TSPSC | టీఎస్‌పీఎస్సీ తరహాలో గురుకుల కొలువులకు ఓటీఆర్‌.. నేటి నుంచే అమలు

1 year ago 608
ARTICLE AD

TSPSC | గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్‌) నేటినుంచి (బుధవారం) వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఓటీఆర్‌ నమోదు ద్వారా వచ్చే నంబర్‌తో నోటిఫికేషన్లవారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నది.

ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చే సమయంలోనే ఓటీఆర్‌పై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఓటీఆర్‌ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొన్నది. ఒక్కసారి ట్రిబ్‌లో ఓటీఆర్‌ చేసుకొంటే.. ఇక ప్రతిసారి దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. ట్రిబ్‌ ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటికీ పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17తో ప్రారంభం అవుతుంది. 17 నుంచి గురుకుల డిగ్రీ, గురుకుల జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు, 24 నుంచి పీజీటీ, స్కూల్‌ లైబ్రేరియన్‌, స్కూల్‌ పీడీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌, 28 నుంచి టీజీటీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ప్రతి ఉద్యోగానికి సగటున నెలపాటు దరఖాస్తు గడువు ఇచ్చారు. అభ్యర్థులందరూ చివరిదాకా వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఓటీఆర్‌తోపాటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ట్రిబ్‌ సూచిస్తున్నది.

Read Entire Article