 లింక్ పై క్లిక్ చేయాలి.ఇక్కడ మీ Application number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి అడ్మిట్ కార్డు కాపీని పొందవచ్చు.

ఈ పరీక్ష జూన్ 18వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.  పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది.ఇక రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు నిర్వహిస్తారు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు కేంద్ర విశ్వవిద్యాలయాలతో పాటు రాష్ట్రంలో ఉండే వర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన వారికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కూడా ఇస్తారు.

Read Entire Article