Artificial Intelligence Training 2023: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉచిత శిక్షణ.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..!

1 year ago 587
ARTICLE AD

Artificial Intelligence Training 2023: దేశంలోని యువతకి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉచిత AI (artificial intelligence training program 2023) ఆధారిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌కు AI ఫర్ ఇండియా 2.0 అని పేరు పెట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రోగ్రాంని ప్రారంభించారు. ఈ శిక్షణ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో చేరిన యువత AI గురించి బేసిక్‌ సమాచారాన్ని తెలుసుకుంటారు. 

ఇది వరల్డ్ యూత్ స్కిల్స్ డే అంటే జూలై 15న ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్యవేక్షణలో ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ స్కిల్ ఇండియా, ఐఐటి మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ కంపెనీ జియువిఐ జాయింట్ వెంచర్‌. దేశం భౌగోళిక పరిస్థితులు, బహుభాషా విధానం కారణంగా ప్రస్తుతం ఇది తొమ్మిది భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠీ, గుజరాతీలలో శిక్షణ తీసుకోవచ్చు


ఇలా నమోదు చేసుకోండి..? ఈ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఇచ్చిన లింక్‌ను (https://www.guvi.in/ai-for-india/#tatsu-section-V6VE9tukoeI) ఓపెన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. ఇందులో అడిగిన సమాచారాన్ని అందించి నమోదును పూర్తి చేయాలి. ఆగస్టు 15న వర్చువల్ ఈవెంట్‌లో చేరి ఇచ్చిన సమయానికి అనుగుణంగా ప్రాజెక్ట్‌ను సమర్పించాలి. 14 ఆగస్టు 2023 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియని క్లోజ్‌ చేస్తారు. మొత్తం కంటెంట్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన యువతకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ అవకాశం ఇవ్వబోతోంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. యువత కెరీర్‌లో ఎప్పుడైనా దీనిని ఉపయోగించుకోవచ్చు


Read Entire Article